Jump to content

బహుమతి (ప్రైజ్)

వికీపీడియా నుండి

బహుమతి అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి (క్రీడా బృందాలు, సంస్థలు) వారు సాధించిన విజయాలను గుర్తించి, అభినందించి అందించే అవార్డు.[1] అధికారిక బహుమతులు తరచుగా నగదుతోనూ, వాటితో వచ్చే కీర్తిని కలిగి ఉంటాయి. అకాడమీ అవార్డ్స్ వంటి కొన్ని బహుమతుల ప్రదానంకోసం వేడుకలు నిర్వహించబడుతాయి.

ఇండోనేషియాలోని షాపింగ్ మాల్‌లో కారు బహుమతి

ఆదర్శప్రాయమైన విధానాన్ని ప్రచారం చేయడానికి, మెరుగైన ఫలితాలు, పోటీ ప్రయత్నాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కూడా బహుమతులు ఇవ్వబడతాయి.[1] అయినప్పటికీ, అనేక బహుమతులు, ముఖ్యంగా ప్రసిద్ధమైన బహుమతులు తరచుగా వివాదానికి, అసూయకు కారణమవుతున్నాయి.

రకాలు

[మార్చు]
  • బూబీ ప్రైజ్: సాధారణంగా చివరిగా నిలిచిన వారికి (ఉదా, చెక్క చెంచా అవార్డు ) అవమానంగా ఇవ్వబడుతుంది.
  • కన్సోలేషన్ ప్రైజ్: గెలవకపోయినా గుర్తింపు పొందేందుకు అర్హులుగా భావించే వారికి ఇచ్చే అవార్డు.
  • వరుపక్రమ బహుమతులు: ఉత్తమ అవార్డు "మొదటి బహుమతి" ("గ్రాండ్ ప్రైజ్", "గోల్డ్ మెడల్ ". ఇతర అవార్డులు "రెండవ బహుమతి" ("ఫస్ట్ రన్నర్-అప్", " సిల్వర్ మెడల్ ") గానూ, "మూడవ బహుమతి" ("సెకండ్ రన్నరప్", "కాంస్య పతకం") గానూ ఉంటాయి.
  • కొనుగోలు బహుమతి: విజేత పనికి బదులుగా ఆర్ట్ పోటీలో ఇచ్చే నగదు బహుమతి.
    2021 స్కేట్ పోటీలో బహుమతిగా ఉచిత స్కేట్‌బోర్డ్ డెక్‌ని అందుకున్న స్కేట్‌బోర్డర్లు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Prize, definition 1, The Free Dictionary, Farlex, Inc. Retrieved August 7, 2009.

బయటి లింకులు

[మార్చు]

Media related to Prizes at Wikimedia Commons