సిక్కిం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిక్కిం
Map of India with the location of సిక్కిం highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
గాంగ్‌టక్
 - 27°12′N 88°24′E / 27.2°N 88.4°E / 27.2; 88.4
పెద్ద నగరం గాంగ్‌టక్
జనాభా (2001)
 - జనసాంద్రత
540,493 (28వది)
 - 76.17/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
7,096 చ.కి.మీ (27వది)
 - 4
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[సిక్కిం |గవర్నరు
 - [[సిక్కిం |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
మే 16 1975
 - వి.రామారావు
 - పవన్ కుమార్ చాంలింగ్
 - ఒకే సభ (32)
అధికార బాష (లు) నేపాలి
పొడిపదం (ISO) IN-SK
వెబ్‌సైటు: sikkim.nic.in

సిక్కిం రాజముద్ర

సిక్కిం (Sikkim) భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది.

సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్‌టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, వజ్రయాన బౌద్ధం ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

"సిక్కిం" పేరు[మార్చు]

  • నేపాలీ భాషలో సిక్కిం (లేదా శిఖిం) అనగా ముడిపడిన నేల. ('శిఖి' అనే సంస్కృత పదం నుండి). పొరుగునుండి దండెత్తిన నేపాలీ గూర్ఖాలు కొండలమయమైనందున సిక్కిం అనే పేరు వాడారంటారు.
  • సిక్కిం మొదటి పాలకుడైన పంచేన్ నాంగ్యాల్ నిర్మించిన భవనాన్ని వర్ణిస్తూ 'లింబు' భాషలో 'సు'-క్రొత్త, 'ఖిమ్'-భవనం - నుండి - సిక్కిం అనే పదం వచ్చిందని కూడా చెబుతారు.
  • టిబెటన్లు తమ భాషలో సిక్కింను "డెన్జాంగ్" - అనగా వరి ధాన్యం లోయ - అంటారు.
  • ఒక నేపాలీ యువరాణి సిక్కింలోని "లెప్చా" రాజును పెళ్ళి చేసుకొని క్రొత్తగా వచ్చి "సు-హిమ్" (అనగా అద్భుతమైన మంచు ప్రదేశము) అన్నదని ఒక వివరణ
  • చోగ్యాల్ పాలనా కాలంలో "సిక్కిం" పదానికి టిబెటన్ అనువాదమైన "విబ్రాస్ల్జోంగ్" (འབྲས་ལྗོངས་) ను అధికారికంగా వాడారు.

చరిత్ర[మార్చు]

9వ శతాబ్దంలో "గురు రిపోంచే" అనే బౌద్ధమతగురువు కాలంనుంచీ సిక్కిం చరిత్ర ఆధారాలు లభిస్తున్నాయి.

సిక్కిం గురువైన గురు రింపోచే విగ్రహం. నామ్చీలోని 118 అడుగులు ఎత్తున్న ఈ విగ్రహము ప్రపంచములోనే ఈ సాధువు యొక్క విగ్రహలన్నింటిలోకెల్లా పెద్దది.

13వ శతాబ్దంలో టిబెట్కు చెందిన గురుటాషి అనే రాకుమారుడు చోగ్యాల్ వంశానికి మూల పురుషుడు. అతని 5వ తరంవాడైన ఫున్త్సోగ్ నామ్గ్యాల్ ను సిక్కిం చోగ్యాల్ (రాజు) గా ముగ్గురు గౌరవనీయులైన లామాలు అభిషేకించారు.

1700నుండి భూటానీలు, నేపాలీలు సిక్కింపై పలుమార్లు దండెత్తడం, టిబెటన్లు సిక్కింను కాపాడటం జరిగింది. చివరకు నేపాలీలు సిక్కింలో తెరాయి ప్రాతంతో సహా చాలాభాగాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వారి రాక తరువాత సిక్కిం బ్రిటిషువారితో చేతులు కలిపింది. ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి, నేపాలుకు 1814లో గూర్ఖా యుద్ధం జరిగింది. తరువాత జరిగి ఒడంబడికల ప్రకారం కోల్పోయిన ప్రాతం అంతా 1817లో సిక్కింకు తిరిగి లభించింది.

