వికారాబాద్

వికీపీడియా నుండి
(వికారాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము మరియు జిల్లా కేంద్రము[1]

వికారాబాద్
—  మండలం  —
వికారాబాదు జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
వికారాబాదు జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
వికారాబాద్ is located in Telangana
వికారాబాద్
వికారాబాద్
తెలంగాణ పటములో వికారాబాద్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°20′N 77°54′E / 17.33°N 77.90°E / 17.33; 77.90
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు
మండల కేంద్రము వికారాబాద్
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 85,410
 - పురుషులు 42,769
 - స్త్రీలు 42,641
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.60%
 - పురుషులు 74.59%
 - స్త్రీలు 52.47%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్భనికి రైలుమార్గం ఉంది.

భౌగోళిక సరిహద్దులు[మార్చు]

సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30)

వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున చేవెళ్ళ మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 85,410 - పురుషులు 42,769 - స్త్రీలు 42,641[2] అక్షరాస్యత - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%

రవాణా సౌకర్యాలు[మార్చు]

ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ

పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.

పురపాలక సంఘం[మార్చు]

పట్టణంలో పురపాలక సంఘాన్ని 1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పల్లి, కొతిరేపల్లి, అంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో ఉంది.

పట్టణంలోని కాలనీలు[మార్చు]

 • రామయ్యగూడ: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.
 • ఎన్నెపల్లి: ఒకప్పుడు ప్రత్యేక గ్రామంగా ఉన్న ఎన్నెపల్లి ఇప్పుడు పూర్తిగా వికారాబాద్ పట్టణంలో కలిసింది. వికారాబాదులో ముఖ్యమైన కాలనీలలో ఒకటి.
 • వేంకటేశ్వర కాలని : ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలనీ. ఇక్కడి ప్రజలంతా విద్యావంతులు, ఉపాధ్యాయులు,వ్యాపారస్తులు. ఇది ఆదర్శ కాలని. ఇక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

ప్రాథమిక పాఠశాలలు[3]
 • ప్రభుత్వ పాఠశాలలు: 2,
 • మండల పరిషత్తు పాఠశాలలు: 43,
 • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3,
 • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 10
ప్రాథమికోన్నత పాఠశాలలు[4]
 • మండలపరిషత్తు పాఠశాలలు: 7
 • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 8
ఉన్నత పాఠశాలలు[5]
 • ప్రభుత్వ పాఠశాలలు: 3
 • మండల పరిషత్తు పాఠశాలలు: 15
 • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3
 • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 11
కళాశాలలు
 • శ్రీ అనంత పద్మనాభ కళాశాల, వికారాబాదు
 • శ్రీ సరస్వతి విద్యాలయ కళాశాల, వికారాబాదు
 • విద్యాసాగర్ డిగ్రీకళాశాల, వికారాబాదు

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

వికారాబాదు సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:

 • మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కిలోమీటర్ల దూరం)
మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు (6 కిలోమీటర్లు)

హైదరాబాదుకు 72 కిలోమీటర్ల దూరంలో వికారాబాదుకు 4 కిలోమీటర్ల దూరంలో తాండూర్ వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే అనంతగిరి కొండలు. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మూసీ నది పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • వికారాబాద్ (ఎన్.పి)

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-1.pdf
 2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03
 3. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.153
 4. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.155
 5. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.157

వెలుపలి లింకులు[మార్చు]