Jump to content

సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సిద్దిపేట
తెలంగాణ శాసనసభలో నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్
లోకసభ నియోజకవర్గంమెదక్ లోక్‌సభ నియోజకవర్గం
ఏర్పాటు తేదీ1952
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
2వ తెలంగాణ శాసనసభ
ప్రస్తుతం
పార్టీభారత్ రాష్ట్ర సమితి
ఎన్నికైన సంవత్సరం2004 - ప్రస్తుతం
అంతకుముందుకల్వకుంట్ల చంద్రశేఖరరావు

ఇది సిద్దిపేట జిల్లాలోని శాసనసభ శాసనసభ స్థానాలలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • సిద్దిపేట రూరల్
  • చిన్నకోడూర్
  • నంగునూర్
  • నారాయణరావుపేట్
  • సిద్దిపేట అర్బన్

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి బి.అంజయ్య కాంగ్రెస్ పార్టీ
2014 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి టి.శ్రీనివాస గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2018 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి మరికంటి భవాని రెడ్డి తెలంగాణ జన సమితి
2023[2] టి. హరీశ్ రావు భారత్ రాష్ట్ర సమితి పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ

శాసనసభ సభ్యులు

[మార్చు]

సిద్ధిపేట నియోజకరవర్గమునకు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ సభ్యుల పట్టిక

సంవత్సరం పేరు రాజకీయ పార్టీ
1952 అడ్ల గురవా రెడ్డి పి.డి.ఎఫ్. పార్టీ
1957 పి.వి.రాజేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
1962 సోమేశ్వర్ రావు స్వతంత్ర
1967 వల్లూరి బసవరాజు కాంగ్రెస్ పార్టీ
1970 (ఉప ఎన్నిక) అనంతుల మదన్ మోహన్[3] స్వతంత్ర
1972 అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ
1978 అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ
1983 అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ
1985 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ
1989 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ
1994 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ
1999 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ
2001 (By-Poll) కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
2004 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
2004 (By-Poll) టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
2008 (By-Poll) టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
2009 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
2010 (By-Poll) టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
2014 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
2018 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జిల్లా శ్రీనివాస్‌పై 44668 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కె.చంద్ర శేఖరరావుకు 74287 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు 29616 ఓట్లు లభించాయి.

2004 ఉపఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయం సాధించడంతో రాజీనామా చేయుటవల్ల జరిగిన ఉపఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున కె.చంద్రశేఖరరావు అల్లుడు హరీశ్ రావు పోటీచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చెరుకు ముత్యంరెడ్డిపై 24827 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[4] హరీశ్ రావుకు 64374 ఓట్లు రాగా, ముత్యంరెడ్డి 39547 ఓట్లు సాధించాడు.

సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు

2008 ఉపఎన్నికలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజానామాలతో ఏర్పడిన ఖాళీ వల జరిగిన ఉప ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెరాస తరఫున మళ్ళీ హరిశ్ రావు పోటీచేసి 58935 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజయ్యపై విజయం సాధించాడు. హరీశ్ రావుకు 76270 ఓట్లు రాగా, అంజయ్యకు 17335 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన టి.హరీష్ రావు పోటీచేయగా, భారతీయ జనతా పార్టీ నుండి విద్యాసాగర్ రావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున అంజయ్య, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై నరసింహాచారి, లోక్‌సత్తా తరఫున టి.శ్రీనివాస్ పోటీచేశారు.[5]

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు[6]

[మార్చు]
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
BRS తన్నీరు హరీశ్ రావు 1,05,514 58.17
INC పూజల హరి కృష్ణ 23,206 12.79
BJP దూది శ్రీకాంత్ రెడ్డి 23,201 12.79
BSP గాధగోని చక్రధర్ గౌడ్ 16,610 9.16
స్వతంత్ర పిల్లి సాయి కుమార్ 4,970 2.74
స్వతంత్ర ఇతరులు 6,602 3.64
నోటా పై వ్యక్తులలో ఎవరూ కారు 1,300 0.72
మెజారిటీ 82,308 100.00
మొత్తం పోలైన ఓట్లు 1,81,403
BRS hold Swing

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (26 October 2023). "ఉద్యమ వేదిక.. చైతన్య గీతిక". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  2. Eenadu (4 December 2023). "కొత్తగా వచ్చింది ఇద్దరు స్థిరత్వం చూపింది ఇద్దరు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. ఈనాడు దినపత్రిక, తేది 2 జూన్ 2008, పేజీ 7
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  6. "General Elections to Assembly Constituencies: Trends & Results Dec-2023 Assembly Constituency 33 - Siddipet (Telangana)". Election Commissioner of India. Retrieved 13 March 2024.