అక్షాంశ రేఖాంశాలు: 16°07′13″N 80°39′31″E / 16.120408°N 80.658574°E / 16.120408; 80.658574

అమృతలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతలూరు
—  రెవిన్యూ గ్రామం  —
అమృతలూరు is located in Andhra Pradesh
అమృతలూరు
అమృతలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′13″N 80°39′31″E / 16.120408°N 80.658574°E / 16.120408; 80.658574
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం అమృతలూరు మండలం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ Devarakonda Ramu
జనాభా (2001)
 - మొత్తం 6,868
 - పురుషుల సంఖ్య 3,458
 - స్త్రీల సంఖ్య 3,410
 - గృహాల సంఖ్య 1,833
పిన్ కోడ్ 522325
ఎస్.టి.డి కోడ్ 08644

అమృతలూరు, ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లాలోని గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1963 ఇళ్లతో, 6524 జనాభాతో 1499 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3297, ఆడవారి సంఖ్య 3227. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2382 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 524. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590392[1].పిన్ కోడ్: 522325. ఎస్.టి.డి కోడ్ = 08644.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6868. ఇందులో పురుషుల సంఖ్య 3458, స్త్రీల సంఖ్య 3410, గ్రామంలో నివాసగృహాలు1833 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1499 హెక్టారులు.

గ్రామం పేరువెనుక చరిత్ర

[మార్చు]

అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. అమృతలూరు గ్రామాన్ని వాడుకలో "అమర్తలూరు" అని కూడా అంటారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]
 • ఈ గ్రామం, తెనాలి పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది.
 • లోక్‌సభ నియోజకవర్గం: బాపట్ల
 • శాసనసభ నియోజకవర్గం: వేమూరు
 • రెవెన్యూ డివిజను: తెనాలి.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో యలవర్రు, గోవాడ, తురుమెళ్ళ, మోపర్రు, పెదపూడి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొన్నూరులోను, మేనేజిమెంటు కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పెదపూడిలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అమృతలూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అమృతలూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అమృతలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 184 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 9 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1306 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1306 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అమృతలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1276 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 30 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అమృతలూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుము, పెసర

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

బూరగుంట చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016, మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించింది.

2020 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో shri devarakonda Ramu , సర్పంచిగా

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
 • శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ పరుచూరి సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.
 • గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్థులు, 2014, ఆగస్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు.
 • శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
 • శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
 • శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం:-
 • శ్రీ రామాలయం:- స్థానిక ఎస్.టి.కాలనీలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మసటిరోజున గ్రామములో అన్నదానం నిర్వహించెదరు.
 • శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం.
 • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం.
 • శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయం:- దాతల సహకారంతో గ్రామమంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-5వ తేదీ శుక్రవారంనుండి ప్రారంభమగును. 5వ తేదీ శుక్రవారంనాడు అఖండ స్థాపన, పుణ్యాహవచనం, 6వ తేదీ శనివారంనాడు, నిత్యనిధి, వాస్తుపూజ, మంటపారధన కార్యక్రమలు నిర్వహించెదరు. 7వ తేదీ ఆదివారంనాడు, ఉదయం విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు.
 • శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2017జూన్-29వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
కొత్త సత్యనారాయణ చౌదరి
 • బూరుగుల గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ తెలుగు కవి పండితులు.
 • శరణు రామస్వామి చౌదరి (1900-1977) స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయ ఉద్యమకారుడు, మాజీ శాసన సభ్యులు
 • కొత్త సత్యనారాయణ చౌదరి కళాప్రపూర్ణ, ప్రముఖ తెలుగు పండితుడు, కవి, రచయిత, విమర్శకుడు.
 • మల్లెపద్ది కృష్ణమూర్. స్వాతంత్ర్య సమరయోధుడు 2014, జూన్-10న, కాలధర్మం చెందారు.
 • చేకూరి బుచ్చిరామయ్య అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు.ద్రోణాచార్య, అర్జున అవార్డుల గ్రహీత.
 • మోదుకూరి బాలకోటయ్య ప్రఖ్యాత డోలు విద్వాంసుడు
 • పరుచూరి రంగారావు స్వాతంత్ర్య సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత.
 • మద్దిపట్ల సూరి

