అక్షాంశ రేఖాంశాలు: 17°13′00″N 77°26′00″E / 17.2167°N 77.4333°E / 17.2167; 77.4333

బషీరాబాద్ మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
(బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బషీరాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°13′00″N 77°26′00″E / 17.2167°N 77.4333°E / 17.2167; 77.4333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం బషీరాబాద్
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,562
 - పురుషులు 21,603
 - స్త్రీలు 21,959
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.96%
 - పురుషులు 54.07%
 - స్త్రీలు 30.47%
పిన్‌కోడ్ {{{pincode}}}


బషీరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] బషీరాబాద్, ఈ మండలానికి కేంద్రం. ఇది రంగారెడ్డి జిల్లా పశ్చిమ సరిహద్దున ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. నవంద్గీ పేరుతో ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఈ రైల్వే స్టేషను హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి వెళ్ళు మార్గంలో ఉంది. హైదరాబాదు నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వేస్టేషను మార్గంలో తెలంగాణలో చివరి రైల్వేస్టేషను.ఈ రైల్వేస్టేషను నవాంద్గి రైల్వేస్టేషను‌గా పిలువబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  31  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

విద్యాసంస్థలు

[మార్చు]
ప్రాథమిక పాఠశాలలు[3]
  • మండల పరిషత్తు పాఠశాలలు; 44

ప్రాథమికోన్నత పాఠశాలలు[3]

  • మండల పరిషత్తు పాఠశాలలు: 7

ఉన్నత పాఠశాలలు[3]

  • మండల పరిషత్తు పాఠశాలలు: 9

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,562 - పురుషులు 21,603 - స్త్రీలు 21,959. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేంఈ రాలేదు. వైశాల్యం 204 చ.కి.మీ. కాగా, జనాభా 43,562. జనాభాలో పురుషులు 21,603 కాగా, స్త్రీల సంఖ్య 21,959. మండలంలో 8,800 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 3.2 Hand Book of Statistics, Ranga Reddy Dist- 2007-08, published by CPO, Page No 153
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]