చేవెళ్ళ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


చేవెళ్ల
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో చేవెళ్ల మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో చేవెళ్ల మండలం యొక్క స్థానము
చేవెళ్ల is located in Telangana
చేవెళ్ల
తెలంగాణ పటములో చేవెళ్ల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E / 17.3067; 78.1353
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము చేవెల్ల
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,166
 - పురుషులు 29,549
 - స్త్రీలు 28,617
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.63%
 - పురుషులు 67.48%
 - స్త్రీలు 41.23%
పిన్ కోడ్ {{{pincode}}}

చేవెళ్ల, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పదవిలో ఉంది.

భౌగోళికం[మార్చు]

చేవెళ్ళ పట్టణము 17.3067°ఉత్తర అక్షాంశము మరియు 78.1353°తూర్పు రేఖాంశము పై ఉంది.

రవాణా సదుపాయాలు[మార్చు]

ఈ పట్టణని హైదరాబాద్ నుండి ప్రతి 10ని-కు ఒక ప్రభుత్వ బస్సు ఉంది. అలాగే మెహీదీపట్నం నుండి సీటి సర్విస్ 593, 593C, 593D, 593U నెంబర్ గల బస్సులు ఉన్నాయి. చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. హైదరాబాదు నుంచి వికారాబాదు, తాండూర్ (రంగారెడ్డి) వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. జాతీయ రహదారి సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది. కొత్త హైదరాబాద్ నుండి బీజపూర్ జాతీయ రహదారిని కేంద్ర అభివృధి చేస్తూంది ఆ రహదారి ఈ పట్టణం గుండా వెల్తుంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను శంకర్ పల్లి.

విద్యావ్యవస్థ[మార్చు]

చేవెళ్ళ పట్టణములో 4 డిగ్రీ కళాశాల, 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, బిఇడి కళాశాలు, ఎంబిఏ, ఎంసిఏ కళాశాలలు నెలకొల్పబడ్డాయి.

నియోజకవర్గం[మార్చు]

సకలజనుల సమ్మె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు, పంచాయతీలు[మార్చు]

చేవెళ్ళ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు, 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 58,166 - పురుషులు 29,549 - స్త్రీలు 28,617

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=చేవెళ్ళ&oldid=2273438" నుండి వెలికితీశారు