Jump to content

వాజేడు మండలం

వికీపీడియా నుండి
వాజేడు
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వాజేడు స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వాజేడు స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వాజేడు స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం వాజేడు
గ్రామాలు 43
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 580 km² (223.9 sq mi)
జనాభా
 - మొత్తం 24,816
 - పురుషులు 12,248
 - స్త్రీలు 12,568
పిన్‌కోడ్ {{{pincode}}}


వాజేడు మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వాజేడు మండలంలోని గ్రామం.[1].ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 105 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భద్రాచలం, ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 61  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 18 నిర్జన గ్రామాలు. ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, వాజేడు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 24,816 - పురుషులు 12,248 - స్త్రీలు 12,568

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 580 చ.కి.మీ. కాగా, జనాభా 24,816. జనాభాలో పురుషులు 12,248 కాగా, స్త్రీల సంఖ్య 12,568. మండలంలో 7,109 గృహాలున్నాయి.[4]

ఖమ్మం జిల్లా నుండి జయశంకర్ జిల్లాలో విలీనం

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం

గతంలో వాజేడు మండలం, ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం 2016 లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో వాజేడుమండలాన్ని 61 గ్రామాలుతో చేర్చుతూ ది.1.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

జయశంకర జిల్లా నుండి ములుగు జిల్లాలో విలీనం

[మార్చు]

తిరిగి ఈ మండలం జయశంకర్ జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి, మొత్తం 9 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది.[6][7]

మండలంలోని గ్రామాలు

[మార్చు]
  1. పెద్దగొల్లగూడెం (జి)
  2. కొప్పుసూరు
  3. టేకులగూడెం (జెడ్)
  4. పెద్దగొల్లగూడెం (జెడ్)
  5. టేకులగూడెం చక్-11
  6. చీకుపల్లి (జెడ్)
  7. పూసూరు (జెడ్)
  8. పెద్దగంగారం (జెడ్)
  9. లక్ష్మీపురం
  10. గుమ్మడిదొడ్డి (జెడ్)
  11. చంద్రుపట్ల (జెడ్)
  12. గుమ్మడిదొడ్డి (జి) చక్
  13. బొమ్మనపల్లి (జి)
  14. అర్లగూడెం (జి)
  15. కృష్ణాపురం (జి)
  16. జంగాలపల్లి (జి)
  17. కడేకళ్ (జి)
  18. ఇప్పగూడెం (జి)
  19. మొరుమూరు (జెడ్)
  20. కడేకళ్ (జెడ్)
  21. చింతూరు (జెడ్)
  22. దూలపురం (జి)
  23. మొరుమూరు (జి)
  24. పేరూరు (జి)
  25. నాగారం (జి)
  26. ప్రగళ్లపల్లి (జెడ్)
  27. పేరూరు (జెడ్)
  28. వాజేడు (జి)
  29. ఎడ్జర్లపల్లి (జి)
  30. చెరుకూరు (జి)
  31. ఎడ్జర్లపల్లి (జెడ్)
  32. ములకనపల్లి (జి)
  33. మూటారం చౌక్
  34. పెనుగోలు (జి)
  35. కొంగల (జి)
  36. కోయవీరపురం (జి)
  37. అరుణాచలపురం
  38. భువనపల్లి
  39. ఘనపురం (జెడ్)
  40. బిజినపల్లి
  41. బొల్లారం (జెడ్)
  42. చెరుకూరు (జెడ్)
  43. పూసూరు పాచ్-2

గమనిక:నిర్జన గ్రామాలు 18 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-21.
  6. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  7. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]