బూరుగుల గోపాలకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బూరుగుల గోపాలకృష్ణమూర్తి ప్రముఖ తెలుగు రచయిత, పండితులు.[1]


వీరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని అమృతలూరు. వీరు స్థానికంగానున్న సంస్కృతోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, బందరు తాలూకా చిట్టి గూడూరులోని నారసింహ సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యాప్రవీణ పూర్తిచేశారు. పిదప ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ పూర్తిచేశారు. తెనాలిలోని జూనియర్ కళాశాలలో 35 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరు తెలుగు, సంస్కృతం భాషలలో రేడియో ప్రసంగాలు చేశారు. అనేక పత్రికలలో రచనలు ప్రచురించారు.

వీరికి కవిశేఖర బిరుదును గడియారం వెంకట శేషశాస్త్రిగారు, సుకవి సుధాకర బిరుదును జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ప్రదానం చేశారు. వీరి రాచపురి పద్య ప్రబంధానికి 1992లో రాష్ట్రస్థాయి అవార్డు పొందారు.

రచనలు[మార్చు]

  • వెంకటేశ్వరస్వామి శతకము
  • మారుతి తారావళి
  • హనుమప్ప నాయుడు (ప్రబంధము)
  • రాచపురి (పద్య ప్రబంధము)
  • కన్యాకుమారి యాత్ర (చంపూకావ్యము) [2]
  • వ్యాకరణ దర్శనము (సమగ్ర సంస్కృతాంధ్ర వ్యాకరణము)
  • ధర్మపాలనము (పౌరాణిక నాటకము)
  • స్వార్థత్యాగి (చారిత్రాత్మక నవల)
  • రాజవాహనుడు (చిన్న నవల)
  • మధు బిందువులు
  • వీరద్వయము
  • కృష్ణకవి వాణి శతకము
  • సమస్యా పూరణములు
  • నేతాజీ విజయము
  • దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కావ్యపరిశీలనము
  • సుమతీశతక సింహావలోకనము
  • వ్యాస మంజరి
  • పసిడి తునకలు
  • కందుకూరివారి ఉత్తర రామాయణ పరామర్శము.

మూలాలు[మార్చు]

  1. బూరుగుల గోపాలకృష్ణమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో కన్యాకుమారి యాత్ర పూర్తి పుస్తకం.