Jump to content

సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°12′40″N 80°49′55″E మార్చు
పటం

సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం,ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య: 10,శాసనసభ వరుస సంఖ్య: 116

సత్తుపల్లి నగరపంచాయితీ కార్యాలయం

పూర్వచరిత్ర

[మార్చు]

రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న సంస్థృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి ఉంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్థృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్ఫూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా ఉంది. స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.

ప్రత్యేకతలు

[మార్చు]

నియోజక వర్గంలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్‌ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్‌ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్‌ మిల్లు, కెమిలాయిడ్స్‌ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా ఉంది. ఇటీవల కాలంలో బి.ఇ.డి కళాశాలలు, ఇంజనీరింగ్‌, జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ప్రవేటు యాజమాన్యంలో నెలకొల్పడం ద్వారా విద్యాపరంగా ఈ ప్రాంత గణనీయమైన ప్రగతిని సాధించింది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] 116 సత్తుపల్లి ఎస్సీ మట్టా రాగమయి[3] మహిళా భారత జాతీయ కాంగ్రెస్ 111245 సండ్ర వెంకటవీరయ్య పు బీఆర్​ఎస్​ 91805
2018 116 సత్తుపల్లి ఎస్సీ సండ్ర వెంకటవీరయ్య పు తె.దే.పా 100044 పిడమర్తి రవి పు టిఆర్ఎస్ 81042
2014 116 సత్తుపల్లి ఎస్సీ సండ్ర వెంకటవీరయ్య పు తె.దే.పా 74776 మట్టా దయానంద విజయ్ కుమార్ పు వైస్సార్సీపీ 72434
2009 116 సత్తుపల్లి ఎస్సీ సండ్ర వెంకటవీరయ్య పు తె.దే.పా 79491 సంభాని చంద్రశేఖర్ పు కాంగ్రెస్ 65483
2004 277 సత్తుపల్లి GEN జలగం వెంకటరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 89986 తుమ్మల నాగేశ్వరరావు పు తె.దే.పా 80450
1999 277 సత్తుపల్లి GEN తుమ్మల నాగేశ్వరరావు పు తె.దే.పా 87717 పొంగులేటి సుధాకర్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 56688
1994 277 సత్తుపల్లి GEN తుమ్మల నాగేశ్వరరావు పు తె.దే.పా 74049 జలగం ప్రసాదరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 66455
1989 277 సత్తుపల్లి GEN జలగం ప్రసాదరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 61389 తుమ్మల నాగేశ్వరరావు పు తె.దే.పా 54960
1985 277 సత్తుపల్లి GEN తుమ్మల నాగేశ్వరరావు పు తె.దే.పా 49990 లక్కెనేని జోగారావు పు భారత జాతీయ కాంగ్రెస్ 46172
1983 277 సత్తుపల్లి GEN జలగం ప్రసాదరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 42494 తుమ్మల నాగేశ్వరరావు పు IND 36278
1979 By Polls సత్తుపల్లి GEN జలగం వెంగళరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 48602 యు.సత్యం పు IND 25544
1978 277 సత్తుపల్లి GEN జలగం వెంగళరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 42102 కాళోజీ నారాయణరావు పు JNP 19483

ఎన్నికలలో ప్రముఖులు

[మార్చు]

1952లో జలగం వెంగళరావు తొలుత వెంసూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ గెలవలేదు. 1977లో కాళోజీ నారాయణరావు సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు.కానీ డిపాజిట్ కోల్పోయారు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Eenadu (4 December 2023). "సత్తుపల్లి తొలి మహిళా ఎమ్మెల్యే రాగమయి". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.