మెతుకు ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెతుకు ఆనంద్
మెతుకు ఆనంద్


పదవీ కాలం
  2018-2023
ముందు  
నియోజకవర్గం వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 4, 1974
కెరెల్లి, ధరూర్ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పోచయ్య - సాయమ్మ
జీవిత భాగస్వామి సబిత
సంతానం ఒక కుమార్తె (వినూత్న), ఒక కుమారుడు (వైభవ్)
నివాసం వికారాబాద్, తెలంగాణ

డా. మెతుకు ఆనంద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] భారత్ రాష్ట్ర సమితికి చెందిన మాజీ వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం కి[2]సభ్యుడు.

జననం

[మార్చు]

ఆనంద్ 1974, జూన్ 4న పోచయ్య - సాయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, ధరూర్ మండలంలోని కెరెల్లి గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ (విజయవాడ) పరిధిలోని కాకతీయ మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎండి, (ఓబిజి), ఎంఎస్ (జనరల్ సర్జన్)) చదివాడు.[3] తరువాత కొంతకాలం వైద్యవృత్తిని చేపట్టాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆనంద్ కు డా. సబితతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (వినూత్న), ఒక కుమారుడు (వైభవ్) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

ఆనంద్ కొంతకాలం వైద్యుల ఐకాస అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2013-14లో వికారాబాద్‌ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా వికారాబాద్‌ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి. ప్రసాద్ కుమార్ పై 3,526 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5]మెతుకు ఆనంద్ 26 జనవరి 2022న వికారాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Dr. Anand Methuku(TRS):Constituency- VICARABAD (SC)(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-07.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-07.
  3. "Dr. Methuku Anand | MLA | TRS | Vikarabad | Telangana | theLeadersPage". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-22. Retrieved 2021-09-07.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-09. Retrieved 2019-07-09.
  5. "తెలంగాణ‌లో కొత్త ఎమ్మెల్యేలు వీరే". BBC News తెలుగు. 2018-12-11. Retrieved 2021-09-07.
  6. Eenadu (27 January 2022). "తెరాస జిల్లా అధ్యక్షుడిగా మెతుకు ఆనంద్‌". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.