Coordinates: 16°59′14″N 77°58′32″E / 16.987296°N 77.975641°E / 16.987296; 77.975641

చౌడాపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌడాపూర్ మండలం
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: 16°59′14″N 77°58′32″E / 16.987296°N 77.975641°E / 16.987296; 77.975641
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం చౌడాపూర్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,988
 - పురుషులు 13,802
 - స్త్రీలు 13,186
పిన్‌కోడ్ 509335

చౌడాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా లోని వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2021 ఏప్రిల్ 24 న కొత్తగా ఏర్పడిన మండలం. [1][2] చౌడాపూర్ గ్రామం కొత్త మండలంగా ఏర్పడక ముందు కుల్కచర్ల మండల పరిధిలో ఉంది. చౌడాపూర్ గ్రామం ఈ మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. చౌడాపూర్ మండలాన్ని కుల్కచర్ల మండలం లోని 7 గ్రామాలు, మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలం లోని 7 గ్రామాలు కలిపి మొత్తం 14 గ్రామాలతో వికారాబాద్ జిల్లా, వికారాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో 2021 ఏప్రిల్ 24 నుండి నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించింది.[3] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [4][5] ఇందులో 14 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [6] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.[7]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చౌడపూర్
  2. మండిపాల్
  3. వీరాపూర్
  4. విఠలాపూర్
  5. మక్తా వెంకటాపూర్
  6. అడ‌వి వెంక‌టాపూర్‌
  7. లింగంపల్లి
  8. కొత్తపల్లి
  9. పురుసంప‌ల్లి
  10. మల్కాపూర్
  11. మ‌రిక‌ల్‌
  12. క‌న్మ‌న్ కాల్వ‌
  13. మొగిలిపల్లి
  14. చాకల్‌పల్లి

గమనిక:పైన వివరింపబడిన రెవెన్యూ గ్రామాలలో వ.సంఖ్య 1 నుండి 7 వరకు గల గ్రామాలు కుల్కచర్ల మండలం నుండి, వ.సంఖ్య 8 నుండి 14 వరకు గల గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం నుండి చౌడాపూర్ మండలంలో విలీనమయ్యాయి.[8][4]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-11. Retrieved 2021-05-11.
  2. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-05-13.
  3. "కొత్త మండలాలకు గ్రీన్‌ సిగ్నల్‌". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2021-05-15.
  4. 4.0 4.1 "రాష్ట్రంలో మ‌రో రెండు కొత్త మండ‌లాల ఏర్పాటు". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2022-01-04.
  5. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-04.
  6. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  7. Service, Express News (2021-04-25). "Notification to create two new mandals issued". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-30.
  8. "తెలంగాణలో కొత్త మండలాలు ఇవే.. ఉత్తర్వులు జారీ". Samayam Telugu. Retrieved 2021-05-15.