గ్రామ విశేషాలు

[మార్చు]
 • ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను, విద్యార్థులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు.
 • ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శ్రీ పరుచూరి సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు, మాచెర్లలోని మీనాక్షి, ఆంజనేయులు నేత్రాలయం నిర్మాణ సమయంలో రు. 50 లక్షలు, ఈ సంవత్సరం అదనపు భవన సదుపాయం కోసం, రు. 10 లక్షలు అందజేసి, కంటిచూపు లేని 8 వేలమందికి పైగా రోగులకు ఉచిత వైద్యసేవలందించి, వారి జీవితాలలో వెలుగులు నింపినారు. ఇంకనూ వీరు గ్రామంలో పంచాయతీకి, పాఠశాలకు, ఆలయాల అభివృద్ధికీ తనవంతు సాయం అందించుచున్నారు.
 • ఈ గ్రామానికి చెందిన శ్రీ వెలివోలు పేర్నీడు, తన భార్య కీ.శే.నాగేంద్రమ్మ ఙాపకార్ధం, 2011లో, వెలివోలు నాగేంద్రమ్మ ట్రస్ట్ స్థాపించి, తెనాలి వాణిజ్య బ్యాంకులో రు. 11 లక్షలు డిపాజిట్ చేసి, దానిమీద వచ్చే వడ్డీతో సేవలందించుచున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీలో 10% మూలధనానికి జమచేసి, మిగిలిన ధనంతో పేదవృద్ధులకు పింఛను, పేద విద్యార్థులకు ప్రోత్సాహకాల రూపంలో, ప్రతి ఒక్కరికీ రు. 2,500-00 అందించుచున్నారు. ఈ రకంగా అమృతలూరు, తురిమెళ్ళకు చెందిన 24 మంది పేదవృద్ధులూ, 24 మంది పేద విద్యార్థులు, చేయూతనందుకొనుచున్నారు.
 • ఒకప్పటి సంస్కృత పాఠశాల....ఆరోజులలో ఇప్పటి వోలె ఇంగ్లీషు చదువులు అందఱకు అందుపాటులో ఉండెడివి కావు. జిల్లాలలో ఏరెండు మూడు చోట్లనో ఉన్నత పాఠశాలలుండుటయు, ఆచదువులకు బోవయునన్న వ్యయప్రయాసలు మిన్నగా ఉండుటయు కద్దు. ఇంచుమించు ఏబది యేండ్లకు ( ఈ వ్యాస రచన 1964 సంవత్సరాన) మున్నే అమృతలూరు లో సంస్కృత పాఠశాలను నెలకొల్పిరి. ఆచదువులు అందఱకు దక్కవనియు, కొందరే వానిని జదువు కొందురనియు, అది పవిత్రమైన దైవ భాషయనియు, అది చదివిన వారికి సత్ప్రవర్తనమలవడుననియు, ఆభాష భారత జాతి నాగరికతకు మూలమనియు, భారతీయులలో ఆసేతుహిమాచలము అనేకత్వములో ఏకత్వమును గూర్చునది సంస్కృతమే అనియు, ఈదేశములో ప్రసిద్ధియున్నది. ఆదృష్టిలో తెలుగుదేశములో అమృతలూరు పౌరులు ఈపాఠశాలను స్థాపించి మంచి పనిచేసిరనియే అభిజ్ఞులు మెచ్చుకొందురు.  నాలుగు కాసులు వెచ్చించి పాఠశాలను స్థాపించిరే కాని పాఠములు చెప్పువారెవ్వరు? అది యొక ‘సమస్య’ అయ్యెను. దేశములో ఈ పాఠములు చెప్పగలవారు లేరని కాదు, ఆచెప్ప నేర్చిన వారిని సత్కరించి ఆహ్వానించి పాఠశాలలో ప్రవేశపెట్టిన కొన్ని నాళ్ళకే ఏదో వంకతో వారు నట్టేట పుట్టి ముంచెడి వారు. ‘అబ్రాహ్మణుల’కు సంస్కృత విద్య చదువుటలో అర్హత ఉన్నదా? అని ప్రతి పండితునకు సందేహమే పుట్టెడిది. ఒక వేళ - ఆమాట పైకి చెప్పలేక, జీతనాతములమీద మమతచే ఎవ్వరో ఒకరు వచ్చి ఈకొలువులో కుదిరినప్పుడు ఊరిలోని ‘వాతావరణము’ కొంత కస్సుబుస్సు మని ఆపండితుని సాగనంపినదాక నిదురపోవని పరిస్థితి దాపరించెను.  