సుందరం నైనార్ సుందరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరం నైనార్ సుందరం

పదవీ కాలం
1993 – 1994
ముందు ఎస్. బి. మజుందార్
తరువాత సయ్యద్ సాగిర్ అహ్మద్

పదవీ కాలం
1992 – 1993

వ్యక్తిగత వివరాలు

జననం (1932-08-03)1932 ఆగస్టు 3
మరణం 2001 సెప్టెంబరు 01

సుందరం నైనార్ సుందరం ( 1932 ఆగస్టు 3—2001 సెప్టెంబరు) భారతీయ న్యాయవాది, గుజరాత్ రాష్ట్ర హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తి

వృత్తి జీవితం

[మార్చు]

నైనార్ సుందరం 1932లో అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తిరునల్వేలిలో జన్మించాడు. ఈయన తండ్రి హెర్బర్ట్ సుందరం జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి. ఈయన విద్యాభ్యాసం ఉడమాలపేటలోని బోర్డు ఉన్నత పాఠశాల, కాంచీపురంలోని ఆండర్సన్ ఉన్నత పాఠశాలలోనూ, మైసూరులోని పి.ఎస్. హయ్యర్ సెకండరీ పాఠశాలలోను సాగింది. చెన్నైలోని లయోలా కళాశాలనుండి బి.కామ్ పట్టభద్రుడై, మద్రాసు న్యాయవాద కళాశాలనుండి న్యాయవాద పట్టాన్ని (బి.ఎల్) పొందాడు.[1][2] ఈయన జస్టిస్ టి.రామప్రసాదరావు వద్ద అప్రెంటీసుగా పనిచేశాడు. మద్రాసుకు చేరేమునుపు కొంతకాలం కోయంబత్తూరులో ప్రాక్టీసు చేశాడు. అక్కడ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఎన్.కృష్ణస్వామిరెడ్డికి సహాయకుడిగా పనిచేశాడు. 1955లో నైనార్ సుందరం, మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో, సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాడు.

1978, జనవరి 4న మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 1979, జనవరి 25న శాశ్వత న్యాయమూర్తిగా స్థానం పొందాడు. 1992, జూన్ 2న గుజరాత్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పదవోన్నతి పొందాడు.[2] ఆ తరువాత 1993 డిసెంబరులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి, ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[3][4] పదవీ విరమణ తర్వాత, 1997, ఏప్రిల్ 17న, జస్టిస్ నైనార్ సుందరం తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[5] ఆ పదవిలో ఉంటూనే, 2001, సెప్టెంబరులో మరణించాడు.[6]

నైనార్ సుందరానికి వేదాంత విషయాలంటే ఆసక్తి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో అభిరుచి చూపేవాడు.

మూలాలు

[మార్చు]
  1. Judges of the Supreme Court and the High Courts. Ministry of Law, Justice and Company Affairs, Department of Justice, Government of India., 1999. p. 179.
  2. 2.0 2.1 "High Court of Gujarat". gujarathighcourt.nic.in. Retrieved 2021-11-24.
  3. "Former Judges List". tshc.gov.in. Retrieved 2021-11-24.
  4. "Gujarat High Court Recruitment 2020 - District Judge, Civil Judge". AglaSem Career (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-15. Retrieved 2021-11-24.
  5. "After three years, rights panel gets chairperson". The Hindu (in Indian English). Special Correspondent. 2014-11-17. ISSN 0971-751X. Retrieved 2021-11-24.{{cite news}}: CS1 maint: others (link)
  6. "COP – Commission On Paper". Lawyers Collective. admin. Retrieved 24 July 2022.[permanent dead link]