Jump to content

మదన్ లోకుర్

వికీపీడియా నుండి
Justice
జస్టీస్ మదన్ భీంరావ్ లోకుర్
Lokur in 2017
Judge of the Supreme Court of India
Assumed office
4 June 2012
Appointed byPresident of India
Chief Justice, Andhra Pradesh High Court
In office
15 November 2011 – 3 June 2012
వ్యక్తిగత వివరాలు
జననం (1953-12-31) 1953 డిసెంబరు 31 (వయసు 70)
జాతీయతIndian
కళాశాలModern School, New Delhi
St. Joseph's College, Allahabad
St. Stephen's College, Delhi
Faculty of Law, University of Delhi
నైపుణ్యంJudge
వెబ్‌సైట్అధికారిక వెబ్‌సైటు

జస్టీస్ మదన్ భీంరావ్ లోకుర్ (జననం 1953 డిసెంబరు 31) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి.[1]

విద్య

[మార్చు]

మదన్ బి.లోకుర్ న్యూఢిల్లీ లోని మోడర్న్ స్కూల్ లో విద్యను అభ్యసించారు. తరువాత అలహాబాదులోని సెయింట్ జోసెప్ కళాశాలలో ఐ.ఎస్.సి పరీక్షలకు హాజరయ్యారు. తరువాత ఆయన చరిత్ర (ఆనర్స్) లో గ్రాడ్యుయేషన్ ను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి పూర్తి చేసారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో న్యాయ విభాగంలో న్యాయవాద డిగ్రీని పొందారు. [2]

న్యాయవాద వృత్తి

[మార్చు]

మదన్ బి. లోకూర్ బార్ లో 1977 లో నమోదయ్యారు. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు లలో ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఆయన అడ్వకేట్-ఆన్-రికార్టు పరీక్షలను ఉత్తీర్ణుడయ్యారు. 1981లో సుప్రీం కోర్టులో ఎ.ఒ.ఆర్ లో నమోదు కాబడ్డారు.

ఆయన 1983 ఫిబ్రవరి నుండి ఇండియన్ లా రెవ్యూ (ఢిల్లీ సిరీస్) కు సంపాదకునిగా ఉన్నారు.

న్యాయమూర్తిగా

[మార్చు]

ఆయన 1999 ఫిబ్రవరి 19 నుండి బెంచ్ లో చేరారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా పనిచేసారు. 1999 జూలై 5 నుండి శాశ్వత న్యాయమూర్తిగా పనిచేసారు.

ఆయన ఫిబ్రవరి 13, 2010 నుండి మే 21, 2010 మధ్య కాలంలో ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. తరువాత జూన్ 24, 2010 నుండి గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేరారు. అక్కడ నవంబర్ 14, 2010 వరకు కొనసాగరు. ఆయన నవంబరు 15, 2011 నుండి జూన్ 3, 2012 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.

ఆయన జూన్ 4, 2012 నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా విధులలో చేరారు.[1]

ప్రసిద్ధ తీర్పులు

[మార్చు]

మైనారిటీ సబ్-కోటా

[మార్చు]

మే 2012 లో ప్రధాన న్యాయమూర్తి మదన్ లోకుర్, న్యాయమూర్తి పి.వి.సంజయ్ కుమార్ లతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల బెంచ్ భారత ప్రభుత్వ నిర్ణయమైన మైనారిటీలకు కేటాయించిన 4.5% సబ్-కోటా ( 27% లోపు వెనుకబడిన తరగతుల కోటా ) ను కొట్టి వేసింది. ఉప కోటా మతంపై ఆధారపడిందని, ఏ ఇతర అర్ధవంతమైన పరిశీలనలేదని బెంచ్ పేర్కొంది[3][4] [5]

అక్రమ మైనింగ్ కుంభకోణం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రత్యేక సి.బి.ఐ న్యాయమూర్తి అయిన టి.పట్టాభిరామారావును సస్పెండ్ చేసారు. రెడ్డి సోదరులకు సంబంధించిన మైనింగ్ స్కామ్ కేసులో తన ప్రాసిక్యూషన్ను ఆదేశించారు. న్యాయమూర్తిపై జి.జనార్థనరెడ్డి కి లంచం తీసుకొని బెయిల్ యిచ్చినట్లు పిర్యాదు చేయబడిన విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Hon'ble Mr. Justice Madan B. Lokur". Supreme Court of India. Archived from the original on 17 Jan 2013.
  2. http://supremecourtofindia.nic.in/judges/sjud/mblokur.htm
  3. "Andhra Pradesh High Court rejects Centre's 4.5% minority sub-quota". Economic Times. 29 May 2012. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 21 February 2013.
  4. "Andhra HC strikes down minorities sub-quota". The Hindu. Retrieved 21 February 2013.
  5. "HC Quashes Centre's 4.5% Sub-Quota for Minorities". 28 మే 2012. Archived from the original on 29 మే 2012. Retrieved 28 మే 2012.
  6. "Justice Lokur elevated to Supreme Court". Zee news. 4 June 2012. Retrieved 21 February 2013.