సిక్కింలో ప్రసిద్ధమైన ద్రో-దుల్ ఛోర్తెన్ స్థూపము

కాని తరువాత సిక్కింకు, బ్రిటిష్ఇండియావారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో మన్నే దేశమైంది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. కాని భారత ప్రధాని నెహ్రూ భారతదేశ రక్షణలో సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి అంగీకరించాడు. మళ్ళీ ప్రజలలో ఉద్యమం బలపడింది. భారతదేశంలో విలీనం కావాలని 97.5% ప్రజలు తీర్పునిచ్చారు. 1975 మే 16న రాజరికం రద్దయి, సిక్కిం భారతదేశంలో విలీనమైంది. దీనిని అప్పటి చైనా గుర్తించలేదు. చివరకు 2003లో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపెడుతూ చైనా అధికారికపటాన్ని విడుదల చేసింది.

ప్రభుత్వమూ, రాజకీయాలు[మార్చు]

సిక్కిం ముఖ్యమంత్రి, గవర్నర్ల నివాసములు ఉన్న వైట్ హాల్ కాంప్లెక్స్
సిక్కిం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు

సిక్కిం ప్రభుత్వ వ్యవస్థ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వలెనే - కేంద్రంచే నియమించ బడ్డ గవర్నరు, పాలనా బాధ్యత గల ముఖ్యమంత్రి, ఒక శాసన సభ, ఒక హైకోర్టు (దేశంలో అతి చిన్న హైకోర్టు) - ఇలా ఉంటుంది. సిక్కింలో 32 శాసనసభ నియోజక వర్గాలు, ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ నియోజక వర్గాలు ఉన్నాయి.

1975 విలీనం తరువాత భారత జాతీయ కాంగ్రెసు 1979వరకు కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది. 1979లో సిక్కిం పరిషత్ పార్టీకి చెందిన నర్బహదూర్ భండారీ ముఖ్యమంత్రి అయ్యాడు. 1994 ఎన్నికల్లో సిక్కిం ప్రజాస్వామ్య ఫ్రంట్‌కు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1999, 2004, 2009, 2014 శాసనసభ ఎన్నికలలో ఇదే పార్టీ విజయం సాధించింది.25 సంవత్సరాల సుదీర్ఘ పాలనా తర్వాత పవన్ చామ్లింగ్ పార్టీ 2019 లో ఓటమికి గురైంది కానీ ఇది మరీ ఘోరమైన ఓటమి కాదు ప్రధాన ప్రతిపక్షానికి సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించింది అంతకు ముందు పవన్ చామ్లింగ్ ప్రభుత్వంలో సరైన ప్రతిపక్షం కూడా లేదు.

భౌగోళికం[మార్చు]

పర్వతమయమైన హిమాలయ శ్రేణులు
ఉత్తర సిక్కింలోని హిమాలయ పర్వత శ్రేణి

ఎక్కువగా పర్వతమయమైన సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి చాలా తక్కువ. కొద్ది కొండ వాలులు మాత్రం వ్యవసాయానికి అనుగుణంగా పైకప్పు వ్యవసాయం (టెర్రేస్ ఫార్మింగ్) కోసం మార్చబడ్డాయి. మంచునదులవల్ల కొన్ని లోతట్టులోయప్రాంతాలలో వ్యవసాయం జరుగుతున్నది. ముఖ్యంగా తీస్తా నది, దాని ఉపనదియైన రంగీత్ నది సిక్కిం ఆర్థిక వ్వస్థవకు చాలా కీలకమైనవి. దేశంలో మూడో వంతు దట్టమైన అరణ్యాలతో కూడి ఉంది.