ఆగ్రామంలో ‘రైతుపెద్ద’ ఒకరు ఈపరిస్థితిని గమనించి పాఠశాలా నిర్వహణమునకై నడుము కట్టెను. ఆయన పేరు శ్రీ పరుచూరు వెంకయ్య చౌదరి. ‘దేవుడు వెంకయ్య’ అని ఆయన గూర్చి వాడుక ఉంది. ఆయన మంచి వ్యవహార దక్షుడు, లోకజ్ఞుడును. ఆయన ముల్లు గఱ్ఱ మీద మొగము పూనిక చేసి దూరముగా నిలిచి వినుచున్నాడని తెలిసినపుడు, పౌరాణికుడు ఉన్న తెలివి పోయి పప్పులోకాలు వేయుట కద్దు. ఆయనకు సంస్కృతమన్నను, ఆయుర్వేదము మున్నగు ప్రాచీన విద్యలన్నను ఎంతో అభిమానము. ఆయభిమానము మూలముననే ఆయన పాఠశాలమీద కన్నువైచి రాయలసీమ నుండి విద్వాంసునొకని దీసికొని వచ్చి పాఠశాలలో ప్రవేశపెట్టెను. గ్రాసవాసము లేర్పఱచినగాని ఈపండితులు నాలుగు కాలాలు నిలువరని పూర్వానుభవము వలన గుర్తించి ఆయనకొక ఇల్లు కట్టి యిచ్చెను. ఇంటిల్లపాదికి తగిన గ్రాసమిచ్చెడి పొలము కొంత ఆయన పేరబెట్టెను. ఆరైతు బ్రతికి యున్నంత వఱకు ఆపండితుని వలన ఆపాఠశాల చక్కగా సాగెను. ఆయిన పోయిన వెంటనే ఆపండితుడు ఆగ్రాసవాసములను చేతిలో బెట్టుకొని అనుభవించుచు ఆగ్రామము విడిచి పట్టణములో మకాము పెట్టి ఇంగ్లీషు బడిలో తిఛాఆయ్యెను. ఆయన పుణ్యమా యని పాఠశాలావిద్యార్థులు పంచకావ్యముల దాక చదవ గలిగిరి. కాని అక్కడనే ఉన్నది అసలు సమస్య. ‘కౌముది’ ప్రారంభింపవలె. అది వ్యాకరణ శాస్త్రము గదా! శాస్త్రము జోలికి ఈపిల్లలు రారాదు గదా! రైతు పెద్ద పోయిన వెంటనే ఈసమస్య ఈతీరుగ దీర్చుకొని ఆపండితుడు తనపని తాను జూచుకొనెను.  ఈఘట్టములో కొన్నాళ్ళకు ఆయూరి వారి అదృష్టవశమున దాక్షిణాత్యులయిన పండితులొకరు పాఠశాలకు దక్కిరి. ఆయన అప్పుడే మైలాపూరు సంస్కృత కళాశాలలో ‘మీమాంస శిరోమణి’లో ఉత్తీర్ణులయి అధ్యాపక వృత్తికి సిద్ధముగా ఉండిరి. ఆయన పేరు కంబంపాటి స్వామినాధ శాస్త్రి గారు. వారి పూర్వులు దక్షిణాదికి వలసపోయిన తెలుగువారు. ఆయన అమృతలూరు పాఠశాలలో అడుగు వెట్టిన వెంటనే ఊరిలో ‘బ్రాహ్మణ్యము’ చేయగలిగినంత అలజడి జేసిపెట్టిరి. దానికా శాస్త్రివర్యులు అదరక బెదరక స్తిమితముగా నిలిచిపోయి చిరకాలము పాఠశాలను జక్కగా పెంచి ఎందఱనో శిష్యులను సిద్ధము చేసెను. ఆయన పెట్టిన బిక్ష వలననే సత్యనారాయణ చౌదరి వంటి విద్యార్థులు ఎందఱెందరో రెక్కలు వచ్చి విద్యాగంధము రవ్వంతైన మూచూడగలిగిరి. ఆ బ్రాహ్మణ్యులు ఈప్రాంతము వారికి గావించిన అత్యంత సహకారమును మనస్సులో భావించుకొని సత్యనారాయణ చౌదరి తాను సంస్కృతములో వ్రాసిన ‘శకుంతలా’ గ్రంథమును ఆయన గారి కంకితమిచ్చి ఋణములో రవ్వంతైన దీర్చుకోగలిగితినని సంబరపడును.  సంయుక్తాంధ్ర మద్రాసు రాష్ట్రములో పళ్లెటూళ్లలో ఉన్న సంస్కృత పాఠశాలలో అమృతలూరు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలున్నవి. అర్ధ శతాబ్దికి పైగా ఆప్రాంతము వారెందరో పంచకావ్యముల దాక అందే చదివి పేరుగడించిరి. ‘బాపూజి’ ఉద్యముల వంటి అనేక మహోద్యములకు సైతము పరోక్షముగా ఆ పాఠశాల అనుబంధము కలిగియుండెడిదని చెప్పవచ్చును. ఆడుపిల్లలతో సైతము సంస్కృతవిద్య అంతో ఇంతో లభించినదన్న ప్రఖ్యాతి ఆరోజులలో అమృతలూరు గ్రామమునకే దక్కింది. 

మూలాలు

[మార్చు]
 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతలూరు&oldid=4231199" నుండి వెలికితీశారు