ములుగు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణలో ములుగు కేంద్రంగా ములుగు జిల్లా ఏర్పాటైంది. 2019 ఫిబ్రవరి 17 న నారాయణపేట జిల్లాతో పాటు ఈ జిల్లా ఏర్పాటైంది.[1] జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి, మొత్తం 9 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[2] జిల్లా జనాభా 2.94 లక్షలు.

గణాంకాలు[మార్చు]

జిల్లాలోని మండలాలు[మార్చు]

ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక్క సారక్క), ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు

కొత్త జిల్లాలో ఒక్క ములుగు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది.

గ్రామాలు[మార్చు]

కొత్త జిల్లాలో మండలాలవారీగా గ్రామాల సంఖ్య ఇలా ఉంది.

గ్రామాల సంఖ్యా వివరాలు
మండలం రెవెన్యూ గ్రామాల మొత్తం సంఖ్య అందులో నిర్జన గ్రామాలు సంఖ్య నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు
ములుగు మండలం 19 02 17
వెంకటాపూర్‌ మండలం 10 01 09
గోవిందరావుపేట మండలం 14 04 10
తాడ్వాయి మండలం 73 32 41
ఏటూరునాగారం మండలం 39 16 23
కన్నాయిగూడెం మండలం 25 07 18
మంగపేట మండలం 23 03 20
వెంకటాపురం మండలం 72 27 45
వాజేడు మండలం 61 20 41
మొత్తం 336 112 224

మూలాలు[మార్చు]

  1. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 18, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019

వెలుపలి లింకులు[మార్చు]