ఉత్తరము, తూర్పు, పడమర దిశలలో బ్రహ్మాండమైన హిమాలయ పర్వతశ్రేణులు అర్ధచంద్రాకారంలో రాష్ట్రాన్ని చుట్టి ఉన్నాయి. దక్షి భాగంలోనే ఎక్కువ జనావాసమైన ప్రదేశాలున్నాయి. మొత్తంమీద రాష్ట్రంలో 28 పర్వత శిఖరాలు, 21 హిమానీనదాలు (గ్లేషియర్స్), 227 ఎత్తైన ప్రాంతపు సరసులు, 5 ఉష్ణజలపు ఊటలు, 100కు పైగా నదులు, ఏరులు ఉన్నాయి. సరస్సులలో త్సోంగ్మో సరసు, ఖెంచియోపల్రి సరసు ముఖ్యమైనవి. రాష్ట్రాన్ని టిబెట్, భూటాన్, నేపాల్లతో కలుపుతూ 8 పర్వతలోయ మార్గాలున్నాయి.

వాతావరణం[మార్చు]

సిక్కిం దక్షిణాన (ఎక్కువ జనావాసమైన ప్రాంతంలో) సమఉష్ణమండలం వాతావరణం ఉంటుంది . క్రమంగా ఉత్తరానికి వెళ్లేసరికి టుండ్రా వాతావరణం ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు సెంటీగ్రేడ్. చలికాలంలో మంచు కురుస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం చాలా ఎక్కువ. ఒకసారి 11రోజులు అవిరామంగా వర్షం కురిసింది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం బాగా ఎక్కువ. ఉత్తర ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడు కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

జంతు , వృక్ష సంపద[మార్చు]

రాష్ట్ర వృక్షము రోడోడెండ్రాన్

సిక్కిం దిగివ హిమాలయాల యొక్క ప్రకృతివనాలలో ఉంటుంది మూడు భారతదేశ పర్యావరణప్రాంతాలలో ఇది ఒకటి. అడవులు కలిగి ఉన్న ప్రాంతాలలో వివిధ రకాల జంతువులు మరియూ చెట్లూ చేమలూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఎత్తుపళ్లాలుగా ఉండటం వలన ఉష్ణమండలంలో కనిపించే చట్లూచేమలతో పాటుగా శీతల ప్రదేశాలలో పెరిగే మొక్కలు కూడా మనకు కనపడతాయి. ఇంత చిన్న ప్రాంతములో ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించే అతి కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి.

ర్హోడోడెన్డ్రాన్ సిక్కిం రాష్ట్ర చెట్టు. ఇది సిక్కింలోని అన్ని ప్రదేశాలలో (ఎత్తులలో) పెరుగుతుంది, ఆయా ప్రదేశాలలో లభించే ఉష్నోగ్రతల తేడాలతో ఈ చెట్టు యొక్క జాతులు కూడా మారతాయి. ఆర్కిడ్లు, అత్తిచెట్లు, లారెల్, అరటి, సాల్ చెట్లు, వెదురు సిక్కింలోని తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి, ఈ చెట్లకు ఓ మాదిరి ఎండా తగలాలి. కొచెం ఎత్తు ఉన్న ప్రదేశాలలో 1500 మీటర్ల నుండి మొద్లుకొని ఓక్, చెస్ట్నట్ మాపెల్, బిర్చ్, ఆల్డర్ మరియూ మాగ్నోలియా వంటి చెట్లు పెద్ద సంఖ్యలో కనపడతాయి. బాగా ఎత్తైన ప్రదేశాలలో (3500 నుంచి 5000 మీటర్లు) జునిపర్, పైను, ఫిర్, సైప్రస్ మరియూ ర్హోడోడెన్డ్రాన్స్ పెరుగుతాయి. సిక్కింలో 5,000 కు పైగా పుష్పించే మొక్కలు, 515 అరుదైన ఆర్కిడ్లు, 60 ప్రిమ్యులా స్పీసీస్లు, 36 రోడోడెండ్రాన్ స్పీసీస్లు, 11 ఓక్ చెట్టు రకాలు, 23 వెదురు రకాలు, 16 కోనిఫర్ స్పీసీస్లు, 362 రకాల ఫెర్న్‌లు, ఫెర్న్ సంబంధిత మొక్కలు, 8 చెట్టు ఫెర్న్లు, 424 రకాలకు పైగా ఔషధ మూళికలు ఉన్నాయి.

