వెంకటాపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంకటాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]

వెంకటాపూర్‌
—  మండలం  —
వరంగల్ జిల్లా పటంలో వెంకటాపూర్‌ మండల స్థానం
వరంగల్ జిల్లా పటంలో వెంకటాపూర్‌ మండల స్థానం
వెంకటాపూర్‌ is located in తెలంగాణ
వెంకటాపూర్‌
వెంకటాపూర్‌
తెలంగాణ పటంలో వెంకటాపూర్‌ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°20′36″N 79°56′38″E / 18.343446°N 79.943962°E / 18.343446; 79.943962
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం వెంకటాపూర్‌
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 38,959
 - పురుషులు 19,476
 - స్త్రీలు 19,483
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.77%
 - పురుషులు 64.79%
 - స్త్రీలు 38.48%
పిన్‌కోడ్ {{{pincode}}}

గతంలో ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉండేది.ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 38,959 - పురుషులు 19,476 - స్త్రీలు 19,483.[2]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు[మార్చు]

లోగడ వెంకటాపూర్ గ్రామం/ మండలం, వరంగల్ జిల్లా, ములుగు రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వెంకటాపూర్ మండలాన్ని (1+9) పది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు[మార్చు]

2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు వెంకటాపూర్ మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[4]

మండలంలో ప్రముఖులు[మార్చు]

మండలంలోని ప్రముఖులు ప్రముఖ ఆర్టిస్టు రెడ్డిరాజు సునీల్ వెంకటాపూర్ మండలంలో జన్మించారు. రాష్ట్రానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఎందరో స్నేహితులకు రూ.3 వడ్డీకే రుణాలు ఇస్తూ ఇతోధికంగా సాయపడుతున్నారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అడవిరంగాపూర్
 2. తిమ్మాపూర్
 3. లక్ష్మీదేవిపేట
 4. రామనాథపల్లి
 5. నల్లగుంట
 6. రామానుజపురం
 7. నరసాపురం
 8. పాలంపేట
 9. వెంకటాపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-21.
 4. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు[మార్చు]