Jump to content

ఆవుల సాంబశివరావు

వికీపీడియా నుండి
జస్టిస్ ఆవుల సాంబశివరావు
జస్టిస్ ఆవుల సాంబశివరావు
జననంఆవుల సాంబశివరావు
మార్చి 16, 1917
గుంటూరు జిల్లా మూల్పూరు
మరణంజులై 27, 2003
వృత్తిన్యాయవాది,
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త,
హేతువాది,
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్.
రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు.
ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకులు.
పిల్లలుఆవుల మంజులత
తండ్రిఆదియ్య
తల్లిబాపమ్మ,

జస్టిస్ ఆవుల సాంబశివరావు (మార్చి 16, 1917 - జులై 27, 2003) న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్.[1] రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకులు. సాంబశివరావు 1917లో మార్చి 16వ తేదీన గుంటూరు జిల్లా మూల్పూరులో ఆవుల బాపమ్మ, ఆదియ్య దంపతులకు జన్మించాడు.

సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. మానవ సమాజంలో మానవత్వాన్ని వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయని భావించాడు. బుద్ధుడి విశ్వప్రేమ, త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణ, హేతువాద భావాలు ఆయన ఆలోచనలకు పునాదులు వేశాయి. అరవయ్యేళ్లకు పైగా ఏ పదవిలో ఉన్నా, ఏచోట ప్రసంగించినా, మానవత్వాన్ని శాస్త్రంతో మిళతం చేసి పనిచేశారు. పాలేర్లతో పాటు తననీ కూర్చోబెట్టి అన్నం పెట్టిన తల్లి మంచి మానవతావాది అన్నారు.

తెలుగుకై కృషి

[మార్చు]

సాంబశివరావు అవసరమైతే తప్పఇంగ్లీషు మాట్లాడేవారు కాదు. లోకాయుక్తగా ఆయన తెలుగులో అందుకొన్న ఫిర్యాదులకు తెలుగులోనే తీర్పులు చెప్పే విధానం ప్రవేశపెట్టారు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషాసాహిత్యాలు, కళలు, చారిత్రక వికాసానికి ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు విద్యార్థి పత్రికలో రెండు దశాబ్దాలకుపైగా శీర్షికను కొనసాగించాడు. తెలుగుయూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌ ఆవుల మంజులత ఈయన కుమార్తె.

మరణం

[మార్చు]

సాంబశివరావు 88 యేళ్ల వయసులో 2003 జూలై 27న హైదరాబాదులో కన్నుమూశారు.

రచనలు

[మార్చు]
  1. త్రిపురనేని రామస్వామి
  2. పునరుజ్జీవపధం - 1997
  3. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం
  4. నవభావన

మూలాలు

[మార్చు]
  1. "ఆవుల సాంబశివరావు ప్రొఫైల్". Archived from the original on 2008-01-17. Retrieved 2016-02-11.