దేవిందర్ గుప్తా
దేవిందర్ గుప్తా | |
---|---|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | |
In office 2003–2005 | |
అంతకు ముందు వారు | ఏ.ఆర్. లక్ష్మణన్ |
తరువాత వారు | జి.ఎస్. సంఘ్వి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 4 ఏప్రిల్ 1943 |
దేవిందర్ గుప్తా (జననం: 4 ఏప్రిల్ 1943) భారత న్యాయమూర్తి.[1][2] 2003-2005 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[3]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]గుప్తా 1943, ఏప్రిల్ 4న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో జన్మించాడు. బిఏ పూర్తిచేసి న్యాయవిద్యలో చేరాడు.
వృత్తిజీవితం
[మార్చు]ఎల్.ఎల్.బి. పూర్తయిన తర్వాత 1967, మార్చి 23న న్యాయవాదిగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. తొలిరోజుల్లో (1967 నుండి 1975 వరకు) హిమాచల్ ప్రదేశ్ జిల్లా కోర్టులు, హైకోర్టులలో ప్రాక్టీస్ చేశాడు. 1990, జూన్ 25న, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1994, ఏప్రిల్ 28న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యాడు. నాలుగు వేరువేరు సందర్భాల్లో ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[4] ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యాడు.[5] 2003, మార్చి 10న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి పదోన్నతి పొంది 2005, ఏప్రిల్ 4 న పదవీ విరమణ చేశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Former Judges". delhihighcourt.nic.in. Retrieved 2021-06-15.
- ↑ "DGCJ". tshc.gov.in. Retrieved 2021-06-15.
- ↑ "Justice Devinder Gupta appointed Chief Justice of Andhra HC". Zee News (in ఇంగ్లీష్). 2003-03-03. Archived from the original on 2021-06-16. Retrieved 2021-06-15.
- ↑ "Hon". www.supremecourtcaselaw.com. Archived from the original on 2011-07-20. Retrieved 2021-06-15.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "DGCJ". tshc.gov.in. Retrieved 2021-06-15.
- ↑ "Former Judges". delhihighcourt.nic.in. Retrieved 2021-06-15.