Jump to content

ప్రభా శంకర్ మిశ్రా

వికీపీడియా నుండి
ప్రభా శంకర్ మిశ్రా

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
పదవీ కాలం
1995-97 , 1997-98
ముందు సయ్యద్ సాగిర్ అహ్మద్
తరువాత ఉమేష్ చంద్ర బెనర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 6, 1936
మరణం జూలై 1, 2012

ప్రభా శంకర్ మిశ్రా (6 ఆగస్టు 1936 - 1 జూలై 2012) భారత న్యాయమూర్తి. కలకత్తా హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

జననం

[మార్చు]

ప్రభా శంకర్ మిశ్రా 1936, ఆగస్టు 6న జన్మించాడు.

వృత్తి జీవితం

[మార్చు]

ఎమ్మెస్సీ పూర్తిచేసిన మిశ్రా 1960లో పాట్నా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి.లో చేరాడు.[1] ఆ తరువాత పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1982లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 1990లో మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డ మిశ్రా, 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 1997లో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. పదవీ విరమణకు కొన్ని వారాల ముందు, సుప్రీంకోర్టుకు నియామకాలను నిరసిస్తూ 1998, జూలై 5న తన రాజీనామాను సమర్పించాడు. భారత అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తులను నియమించిన తీరును ఆయన విమర్శించాడు.[2] రాజీనామా తరువాత భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.[3]

మరణం

[మార్చు]

మిశ్రా 76 సంవత్సరాల వయసులో 2012 లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Prabha Shanker Mishra dead". The Hindu. 1 July 2012. Retrieved 14 June 2021.
  2. "World: South Asia, Indian judge resigns". news.bbc.co.uk. Retrieved 14 June 2021.
  3. "Ex-Chief Justice P.S. Mishra is Dead". Retrieved 14 June 2021.