భారతదేశ జాతీయ రహదారులు

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పేరు మార్చిన తరువాత భారతదేశ జాతీయ రహదారుల పటం

భారతదేశపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రంకు రోడ్ల నెట్‌వర్కును జాతీయ రహదారులు అంటారు. వీటిని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్), రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల విభాగాలు (పిడబ్ల్యుడి) నిర్మించి, నిర్వహిస్తాయి.

జాతీయ రహదారులను నిర్మించడం, అప్‌గ్రేడ్ చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (NHAI) కు అప్పగించారు. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డిపి) కింద రహదారులను విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికీ తలపెట్టారు. హైవే అభివృద్ధి, నిర్వహణ, రహదారి పన్ను సేకరణ కోసం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (NHAI), ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తుంది.

భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట జంక్షన్లుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను ఎట్-గ్రేడ్ రోడ్లు అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.

NHs in India

లక్షణాలు[మార్చు]

డిల్లీని గుర్గావ్‌నీ కలుపే NH 48

భారతదేశంలో 2019 ఏప్రిల్ నాటికి 1,42,126 కి.మీ జాతీయ రహదారులున్నాయి.[1]భారతదేశపు మొత్తం రహదారి నెట్‌వర్క్‌లో జాతీయ రహదారులు 2.7%. కాని, 2013 నాటికి రహదారి ట్రాఫిక్‌లో 40% వీటి ద్వారానే పోతోంది.[2] 2016 లో, జాతీయ రహదార్లను 96,000 నుండి 2,00,000 కి.మీ.కు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిం. [3]

ప్రస్తుతం ఉన్న జాతీయ రహదార్లలో ఎక్కువ భాగం రెండు లేన్ల రోడ్లు (ఒక్కో దిశలో ఒక లేన్). వీటిలో ఎక్కువ భాగం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లేన్లకు విస్తరిస్తున్నారు. నెట్‌వర్కులో కొన్ని విభాగాలు టోల్ రోడ్లు . కొన్ని రహదారులను మాత్రమే కాంక్రీటుతో నిర్మించారు. ట్రాఫిక్ నిరంతరాయంగా కొనసాగడానికి పెద్ద పట్టణాలు, నగరాల చుట్టూ బైపాస్‌ రోడ్లు నిర్మించారు. గతంలో ఉన్న కొన్ని తక్కువ స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా తిరిగి వర్గీకరించారు.

చరిత్ర[మార్చు]

జాతీయ రహదారుల చట్టం, 1956 [4] రహదారుల నిర్మాణ, నిర్వహణలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించింది.నేషనల్ హైవేస్ అథారిటీ చట్టం, 1988 కింద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ చట్టం లోని సెక్షన్ 16 (1) ప్రకారం, జాతీయ రహదారులను, లేదా దానికి అప్పగించిన ఇతర రహదారులన అభివృద్ధి చేయడం, నిర్వహించడం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (NHAI) పని.

1998 లో భారతదేశం జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డిపి) అనే భారీ రహదారి నవీకరణలను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమర కారిడార్లను, నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను ( ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ) కలిపే రహదారులనూ వెడల్పు చేసి, పూర్తిగా నాలుగు లేన్ల రహదారులుగా మార్చారు. రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.

2010 ఏప్రిల్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారులకు కొత్తగా క్రమబద్ధీకరించిన సంఖ్యలను ఇచ్చింది. [5] ఆయా రహదారులు ఏ దిశల్లో వెళ్తున్నాయో దానికి అనుగుణంగాను, వాటి భౌగోళిక స్థానం ఆధారంగానూ సంఖ్యను ఇచ్చిన పథకం ఇది.కొత్త వ్యవస్థలో తూర్పు-పడమరలుగా వెళ్ళే జాతీయ రహదారులను బేసి సంఖ్య తోటి, ఉత్తర-దక్షిణంగా వెళ్ళే వాటిని సరి సంఖ్య తోటీ సూచించారు. ఈ సంఖ్య భౌగోళిక ప్రాంతాన్ని కూడా సూచిస్తుంది. తూర్పు - పడమర రహదారుల సంఖ్యలు ఉత్తరం నుండి దక్షిణంగా పోయేకొద్దీ 1 నుండి పెరుగుతూ పోతాయి - NH1, NH3, NH5 ఇలాగ. ఉత్తర - దక్షిణ రహదారుల సంఖ్యలు తూర్పు నుండి పడమరగా వెళ్ళే కొద్దీ 2 నుండి పెరుగుతూ పోతాయి - NH2, NH4, NH6.. ఇలాగ. [6] 83,677 కి,మీ. రహదారులను నిర్మించే లక్ష్యంతో భారత ప్రభుత్వం [7] భారతమాల అనే ప్రాజెక్టును చేపట్టింది. [8] 2018 లో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు మొదటి దశలో 2021-22 నాటికి 5,35,000కోట్ల ఖర్చుతో 34,800 కి.మీ రహదార్లను నిర్మిస్తారు.[9]

రాష్ట్రాలవారీగా జాతీయ రహదారులు[మార్చు]

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర పిడబ్ల్యూడి NHAI NHIDCL [10] మొత్తం పొడవు (కి.మీ.)
అండమాన్ నికోబార్ దీవులు 87 331
ఆంధ్రప్రదేశ్ 6,286
అరుణాచ్లల్ ప్రదేశ్ 1,035 2,537
అస్సాం 1,010 3,845
బీహార్ 4,839
చండీగఢ్ 15
చత్తీస్‌గఢ్ 3,232
దాద్రా నాగర్ హవేలి 31
డామన్ డయ్యూ 22
ఢిల్లీ 79
గోవా 262
గుజరాత్ 5,017
హర్యానా 2,641
హిమాచల్ ప్రదేశ్ 320 2,643
జమ్మూ కాశ్మీర్ 436 2,601
జార్ఖండ్ 2,661
కర్ణాటక 6,761
కేరళ 1,782
లక్షద్వీప్ 0
మధ్య ప్రదేశ్ 7,884
మహారాష్ట్ర 15,437
మణిపూర్ 1,751 1,746
మేఘాలయ 823 1,204
మిజోరం 372 1422.5
నాగాలాండ్ 324 1,547
ఒడిషా 4,837
పుదుచ్చేరి 64
పంజాబ్ 2,769
రాజస్థాన్ 7,906
సిక్కిం 595 463
తమిళనాడు 5,381
త్రిపుర 573 3,786
తెలంగాణ 854
ఉత్తరాఖండ్ 660 2,842
ఉత్తర ప్రదేశ్ 8,711
పశ్చిమబెంగాల్ 4 2,998
మొత్తం 48,590[11] 7,990 115,435

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 2. Mahapatra, Dhananjay (2 July 2013). "NDA regime constructed 50% of national highways laid in last 30 years: Centre". The Times of India. Retrieved 18 April 2015.
 3. "National Highways road length to be increased from 96,000 km to 2,000,000 km: Nitin Gadkari". The Financial Express (in ఇంగ్లీష్). 17 December 2016. Retrieved 27 June 2017.
 4. The National Highways Act, 1956. URL accessed on 2 December 2012.
 5. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 6. "New numbers for national highways". The Times of India. 21 October 2011. Retrieved 18 April 2015.
 7. Empty citation (help)
 8. Empty citation (help)
 9. Bharatmala Pariyojana - A Stepping Stone towards New India | National Portal of India (in en).
 10. http://nhidcl.com/wp-content/uploads/2017/02/All-projects.pdf
 11. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-10. Retrieved 2020-03-18.

వెలుపలి లంకెలు[మార్చు]