మిషన్ భగీరథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిషన్ భగీరథ
PM launches first phase of Mission Bhagiratha.jpg
మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
తేదీ ఆగష్టు 7, 2016
ప్రదేశం తెలంగాణ, భారతదేశం
నిర్వహణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
హాజరయ్యేవారు తెలంగాణ ప్రజలు
జాలస్థలం తెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు

మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది.[1]

ప్రారంభం[మార్చు]

మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు. దీంతో దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది.[2][3][4]

ఈ పథకం ద్వారా సుమారు రూ .42,000 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం రాష్ట్రంలోని 24,000 గ్రామాలు మరియు 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించబోతున్నారు.

లక్ష్యాలు[మార్చు]

  1. తాగునీటి సమస్యలను తీర్చడం
  2. స్వచ్ఛమైన మంచినీరు అందించడం
  3. మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం

విమర్శలు[మార్చు]

మిషన్ భగీరథ పనులు నాణ్యంగా సాగట్లేదని, సరైన సమయానికి పూర్తి కాలేదని పలు విమర్శలు ఎదురయ్యాయి.[5] ప్రత్యేకించి మిషన్ భగీరథ విషయమై టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలు నెరవేరలేదన్నది 2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక ముఖ్యమైన ప్రచారాస్త్రం అయింది.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "మిషన్ భగీరధ..!". Retrieved 20 December 2016. 
  2. వెబ్ దునియా. "మిషన్ భగీరథ అంటే ఏమిటి?". www.telugu.webdunia.com. Retrieved 20 December 2016. 
  3. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "PM Modi to launch Mission Bhagiratha today: All you need to know". Retrieved 20 December 2016. 
  4. హన్స ఇండియా. "PM launches first phase of Mission Bhagiratha". Retrieved 20 December 2016. 
  5. "భగీరథ యత్నమే!". Sakshi. 29 July 2018. Retrieved 9 December 2018.