హిమాలయాల నల్ల ఎలుగుబంటి

ఇక్కడ కనిపించే వన్యమృగాలలో మంచు చిరుత, కస్తూరి జింక, భోరల్, హిమాలయ థార్, ఎర్ర పాండా, హిమాలయ మర్మోట్, సెరోవ్, గోరల్, మొరిగే జింక సాధారణ లాంగుర్, హిమాలయాల నల్ల ఎలుగుబంటి, మచ్చల చిరుత, మార్బల్డ్ పిల్లి, చిరుత పిల్లి, అడవి కుక్క, టిబెట్ తోడేలు, హాగ్ బాడ్గర్, బింటూ-రాంగ్, అడవి పిల్లి, సివెట్ పిల్లి. ఆల్పైన్ ప్రాంతములో సాధారణంగా కనిపించే జంతువులలో జడల బర్రెలను (యాక్‌) ప్రధానంగా పాల కోసం, మాంసం కోసం, గాడిద లాగ బరువులు మోయించడానికి ఉపయోగిస్తారు.

సిక్కిం యొక్క పక్షిసంపదలో లింపేయన్ ఫీసంట్, ఎర్రకొమ్ముల ఫీసంట్, మంచు పాట్రిడ్జ్, మంచు కోడి, లామ్మెర్గేయర్ మరియూ గ్రిఫ్ఫన్ వాల్చర్లు, వీటితోపాటుగా బంగారు గ్రద్దలు, కవుజులు, ప్లోవర్లు, వుడ్కాక్లు, స్యాం పైపెర్లు, పావురాలు, ఫ్లైకాచర్లు, బ్లాబ్బర్లు మరియూ రాబిన్లు కనపడతాయి. సిక్కిం మొత్తమ్మీద 550 పక్షుల స్పీసీస్లు నమోదయ్యాయి. అందులో కొన్ని అంతరించిపోతున్న ప్రాణులుగా ప్రకటించబడ్డాయి.

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

సిక్కిం ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారిజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. పర్వతమయమైన నేలకావడంవల్లా, రవాణా ఇబ్బందులవల్లా పరిశ్రమలు చాలా తక్కువ. మద్యంతయారీ, చర్మం ఉత్పత్తులు, వాచీలు వంటి కొద్ది పరిశ్రమలు దక్షిణాన మెల్లీ, జోర్థాంగ్ ప్టణాలలో ఉన్నాయి. కాని పారిశ్రామికంగా 8.3 % వృద్ధితో సిక్కిం మంచి అభివృద్ధి సాధిస్తున్నది.

యాలుకలు, సిక్కిం యొక్క ప్రధాన వాణిజ్య పంట

ఇటీవలి కాలంలో పర్యాటక రంగంపై శ్రద్ధ, పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు సిక్కింలో ఎన్నో ఆకర్షణలున్నాయి. ఇంకా సిక్కింలో రాగి, డోలోమైట్, సున్నపురాయి, గ్రాఫైటు, మైకా, ఇనుపు, బొగ్గు ఖనిజాలు త్రవ్వబడుతున్నాయి. లాసా (టిబెట్) తో కలిపే "నాథులా" పర్వతమార్గం 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మూసివేయబడింది. దీన్ని తిరిగి వినియోగించడం మొదలుపెడితే వాణిజ్యం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

