చెరుకు ముత్యంరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరుకు ముత్యంరెడ్డి
చెరుకు ముత్యంరెడ్డి

చెరుకు ముత్యంరెడ్డి


శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి
పదవీ కాలము
1989 – 2009
నియోజకవర్గము దొమ్మాట శాసనసభ నియోజకవర్గం
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం సెప్టెంబరు 2, 2019
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (1989-2009)
భారత జాతీయ కాంగ్రెస్ (2009-2018)
తెలంగాణ రాష్ట్ర సమితి (2018-2019)
నివాసము హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

చెరుకు ముత్యంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. తెలుగుదేశం తరపున 1989, 1994, 1999లలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం, 2009లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి 1999లో పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

జననం[మార్చు]

ముత్యంరెడ్డి సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో జన్మించాడు.[2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

తొగుట గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముత్యంరెడ్డి, రెండు సంవత్సరాలు సహకార సంఘం ఛైర్మన్‌గా పనిచేశాడు. అనంతరం కొంతకాలం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. 1989లో తెలుగుదేశం పార్టీ తరపున దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి, 1994, 1999లో వరుసగా మూడుసార్లు గెలుపొందాడు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో చివరిసారిగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యంరెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో 2018, నవంబరు 20న తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు.

మరణం[మార్చు]

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 2 సోమవారం ఉదయం మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, తెలంగాణ (2 September 2019). "మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూత". www.eenadu.net (in ఆంగ్లం). Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019.
  2. నమస్తే తెలంగాణ న్యూస్, ప్రాంతీయం (2 September 2019). "మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత". Tnews. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019.
  3. సాక్షి, తెలంగాణ-సిద్ధిపేట (2 September 2019). "మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత". Sakshi. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019.