వికారాబాదు జిల్లా
Vikarabad district | ||||
---|---|---|---|---|
Country | భారతదేశం | |||
State | Telangana | |||
Established | October 2016 | |||
Headquarters | Vikarabad | |||
Mandalas | 20 | |||
Government | ||||
• District collector | Prathik Jain | |||
• Parliamentary constituencies | Chevella, Mahbubnagar | |||
• Assembly constituencies | 4 | |||
విస్తీర్ణం | ||||
• Total | 3,386.00 కి.మీ2 (1,307.34 చ. మై) | |||
జనాభా (2011) | ||||
• Total | 9,27,140 | |||
• జనసాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) | |||
Time zone | UTC+05:30 (IST) | |||
Vehicle registration | TS–34[1] |
వికారాబాదు జిల్లా, తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలలో ఇది ఒకటి.[2] 2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడింది.గతంలో రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట, దౌలతబాద్ మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. తరువాత ఏర్పడిన రెండు కొత్త మండలాలతో కలిపి జిల్లాలోని మండలాల సంఖ్య 20 కు చేరుకుంది. ఈ జిల్లాలో వికారాబాదు, తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.[3].[4] ఈ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 510 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.[5] ఈ జిల్లా పరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.
[6][7] 2016 తర్వాత 2 కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పడ్డాయి. అవి చౌడాపూర్, దుద్యాల్
దీనితో జిల్లాలో మండల సంఖ్య 20 కి చేరింది.
చరిత్ర
[మార్చు]కోడంగల్, తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా మైసూరు రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా హైదరాబాదు రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. 2016 అక్టోబరు 11న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభమైంది.
ఖనిజ సంపద, పరిశ్రమలు
[మార్చు]జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న తాండూరులో భారీ సిమెంటు కర్మాగారాలే కాకుండా చిన్నతరహా పరిశ్రమలైన నాపరాతి పాలిషింగ్ యూనిట్లు వేలసంఖ్యలో ఉన్నాయి
జిల్లాలో దర్శించదగిన ప్రముఖ ప్రదేశాలు
[మార్చు]వికారాబాద్కు 4 కి.మీ. దూరంలోని అనంతగిరి కొండపైన ఉన్న అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రఖ్యాతమైంది. ఈ దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం ప్రత్యేకత.
జిల్లాలోని మండలాలు
[మార్చు]- మర్పల్లి మండలం
- మోమిన్పేట్ మండలం
- నవాబ్పేట్ మండలం
- వికారాబాద్ మండలం
- పూడూర్ మండలం
- కుల్కచర్ల మండలం
- దోమ మండలం
- పరిగి మండలం
- ధరూర్ మండలం
- కొట్పల్లి మండలం *
- బంట్వారం మండలం
- పెద్దేముల్ మండలం
- యాలాల్ మండలం
- కొడంగల్ మండలం
- బొంరాస్‌పేట్ మండలం
- దౌలతాబాద్ మండలం
- బషీరాబాద్ మండలం
- తాండూరు మండలం
- చౌడాపూర్ మండలం*
- దుద్యాల్ మండలం*
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు
గమనిక:* పైవాటిలో చౌడాపూర్ మండలం* 2021 ఏప్రిల్, 24న కొత్తగా ఏర్పడింది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]- రైలురవాణా
హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం, వికారాబాదు నుంచి పరిగి వెళ్ళు రైలుమార్గాలు జిల్లా గుండా వెళ్తున్నాయి. తాండూరు, వికారాబాదులు ప్రధాన రైల్వే స్టేషన్లు కాగా వికారాబాదు జంక్షన్‌గా ఉంది.
- రోడ్డురవాణా
హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు రాష్ట్ర రహదారి జిల్లా గుండా వెళ్తుంది. వికారాబాదు నుంచి తాండూరు, పరిగి, చేవెళ్ళ పట్టణాలకు రవాణాసౌకర్యాలు చక్కగా ఉన్నాయి. కోడంగల్‌కు తాండూరు, మహబూబ్‌నగర్ పట్టణాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
పర్యాటకప్రాంతాలు
[మార్చు]వికారాబాదుకు సమీపంలో ఉన్న అనంతగిరి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. మూసీనది జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.
పురపాలక సంఘాలు
[మార్చు]- వికారాబాద్ పురపాలక సంఘం
- తాండూరు పురపాలక సంఘం
- పరిగి పురపాలక సంఘం
- కొడంగల్ పురపాలక సంఘం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 Revenue (DA-CMRF) Department, తేది 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-03-25.
- ↑ Telangana New Districts Names 2016
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016
- ↑ telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-14.
- ↑ telugu, NT News (2021-04-25). "కొత్త మండలాలకు గ్రీన్ సిగ్నల్". www.ntnews.com. Retrieved 2023-08-15.