Jump to content

తాడ్వాయి మండలం (సమ్మక సారక్క)

అక్షాంశ రేఖాంశాలు: 18°14′14″N 80°18′38″E / 18.237177°N 80.310631°E / 18.237177; 80.310631
వికీపీడియా నుండి
తాడ్వాయి
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, తాడ్వాయి స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, తాడ్వాయి స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, తాడ్వాయి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°14′14″N 80°18′38″E / 18.237177°N 80.310631°E / 18.237177; 80.310631
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం తాడ్వాయి
గ్రామాలు 41
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 22,879
 - పురుషులు 10,893
 - స్త్రీలు 11,986
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.17%
 - పురుషులు 68.09%
 - స్త్రీలు 42.13%
పిన్‌కోడ్ {{{pincode}}}

తాడ్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 91 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 73   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 32 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, తాడ్వాయి

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 22,879 - పురుషులు 10,893 - స్త్రీలు 11,986.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 839 చ.కి.మీ. కాగా, జనాభా 22,879. జనాభాలో పురుషులు 10,893 కాగా, స్త్రీల సంఖ్య 11,986. మండలంలో 5,576 గృహాలున్నాయి.[4]

జిల్లా మార్పులు

[మార్చు]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు

[మార్చు]

గతంలో తాడ్వాయి గ్రామం / మండలం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తాడ్వాయి మండలాన్ని (1+72) డెబ్బైమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు

[మార్చు]

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు తాడ్వాయి మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 32 పరిగణనలోకి తీసుకోబడలేదు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-01-13.
  6. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 February 2019. Retrieved 17 February 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]