విభాగాలు[మార్చు]

సిక్కింలో 4 జిల్లాలన్నాయి - తూర్పు సిక్కిం (రాజధాని: గాంగ్టక్), పశ్చిమ సిక్కిం (రాజధాని: గేజింగ్), ఉత్తర సిక్కిం (రాజధాని: మంగన్), దక్షిణ సిక్కిం (రాజధాని: నమ్చి). దేశంలో అన్ని జిల్లాల లానే పాలనా పద్ధతులు ఉన్నాగాని, సరిహద్దురాష్ట్రమైనందున ఎక్కువ ప్రాతంలో భారతసైన్యానికి గణనీయమైన పాత్ర, అధికారాలు ఉన్నాయి.

సిక్కిం[మార్చు]

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.)

1 ES తూర్పు సిక్కిం గాంగ్‌టక్ 2,81,293 954 295
2 NS ఉత్తర సిక్కిం మంగన్ 43,354 4,226 10
3 SS దక్షిణ సిక్కిం నాంచి 1,46,742 750 196
4 WS పశ్చిమ సిక్కిం గ్యాల్‌సింగ్ 1,36,299 1,166 117

జన విస్తరణ[మార్చు]

గాంగ్‌టక్‌లోని ఒక సాంప్రదాయ బౌద్ధ నివాసము

'లెప్చా' తెగలవారు సిక్కింలో పురాతనకాలం నుండి నివాసముంటున్నవారు. 'భూటియా'లు (భూటాన్ నుండి వలస వచ్చిన వారు), 'దమాయ్'లు కూడా స్థానికులే అని చెప్పవచ్చును . కాని 19వ శతాబ్దంలో వలసవచ్చిన నేపాలీలు సిక్కింలో అత్యధిక జనాభా గల జాతి. ఇంకా మార్వాడీలు, బీహారీలు, బెంగాలీలు వ్యాపార, ఉద్యోగాలలో ఎక్కువగా ఉన్నారు.

హిందూమతం, బౌద్ధమతం ప్రధాన మతాలు. కొద్దిపాటి క్రైస్తవులు, చాలాకొద్దిమంది మహమ్మదీయులు ఉన్నారు. సిక్కింలో ఎప్పుడూ మత ఘర్షణలు జరుగలేదు.

నేపాలీ భాష ఎక్కువగా మాట్లాడుతారు. హిందీ, ఇంగ్లీషు, సిక్కిమీస్, లెప్చా, లిమ్బూ, బెంగాలీ భాషల వినియోగం కూడా గణనీయం.

మొత్తం సిక్కిం జనాభా 5,40,493 (భారతదేశంలో అతి తక్కువ జనాభా గల రాష్ట్రం) - ఇందులో పురుషులు 2,88,217 - స్త్రీలు 2,52,276. చదరపు కిలోమీటరుకు 76 మంది జనాభా మాత్రమే ఉంది. రాజధాని గాంగ్టక్ జనాభా 50,000. సగటు తలసరి ఆదాయం 11,356 రూపాయలు. ఇది భారతదేశంలో బాగా ఎక్కువ స్థానంలో ఉంది.

సంస్కృతి[మార్చు]

సిక్కింలో దీపావళి, దసరా వంటి హిందువుల పండుగలు, లోసార్, లూసాంగ్, సగదవా, ల్హబాబ్, డ్యూచెన్, ద్రుప్కాతెషి, భుమ్చు వంటి బౌద్ధుల పండుగలు, ఇంకా క్రిస్టమస్, ఆంగ్లనూతన సంవత్సరాది - ఈ ఉత్సవాలన్నీ జరుపుకుంటారు. పాశ్చాత్య సంగీతము, హిందీ సినిమా పాటలు, స్థానిక నేపాలీ గీతాలూ కూడా జనప్రియమైనవి.

