Jump to content

పినాకి చంద్ర ఘోష్

వికీపీడియా నుండి
జస్టిస్
పినాకి చంద్ర ఘోష్
లోక్‌పాల్
మొదటి లోక్‌పాల్
Assumed office
23 మార్చి 2019
Nominated byచట్టబద్ధమైన ఉన్నత-స్థాయి ఎంపిక ప్యానెల్ (కమిటీ)
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
అంతకు ముందు వారుPosition established
భారత సుప్రీంకోర్టు
In office
8 మార్చి 2013 – 27 మే 2017[1]
Nominated byఅల్తామాస్ కబీర్
Appointed byప్రణబ్ ముఖర్జీ
వ్యక్తిగత వివరాలు
జననం (1952-05-28) 1952 మే 28 (వయసు 72)
కలకత్తా, పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిశ్రీమతి దేబ్జని ఘోష్
సంతానండాక్టర్ సంజుక్త సహై (కుమార్తె)
మిస్టర్. సౌమభో ఘోష్ (కొడుకు)
చదువుబి.కామ్; ఎల్‌ఎల్‌బి; అటార్నీ ఎట్ లా, రామకృష్ణ మిషన్ విద్యాపీఠం పురులియా
కళాశాలసెయింట్. జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా[2] హజ్రా లా కాలేజ్, కలకత్తా విశ్వవిద్యాలయం

పినాకి చంద్ర ఘోష్ (జ. 28 మే 1952) భారత సుప్రీంకోర్టు[3][4] న్యాయమూర్తి.[5] అంతకుముందు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[6]

కుటుంబం

[మార్చు]

జస్టిస్ పినాకి చంద్ర ఘోస్ 1952, మే 28న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించాడు. ఇతని తండ్రి దివంగత శ్రీ జస్టిస్ సంభు చంద్ర ఘోస్ కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇతడు పేరొందిన న్యాయవాదుల కుటుంబానికి చెందిన ఐదవ తరం న్యాయవాది. 1867లో కలకత్తాలో సదర్ దేవానీ అదాలత్ మొదటి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన హరా చంద్ర ఘోస్ ఈ కుటుంబంలో సభ్యుడు.[7] ది రామకృష్ణ మిషన్ తో కలిసి ఉన్నాడు. పాఠశాల విద్యను డియోగర్, పురులియాలోని రామకృష్ణ మిషన్ విద్యాపీఠంలో పూర్తిచేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

2019, మార్చి 19 న భారతదేశపు మొదటి లోక్‌పాల్‌ చైర్ పర్సన్ గా నియమించబడ్డాడు.[8][9] భారత రాష్ట్రపతి 2019, మార్చి 23న ఇతడితో ప్రమాణ స్వీకారం చేయించాడు.[10] జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[11] కలకత్తాలో హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అండమాన్ - నికోబార్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నాడు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా కూడా నియమించబడ్డాడు. కలకత్తాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, ప్రధాన న్యాయమూర్తి నామినీగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఘోస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ కులపతిగా కూడా ఉన్నాడు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://sci.nic.in/judges/sjud/pcghose.htm
  2. http://indiatoday.intoday.in/story/panneerselvam-vs-sasikala-v-k-sasikala-v-k-sasikala-da-case-supreme-court/1/882751.html
  3. http://sci.nic.in/judges/sjud/pcghose.htm
  4. https://barandbench.com/justice-pc-ghose-supreme-court/
  5. "Supreme Court to get two more judges". The Hindu News Portal. 23 February 2013.
  6. "PCGJ". tshc.gov.in. Retrieved 2021-06-16.
  7. "Chief Justice of India & Sitting Hon'ble Judges Justice Pinaki Chandra Ghose". Supreme Court of India portal.
  8. "Former SC judge Pinaki Chandra Ghose tipped to be India's first Lokpal". thehindu. Retrieved 17 March 2019.
  9. "LOKPAL". lokpal.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2021-06-16.
  10. https://www.ndtv.com/india-news/justice-pc-ghose-former-supreme-court-judge-takes-oath-as-indias-first-lokpal-2011627
  11. "Justice Pinaki Chandra Ghose". www.nhrc.nic.in. Retrieved 2021-06-16.{{cite web}}: CS1 maint: url-status (link)