పరకాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?పరకాల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°10′10″N 79°42′18″E / 18.1695624°N 79.7049291°E / 18.1695624; 79.7049291
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16.13 కి.మీ² (6 చ.మై)[1]
జిల్లా(లు) వరంగల్ జిల్లా
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం పరకాల పురపాలక సంఘము


పరకాల, తెలంగాణ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలము. దేవాలయములు పరకాల బస్టాండు కూడలిలో ప్రసిద్ధ శ్రీకుంకుమేశ్వరస్వామివారి పురాతన దేవాలయము ఉంది.మల్లక్క పేటలో అతిపెద్ద హనుమాన్ దేవాలయము.సాయిబాబా దేవాలయములు ఉన్నాయి. వరంగల్ రహదారిపై సాయిబాబా దేవాలయము ఉంది. కళాశాలలు, పాఠశాలలు. భూపాలపల్లి రహదారిపై ఎమ్.ఆర్.రెడ్డి.డిగ్రీ కళాశాల మరియు బస్టాండ్ రోడ్డులో సాహితీ జూనియర్ కళాశాల మరి రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విధ్యారన్యపురి రహదారిపై ఛైతన్య ఇంగ్లిష్ మిడియం ఉంది.

ప్రభుత్వం మరియు రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన

జమ్మికుంట నగర పంచాయతీ 2011 లో స్థాపించిబడింది. ఈ పట్టణం లోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20. దీని అధికార పరిధి 16.13 km2 (6.23 sq mi).[1]

శాసనసభ నియోజకవర్గం

పేరువెనుక చరిత్ర[మార్చు]

మనిషికి ఒకప్పుడు ఉచ్ఛారణ కూడా తెలిసేది కాదు! అడవిజంతువులతో బాటే సంచరిస్తూ... జంతువుల్లాగే అరుస్తూ ఉండేవాడట! ఆ తర్వాత చాలాకాలానికి మనిషి సంజ్ఞ చేయడం నేర్చుకున్నాడు. క్రమక్రమంగా ఉచ్ఛారణ తెలిసింది. పలకడం అన్నది ఈ ప్రాంతంలోనే ప్రప్రథమంగా ప్రారంభమయ్యిందని నానుడి! ఈ ప్రాంతంలో కొద్దికాలం నివసిస్తే పలకడం బాగా వస్తుందన్న ప్రచారం వ్యాపించడంతో ఈ ప్రాంతాన్ని ‘పలకాల’గా పిలిచేవారు. అదే కాలక్రమంలో ‘పరకాల’గా స్థిరపడింది.

రవాణా సదుపాయాలు[మార్చు]

పరకాలలో బస్సు డిపో ఉంది. ఈ డిపో ముఖ్యముగా గోదావరిఖనికి ఎక్కువ సర్వీసులు కలిగి ఉంది.ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. 30 కి.మీ. దూరంలో వరంగల్లో, 25 కి.మీ. దూరంలో ఉప్పల్ (కరీంనగర్ జిల్లా) గ్రామంలో ఉన్నాయి.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 80,542 - పురుషులు 40,084 - స్త్రీలు 40,458
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 
"https://te.wikipedia.org/w/index.php?title=పరకాల&oldid=2094464" నుండి వెలికితీశారు