Jump to content

ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)

వికీపీడియా నుండి
(ఖమ్మం ఖిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఖమ్మం ఖిల్లా (Khammam Fort)

[మార్చు]

స్థానం: స్తంభాద్రి కొండ, ఖమ్మం నగరం, తెలంగాణ, భారతదేశం భౌగోళిక స్థితి: 17°14′43″N 80°08′48″E రకం: గిరిదుర్గం (Hill Fort) ఎత్తు: 867 మీటర్లు ప్రస్తుత స్థితి: భారత పురావస్తు శాఖ ద్వారా రక్షిత స్మారకంగా ప్రకటించబడింది (2005) ప్రవేశం: ప్రజలకు అనుమతి ఉంది.

చరిత్ర

[మార్చు]

ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ల చరిత్రను మోసుకెళ్తున్న గిరిదుర్గం. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడినదిగా చరిత్ర చెబుతోంది. పురాతన శాసనాలలో "ఖమ్మమెట్టు"గా పేర్కొన్న ఈ ప్రాంతం, ఆధ్యాత్మికత, వ్యూహాత్మకత, శిల్పకళా వైభవం కలగలిపిన చారిత్రక కేంద్రమైంది.

ఖిల్లా పైనుండి అన్ని బురుజులు చూడటానికి వీలుగా ..

ఈ కోట నిర్మాణానికి బీజం సా.శ. 950లో పడింది. వెలుగుమట్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు—రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి—పొలం పనుల్లో నిధిని కనుగొని, కాకతీయ ప్రభువుల అనుమతితో ఈ ధనాన్ని కోట నిర్మాణానికి వినియోగించారు. మొదట మట్టితో నిర్మించిన ఈ కోట, తరువాత గ్రానైట్ రాళ్లతో శాశ్వత నిర్మాణంగా మారింది. లక్ష్మారెడ్డి తవ్వించిన చెరువు, కాలక్రమంలో "లకారం చెరువు"గా ప్రసిద్ధి చెందింది.

1006 సంవత్సరానికి ఈ కోట నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు రెడ్డి వంశీయుల ఆధీనంలో ఖమ్మం ఖిల్లా కొనసాగింది. అనంతరం వెలమ రాజులు, నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాలు ఈ కోటను పాలించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత, తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంత రాజులు మూసురులి నాయకత్వంలో పదేళ్లపాటు పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఓడ్ర గజపతిరాజు ఖమ్మం ఖిల్లాను జయించి, కాపా నాయుడు, పోలా నాయుడు వంటి మహేంద్ర వీరులు పాలన చేపట్టారు.

ఫిరంగి

15వ శతాబ్దంలో ఖమ్మం ఖిల్లా పాలనకు వచ్చిన సీతాపతిరాజు, బహమని సుల్తానుల సహాయంతో వరంగల్‌కు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఇతడు "షితాబ్ ఖాన్" అనే ముస్లిం బిరుదుతో ప్రసిద్ధి చెందాడు. ఇతని మంత్రిగా పనిచేసిన పెద్దామాత్యుడు సహాయంతో, తెలంగాణలో తెలుగు సామ్రాజ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. "గోల్కొండ సీమ కావ్యాలు"లో "చిత్తాబ్జ ఖానుడు" అనే పదం ఇతనికే సంబంధించినదిగా ఆదిరాజు వీరభద్రరావు పరిశోధనలో తేలింది.

2025

సీతాపతిరాజు, హిందూ శిల్ప సంపదను కాపాడేందుకు శివ, విష్ణు ద్వారపాలకులు, రాజనర్తకి, సూర్య భగవాన్ విగ్రహాలను భూమిలో పూడ్చి భద్రపరిచాడు. ఇవి తవ్వకాల్లో బయటపడగా, పురావస్తు శాఖ వాటిని గణపేశ్వరాలయం సమీపంలో భద్రపరిచింది. ఇతడు ఓరుగల్లు పాంచాలరాయ దేవాలయాన్ని పునరుద్ధరించిన ఘనతను కూడా పొందాడు.

