Jump to content

కొండా మాధవరెడ్డి

వికీపీడియా నుండి
జస్టిస్ కొండా మాధవరెడ్డి
కొండా మాధవరెడ్డి


హైదరాబాదు హైకోర్టు ప్రధానన్యాయమూర్తి

బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి జయలతాదేవి [1]
సంతానం మీరారెడ్డి

గౌతమిరెడ్డి
శైలజాసింగ్
కొండా విశ్వేశ్వర్ రెడ్డి

జస్టిస్ కొండా మాధవరెడ్డి (19231997) బొంబాయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, హైదరాబాదు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి,, కొత్త ఢిల్లీలోని చిన్నరాష్ట్రాల సమాఖ్యలో సభ్యుడు.[2][3][4][5][6] మాధవరెడ్డి అనేక జాతీయ న్యాయవాద సంఘాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, సాంఘిక, సామాజికసంస్థలలో ప్రముఖమైన వ్యక్తి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కొండా మాధవరెడ్డి 1923, అక్టోబరు 21న, కొండా వెంకటరంగారెడ్డి, తుంగభద్రమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, ఆలేరు మండలంలోని షారాజీపేటలో జన్మించాడు. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగాను, 1957 నుండి 1962 వరకు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశాడు.ఈయన జయలతాదేవిని వివాహంచేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు (మీరారెడ్డి, గౌతమిరెడ్డి, శైలజాసింగ్), ఒక కుమారుడు (కొండా విశ్వేశ్వర్ రెడ్డి).[7] మీరారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయపు పూర్వవిద్యార్థి[8] ఆమె సోదరి గౌతమీ రెడ్డి ఏ.వి.కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యిణి.[9] కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మాధవరెడ్డిని సహచరులు, మృదుభాషిగానూ, ఆలోచనాపరుడిగానూ, సహజంగా న్యాయబద్ధమైన వ్యక్తిగాను వర్ణిస్తారు. ఎదుటివారిని తన వాదనతో ఒప్పించగల నేర్పరి అని. చట్టాలను, నిజాలను కూలంకషంగా పరిశీలించే గుణం మాధవరెడ్డిది. ఈయన పక్కా జెంటిల్‌మెన్, నిగర్వి, అందరికీ సహాయపడే స్వభావి. ఈయన ఆగ్రహానికి గానీ, అలజడికిగానీ ఎన్నడూ గురికాలేదు, రాగద్వేశాలు లేకుండా ఏ చర్చలోనైనా, స్పష్టమైన ఆలోచనతో కొనసాగించి అన్నివర్గాలు సరైన నిర్ణయం తీసుకొనేలా సాగిస్తాడు.[మూలాలు తెలుపవలెను] ఈయన విద్యావేత్త, విద్వాంసుడు, న్యాయవేత్త.

మాధవరెడ్డి 1997 సెప్టెంబరు 25న నాన్-హాడ్జ్‌కిన్స్ లింఫోమా (తెల్లరక్తకణాల క్యాన్సర్) తో పోరాడుతూ మరణించాడు.

విద్య

[మార్చు]

మాధవరెడ్డి హైదరాబాదులోని ఛాదర్‌ఘాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, నిజాం కళాశాల నుండి రాజనీతిశాస్త్రము, ఆర్ధికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో ఆర్థికశాస్త్రంలో పోస్టూగ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి పూర్తిచేసి న్యాయవాది అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (26 June 2021). "కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాతృవియోగం". Andhrajyothy. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. "BioData". Jkmrfoundation.org. Archived from the original on 2013-12-30. Retrieved 2013-07-30.
  3. "Madhav Reddy Konda (1923 - d.) - Genealogy". Geni.com. 1923-10-21. Archived from the original on 2014-02-20. Retrieved 2013-07-30.
  4. "Progressive Telangana Foundation". Progressivetelangana.com. Archived from the original on 2013-08-03. Retrieved 2013-07-30.
  5. "Some of well known Reddy's in Judiciary | Reddy Society | Reddys Community | reddys information | reddys history". Reddy Society. Archived from the original on 2014-02-21. Retrieved 2013-07-30.
  6. "JKMR Foundation, Nagarjuna Group provide aid to". Newindianexpress.com. Archived from the original on 2014-03-02. Retrieved 2013-07-30.
  7. ""Children"". Archived from the original on 2017-03-03. Retrieved 2017-10-14.
  8. ""Meera Reddy"". Archived from the original on 2016-10-05. Retrieved 2017-10-14.
  9. ""Gautami Reddy"". Archived from the original on 2017-11-04. Retrieved 2017-10-14.