దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సార్క్ దేశాలు
దక్షిణాసియా దేశాలు

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి టూకీగా సార్క్ (SAARC-South Asian Association for Regional Cooperation).

సార్క్ 8 డిసెంబర్ 1985 న ka ాకాలో స్థాపించబడింది. [4] దీని సచివాలయం నేపాల్ లోని ఖాట్మండులో ఉంది. సంస్థ ఆర్థిక, ప్రాంతీయ సమైక్యత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. [5] ఇది 2006 లో దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని ప్రారంభించింది. [6] సార్క్ ఐక్యరాజ్యసమితిలో పరిశీలకుడిగా శాశ్వత దౌత్య సంబంధాలను కొనసాగిస్తుంది, యూరోపియన్ యూనియన్‌తో సహా బహుళపక్ష సంస్థలతో సంబంధాలను అభివృద్ధి చేసింది.

చరిత్ర[మార్చు]

1970 సంవత్సరము చివరలో, అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియౌర్ రెహ్మాన్ దక్షిణాసియా దేశాలతో కూడిన వాణిజ్య కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ విషయం అతను దక్షిణ ఆసియా దేశాల ప్రభుత్వాల అధిపతులతో తెలియ చేశాడు.1981 లో కొలంబోలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు అంగీకరించాయి.1983 ఆగస్టులో, న్యూఢిల్లీ లో జరిగిన సమావేశంలో నాయకులు దక్షిణాసియా ప్రాంతీయ సహకారంపై ఒక ప్రకటనను చేసాయి[1] .

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)1985 డిసెంబర్, 7-8 తేది ల లో స్థాపించబడింది . దీని ప్రధాన కార్యాలయం నేపాల్ లోని ఖాట్మండులో ఉంది . దీని స్థాపనలో ఉద్దేశ్యం, దక్షిణాసియాలోని దేశాలు వారి సామూహిక స్వావలంబనకు ఆర్థిక, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిని చేసుకోవడం . దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలలో ఏడుగురు వ్యవస్థాపక సభ్యులు బంగ్లాదేశ్, భూటాన్, భారత్ , మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ , శ్రీలంక. 2007 లో ఆఫ్ఘనిస్తాన్ ఈ సంస్థలో చేరింది. దేశాధినేతల సమావేశాలు సాధారణంగా ప్రతి సంవత్సరం ఖరారు చేయబడతాయి, ఈ దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. ఈ దేశాల సహకారం మొత్తం 11 రంగాలలో వ్యవసాయం, విద్య, సంస్కృతి, క్రీడలు; ఆరోగ్యం, జనాభా, పిల్లల సంక్షేమం, పర్యావరణం, వాతావరణ పరిరక్షణ , గ్రామీణాభివృద్ధి , పర్యాటక, రవాణా, శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం, మహిళల సంక్షేమం , అభివృద్హి , మాదక ద్రవ్యాల రవాణా నివారణ. నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలని, "ద్వైపాక్షిక, వివాదాస్పద సమస్యలు" నివారించాలని పేర్కొన్నవి[2] [3]

పరిశీలకులు[మార్చు]

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) కు ప్రస్తుతం తొమ్మిది మంది దేశాల పరిశీలకులు గా ఉన్నాయి అవి: (i) ఆస్ట్రేలియా; (ii) చైనా; (iii) యూరోపియన్ యూనియన్; (iv) ఇరాన్; (v) జపాన్; (vi) కొరియా రిపబ్లిక్; (vii) మారిషస్; (viii) మయన్మార్మ (ix) అమెరికా[4] .

సభ్యదేశాలు[మార్చు]

పై ఏడు దేశాలు సభ్యులుగా 1985december8 'సార్క్'ఏర్పడింది తదుపరి 2007లో అఫ్‌ఘనీస్తాన్ 8వ దేశంగా చేరింది. నందగోపాల్ రాయల


మూలాలు[మార్చు]

  1. "A Research Guide on the South Asian Association for Regional Cooperation (SAARC)". https://www.nyulawglobal.org/. Published June 2015. Archived from the original on 14 మార్చి 2021. Retrieved 8 February 2021. {{cite web}}: Check date values in: |date= (help); External link in |website= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  2. "South Asian Association for Regional Co-operation | Asian organization". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
  3. "SAARC". https://www.southasiafoundation.org/. Archived from the original on 2018-10-29. {{cite web}}: External link in |website= (help)
  4. Wikisource link to https://en.wikipedia.org/wiki/South_Asian_Association_for_Regional_Cooperation. వికీసోర్స్.