ములుగు రెవెన్యూ డివిజను
ములుగు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ములుగు |
ములుగు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ములుగు జిల్లాలోవున్న ఒక రెవెన్యూ డివిజన్ ఇది. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ములుగు పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, ములుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]ములుగు డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | ములుగు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ములుగు మండలం | 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
2 | వెంకటాపూర్ మండలం | 10 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
3 | గోవిందరావుపేట మండలం | 14 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
4 | తాడ్వాయి మండలం | 73 రెవెన్యూ గ్రామాలు (32 నిర్జన గ్రామాలు) |
5 | ఏటూరు నాగారం మండలం | 38 రెవెన్యూ గ్రామాలు (15 నిర్జన గ్రామాలు) |
6 | కన్నాయిగూడెం మండలం | 25 రెవెన్యూ గ్రామాలు (7 నిర్జన గ్రామాలు) |
7 | మంగపేట మండలం | 23 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
8 | వెంకటాపురం మండలం | 72 రెవెన్యూ గ్రామాలు (27 నిర్జన గ్రామాలు) |
9 | వాజేడు మండలం | 61 రెవెన్యూ గ్రామాలు (18 నిర్జన గ్రామాలు) |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-26.
- ↑ "Revenue Division | Mulugu District, Government of Telangana | India". www.mulugu.telangana.gov.in. Archived from the original on 2021-01-16. Retrieved 2022-05-26.
- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-05-26.