ఉమేష్ చంద్ర బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమేష్ చంద్ర బెనర్జీ
ఉమేష్ చంద్ర బెనర్జీ (2006)
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అంతకు ముందు వారుప్రభా శంకర్ మిశ్రా
తరువాత వారుమన్మోహన్ సింగ్ లిబర్హాన్
వ్యక్తిగత వివరాలు
జననం18 నవంబరు 1937
మరణం5 నవంబరు 2012
కళాశాలకలకత్తా విశ్వవిద్యాలయం

ఉమేష్ చంద్ర బెనర్జీ, (1937 నవంబరు 18 - 2012 నవంబరు 5) భారతీయ న్యాయవాది. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు.[1]

తొలి జీవితం[మార్చు]

ఉమేష్ చంద్ర 1937, నవంబరు 18న జన్మించాడు. ఇతని తండ్రి నలిన్ చంద్ర బెనర్జీ కూడా క్రిమినల్, రాజ్యాంగ న్యాయవాది. 1961లో కలకత్తా విశ్వవిద్యాలయంకి చెందిన స్కాటిష్ చర్చి కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు, లండన్ లోని ఇన్నర్ టెంపుల్‌లో న్యాయవిద్యను అభ్యసించడానికి ముందు, 1964 డిసెంబరులో పట్టభద్రుడయ్యాడు.[2][3]

వృత్తి జీవితం[మార్చు]

1965లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఉమేష్ చంద్ర, 1984లో కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఆ తరువాత 1998, ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 1998 డిసెంబరులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 2002లో పదవీ విరమణ పొందాడు. సార్క్ లా వ్యవస్థాపక సభ్యులలో ఒకడైన ఉమేష్ చంద్ర తరువాత దాని అధ్యక్షుడిగా పనిచేశాడు.[3][4]

బెనర్జీ, గోద్రా అగ్ని ప్రమాదంపై తుది విచారణ నివేదికను 2006, మార్చి 3న న్యూఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్ జెపి బాత్రాకు అందజేస్తున్నచిత్రం

2005లో గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా పనిచేశాడు. ఆ ప్రమాదంలో 59 మంది మరణించారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిందని, ముస్లింలు ప్రమేయం లేదని అతను తేల్చిచెప్పాడు. అతని నివేదిక అబద్ధమని, వాస్తవాలకు విరుద్ధమని కోర్టులో నిరూపించబడింది, అయినప్పటికీ అతను అబద్ధాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు.[4]

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ కు చెందిన రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ మేధో సంపత్తి చట్టంలో సలహాదారుగా, అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కలకత్తాలోని స్కాటిష్ చర్చి కళాశాల , బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా కూడా పనిచేశాడు. నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాడు.[3][5]

మరణం[మార్చు]

ఉమేష్ చంద్ర 2012, నవంబరు 5న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Chief Justice & Judges - SUPREME COURT OF INDIA".
  2. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008. page 593
  3. 3.0 3.1 3.2 SAARC Law webpage Archived 28 జనవరి 2013 at the Wayback Machine
  4. 4.0 4.1 "Justice (retired) Umesh C Banerjee passes away". 6 November 2012. Retrieved 14 June 2021.
  5. "Supreme Court Case Law". Archived from the original on 2021-03-08. Retrieved 2021-06-14.