ఏటుకూరి వెంకట నరసయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఏటుకూరి వెంకట నరసయ్య
Etukuri venkata narasaiah.jpg
ఏటుకూరి వెంకట నరసయ్య
జననం ఏటుకూరి వెంకట నరసయ్య
ఏప్రిల్ 1, 1911
గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు
మరణం నవంబర్ 10, 1949
గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు
వృత్తి అధ్యాపకుడిగా పనిచేశాడు
ప్రసిద్ధి మానవతావాది, కవి
మతం హిందూ మతము
పిల్లలు నలుగురు పిల్లలు

కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్య (ఏప్రిల్ 1, 1911 - నవంబర్ 10, 1949) క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, హేతువాది, మానవతావాది, కవి.

జననం[మార్చు]

ఈయన గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడులో 1911, ఏప్రిల్ 1గండికోట కమ్మ కుటుంబంలో, తల్లితండ్రులకు ఐదుగురు కుమారులులలో రెండవవాడుగా జన్మించాడు. చినగూడూరు, అమృతలూరు మరియు సిద్ధాశ్రమం (తెనాలి తాలూకా) లో విద్యాభ్యాసం జరిగింది. కవిరాజు త్రిపురనేని ప్రభావంతో పరస తాళ్ళూరు గ్రామానికి చెందిన యువతితో దండల వివాహం చేసుకొన్నాడు. నలుగురు పిల్లలు. బెంగాలీ సంస్కృతి ప్రభావంతో కుమారులకు రవీంద్రనాథ్ (చనిపోయాడు), హిమాంశు రాయ్ (విశ్రాంత ఉప తహసిల్దారు) అని నామకరణం చేశాడు. కుమార్తెలు ఝాన్సీ లక్ష్మి, మాంచాల. తొలుత గురిజాల ఆ తరువాత నిడుబ్రోలు జిల్లా పరిషత్‌ హైస్కూలులో (1948 -1949 ) అధ్యాపకుడిగా పనిచేశాడు. కొండవీటి వెంకటకవి, అభ్యుదయ మానవతావాది ఐన ఆవుల గోపాలకృష్ణమూర్తి ఇతనికి సన్నిహితులు. ఎం.ఎన్.రాయ్ ఉద్బోధించిన పునర్వికాసం, వైజ్ఞానిక ధోరణికి ఊతమివ్వటానికై ఆవుల గోపాల కృష్ణమూర్తి త్రిపురనేని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలకు విస్తృతంగా ప్రచారం కల్పించాడు.

రచనలు[మార్చు]

క్షేత్రలక్ష్మి -పద్య కావ్యం, పల్నాటి యుద్ధం నేపథ్యంగా పలనాటి వీరచరితము (ఇది ఐదు భాగాలు - అలుగురాజు (రెండు భాగాలు, నాయకురాలు, అలరాజు, మాంచాల ), నీతిమంజరి, రైతు హరికథ, సిద్ధాశ్రమము, ప్రేమ లోకం (గ్రామీణ ప్రేమ గాథ), అంగద రాయబారము (లభించుటలేదు).

చందమామ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించింది. గోవాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, ఏటుకూరి వెంకట నరసయ్య పేరు పై సాహిత్యకృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చేలా ఒక బహుమతిని నెలకొల్పింది.

మరణం[మార్చు]

1949, నవంబర్ 10 న మరణించారు.

బయటి లింకులు[మార్చు]