అక్షాంశ రేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859

కుల్కచర్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుల్కచర్ల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం కుల్కచర్ల
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,281
 - పురుషులు 35,780
 - స్త్రీలు 34,501
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.40%
 - పురుషులు 48.44%
 - స్త్రీలు 24.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

కుల్కచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] కుల్కచర్ల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు

[మార్చు]
కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణ కాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501

1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారం 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 56,038. జనాభాలో పురుషులు 28,444 కాగా, స్త్రీల సంఖ్య 27,594. మండలంలో 11,195 గృహాలున్నాయి.[3]

మండలంలోని పాఠశాలలు, కళాశాలలు

[మార్చు]

మండలంలో 92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.

వర్షపాతం, నీటిపారుదల

[మార్చు]

మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూలై మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.

వ్యవసాయం, పంటలు

[మార్చు]

మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ, కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[4] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.

మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు

[మార్చు]

ప్రముఖ శివాలయం పాంబండ గ్రామంలో, రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

చౌడాపూర్ మండలంలో చేరిన గ్రామాలు

[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణలో ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడింది.తరువాత ఈ మండలంలోని చౌడాపూర్ గ్రామం మండలకేంద్రంగా వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2021 ఏప్రిల్ 24 న ఏర్పడిన చౌడాపూర్ అనే కొత్త మండలంలో ఈ దిగువ గ్రామాలు విలీనమయ్యాయి.[5][6]

  1. చౌడపూర్
  2. మండిపాల్
  3. వీరాపూర్
  4. విఠలాపూర్
  5. మక్తా వెంకటాపూర్
  6. అడ‌వి వెంక‌టాపూర్‌
  7. లింగంపల్లి

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08
  5. "తెలంగాణలో కొత్త మండలాలు ఇవే.. ఉత్తర్వులు జారీ". Samayam Telugu. Retrieved 2022-01-23.
  6. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-23.

వెలుపలి లింకులు

[మార్చు]