భౌద్ధుల పండగ లోసార్ సందర్భంగా లాఛుంగ్లో ప్రదర్శింపబడుతున్న గుంపా

నూడిల్స్ తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మద్యం చౌక, వఅడకం కూడా బాగా ఎక్కువ.

సిక్కింలో ఎక్కువ ఇండ్లు వెదురుతో చేయబడుతాయి. పైన పేడతో అలుకుతారు గనుక చలికాలం లోపల వెచ్చగా ఉంటుంది.

రవాణా వ్యవస్థ[మార్చు]

సిక్కిం జీవనాడిగా భావించే తీస్తా నది

పక్యోంగ్ విమానాశ్రయం సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్ సమీపంలోని పకియోంగ్ పట్టణంలో గ్రీన్ ఫీల్డ్ ఆర్.సి.ఎస్ విమానాశ్రయం, రైలు మార్గాలు లేవు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి విమానాశ్రయం గాంగ్టక్కు 124 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికీ, బాగ్డోగ్రాకూ హెలికాప్టర్ సర్వీసున్నది. సిలిగురికి 16 కి.మీ. దూరంలోని 'క్రొత్త జల్పాయ్‌గురి' సిక్కింకు దగ్గరలోని రైలు స్టేషను. సిలిగురినీ గాంగ్‌టక్ నూ కలుపుతూ జాతీయ రహదారి (National Highway 31A) ఉంది.

మౌలిక సదుపాయాలు[మార్చు]

అధిక వర్షాల వల్లా, హిమపాతాల వల్లా, కొండ చరియలు పడడం వల్లా సిక్కిం రహదారులు కొన్ని తరచూ చెడిపోతూ ఉంటాయి. చాలా రహదారుల బాధ్యత భారతసైన్యానికి సంబంధించిన సరిహద్దు రోడ్ల సంస్థ (Border Roads Organisation) నిర్వహిస్తుంది. 1857 కి.మీ. రోడ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నాయి.

సిక్కింలోని అధిక వర్షపాతం వల్లా, అనేక నదుల వల్లా ణిటి సదుపాయం పుష్కలంగా ఉంది. ఎన్నో జల విద్యుత్కేంద్రాలున్నాయి.

టిబెటాలజీ మ్యూజియం, పరిశోధనా కేంద్రం

చదువు[మార్చు]

అక్షరాస్యత 69.68% - అందులో మగవారిది 76.73%, మహిళలలో 61.46%. మొత్తం 1545 ప్రభుత్వ విద్యా సంస్థలు, 18 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. 12 ఉన్నత విద్యా కేంద్రాలున్నాయి. వాటిలో సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాగా పెద్ది. [1]. చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకై పొరుగు రాష్ట్రంలోని సిలిగురి, కలకత్తా వెళుతుంటారు.

మీడియా[మార్చు]

నేపాలీ పత్రికలు సిక్కింలో విరివిగా ప్రచురించబడుతాయి. ఇంగ్లీషు, హిందీ పత్రికలు పొరుగు రాష్ట్రాలనుండి ఎక్కువగా వస్తుంటాయి. 'సిక్కిం హెరాల్డ్' అనేది ప్రభుత్వం ప్రచురించే వార పత్రిక.

రాష్ట్రంలో ఒక ఆకాశవాణి (అల్ ఇండియా రేడియో) ప్రసార కేంద్రం ఉంది. దేశమంతటా లభించినట్లుగానే టెలివిజన్ కార్యక్రమాలు 'డిష్'లద్వారా లభిస్తాయి. అలాగే 'సెల్ ఫోను' సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం పట్టణ ప్రాంతాలలోనే అధికంగా లభ్యం.

రుంటెక్ మొనాస్టరీ సిక్కింలోని ప్రసిద్ధ స్థలం. 2000లో ఇది మీడియా కేంద్రబిందువైనది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సిక్కిం&oldid=3436714" నుండి వెలికితీశారు