మిజోరం
మిజోరం | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఐజ్వాల్ - 23°44′N 92°43′E / 23.73°N 92.72°E |
పెద్ద నగరం | ఐజ్వాల్ |
జనాభా (2001) - జనసాంద్రత |
8,88,573 (27వది) - 42/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
21,081 చ.కి.మీ (24వది) - 8 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[మిజోరం |గవర్నరు - [[మిజోరం |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1987 ఫిబ్రవరి 20 - ఎం.ఎం.లఖేరా - పూ జొరంథంగ - ఒకే సభ (40) |
అధికార బాష (లు) | మిజో, ఆంగ్లము |
పొడిపదం (ISO) | [[ISO 3166-2:IN|]] |
వెబ్‌సైటు: mizoram.gov.in |
మిజోరమ్ (Mizoram) భారతదేశము ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రము. 2001 జనాభా లెక్కల ప్రకారము మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరమ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రము. .
జాతులు, తెగలు[మార్చు]
మిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.
మతాలు[మార్చు]
మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.
ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.
2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.
జిల్లాలు[మార్చు]
మిజోరం జిల్లాలు[మార్చు]
సంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం
(కి.మీ.²) |
జన సాంద్రత
(/కి.మీ.²) | |
---|---|---|---|---|---|---|---|
1 | AI | ఐజాల్ జిల్లా | ఐజాల్ | 4,04,054 | 3,577 | 113 | |
2 | CH | చంఫై జిల్లా | చంఫై | 1,25,370 | 3,168 | 39 | |
3 | - | హన్నాథియల్ జిల్లా | హన్నాథియల్ | - | - | - | |
4 | - | ఖాజాల్ జిల్లా | ఖాజాల్ | - | - | - | |
5 | KO | కొలాసిబ్ జిల్లా | కొలాసిబ్ | 83,054 | 1,386 | 60 | |
6 | LA | లవంగ్‌త్లై జిల్లా | లవంగ్‌త్లై | 1,17,444 | 2,519 | 46 | |
7 | LU | లంగ్‌లై జిల్లా | లంగ్‌లై | 1,54,094 | 4,572 | 34 | |
8 | MA | మమిట్ జిల్లా | మమిట్ | 85,757 | 2,967 | 28 | |
9 | SA | సైహ జిల్లా | సైహ | 56,366 | 1,414 | 40 | |
10 | - | సైతువాల్ జిల్లా | సైతువాల్ | - | - | - | - |
11 | SE | సెర్ఛిప్ జిల్లా | సెర్ఛిప్ | 64,875 | 1,424 | 46 |
గణాంకాలు[మార్చు]
- వైశాల్యం: 21,000 చ.కి.మీ.
- జనాభా: 890,000 (2001)
- తెగలు:
- మిజో / లూషాయి: 63.1%
- హ్మార్: ?
- పోయి: 8%
- చక్మా: 7.7%
- రాల్తే: 7%
- పావి: 5.1%
- కుకి: 4.6%
- తక్కినవారు: 5.1%
- మతాలు:
- క్రైస్తవులు: 85%
- బౌద్ధులు: 8%
- హిందువులు: 7%
- తెగలు:
- రాజధాని: ఐజ్వాల్ (జనాభా 1,82,000)
మూలాలు[మార్చు]
బయటి లంకెలు[మార్చు]
- మిజోరం ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు
- మిజోరం ప్రభుత్వం
- ఐజ్వాల్ పోర్టల్
- హ్మర్.నెట్: హ్మర్ తెగకు చెందిన సమాచారం
- బిబిసి వార్తలు: ఇజ్రాయెలీ వీసాలు కోరుతున్న మీజో యూదులు Archived 2005-10-26 at the Wayback Machine
- బిబిసి వార్తలు: ఆశతో ఎదురుచూస్తున్న తప్పిపోయిన భారతీయ యూదులు
- బిబిసి వార్తలు: భారతీయ యూదులను వెనుకేసుచ్చిన రబ్బీ Archived 2005-11-16 at the Wayback Machine
- హారెట్జ్: అమర్: బేనీ మెనాషే ప్రాచీన దూరమైన యూదు తెగకు చెందినవారు. Archived 2005-08-29 at the Wayback Machine
- జోరాం.ఆర్గ్: మిజోరం గురించి, జో సంతతి వారి గురించిన వార్తలు