1531లో సీతాపతిరాజును ఓడించిన సుల్తాన్ కులీకుత్బ్ ముల్క్, ఖమ్మం ఖిల్లాను కుతుబ్ షాహీల అధీనంలోకి తీసుకొచ్చాడు. 1687లో ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత నిజాం పాలనలోకి వచ్చిన ఖమ్మం ఖిల్లా, 1722లో నిజాం ముల్కీ అసల్‌జీ స్వాతంత్య్రాన్ని ప్రకటించి, 1937లో నిజాం ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

పాలకుల పరంపర

[మార్చు]
కాలం పాలకులు
1210–1369 ముసునూరి నాయకులు
1369–1433 గురిజాల నాయకులు
1512–1515 స్వతంత్ర పాలకులు
1515–1518 షితాబ్ ఖాన్ (సీతాపతిరాజు)
1518–1614 కుతుబ్ షాహీ వంశం
1615 -1685 శ్రీకష్ణదేవరాయలు
1687–1707 మొఘల్ సామ్రాజ్యం
1707–1948 ఆసఫ్ జాహీ వంశం
1948–ప్రస్తుతం భారత ప్రభుత్వం

ఖిల్లా శిల్పకళ - నిర్మాణ శైలి

[మార్చు]

ఖమ్మం ఖిల్లా నిర్మాణ శైలి అనేక మతాల ప్రభావంతో మిశ్రమంగా రూపుదిద్దుకుంది. హిందూ శిల్పకళ, ఇస్లామీయ గోపురాలు, బౌద్ధ ప్రభావాలు ఈ కోట నిర్మాణంలో కనిపిస్తాయి. ఈ కోట నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది. ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు, వెడల్పు 15 నుంచి 20 అడుగులు. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి, వాటిలో పత్తార్‌ దర్వాజాగా పిలువబడే సింహద్వారం అతి పెద్దది. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించగల సామర్థ్యం ఉంది. కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌దౌలా బావి ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు నీటి కాలువలు, రాతి అడుగులు, పహారా మూలాలు అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడ్డాయి. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగ మార్గం కూడా ఉన్నదని స్థానిక కథనాలు చెబుతున్నాయి.

మతపరమైన ప్రాముఖ్యత

[మార్చు]

స్తంభాద్రి కొండపై ఉన్న నరసింహ స్వామి ఆలయం, ఖమ్మం ఖిల్లాకు ఆధ్యాత్మిక శోభను అందిస్తుంది. కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పాలనలో నిర్మితమైన మసీదు, మహల్, బావులు ఈ కోట మతపరమైన మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి. పురావస్తు శాఖ భద్రపరిచిన హిందూ శిల్ప విగ్రహాలు—శివ, విష్ణు ద్వారపాలకులు, రాజనర్తకి, సూర్య భగవాన్—ఈ కోట చరిత్రలో సీతాపతిరాజు పాత్రను గుర్తుచేస్తాయి.


ఖమ్మం ఖిల్లా ( కోట) తెలంగాణలో రెండో అతిపెద్ద పర్యాటక కోటగా, వెయ్యి సంవత్సరాల చరిత్ర గలకోటగా పత్యేకతలున్న ఈ గిరిదుర్గపు ప్రవేశం ద్వారం వద్ద ఉన్న శిలాఫలకంపై ఆనాటి తెలుగులో ఈవిధంగా రాసి ఉంది.

కాకతాయుల చిహ్నం

హయగరుడ కోటలో గొంగ్గ,

బయ్యతల గుండు గండ గడి,

. కోటమాల గంగని తలగుండు గండ,

తేరా సామంత బారామండలి కాయ,

జాయుల మూరురాయ జగద్దళ ముఖి,

బీరుసస్థాపంగా బీతిరుద్రకాని స్థాపంగా బీతి,

.కాకతీయ రాజ్యస్థాపనాఛాయ్య నెల్లూరి వీరక్ష.

అంతే కాకుండా కోట గోడలపై వివిధ చిత్రాలు అనేక సన్నివేశాలను వివరిస్తున్నట్లు గీసారు. ఒక గుర్రానికి ముందు వెనుకలగా ఇద్దరు వ్యక్తులు నిలబడిన చిత్రం లాంటివాటి వెనకున్న భావాన్ని పరిగట్టేందుకు పరిశోధకులు మరింత కృషిచేస్తే చరిత్రగతిలో మరుగున పడిపోయిన ఏన్నో విషయాలు వెలుగు చూసే అవకాశం వుంటుంది.

శ్రీకృష్ణదేవరాయల సందర్శన

[మార్చు]

దేశభాషలందు తెలుగు లెస్సని చెప్పిన కవిరాజు శ్రీకృష్ణదేవరాయలవారితో కూడ ఈ కోటకు గల సంభందాన్ని చారిత్రక ఆధారాలతో నిరూపించారు.

మన వాడు కాదని , స్థానికులు పాడు చేశారు .

క్రీ.శ. 1615లో శ్రీకష్ణదేవరాయలు కులీకుతుబ్‌షాహీని ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆంధ్రభోజుడు శ్రీకష్ణదేవరాయలు తన దిగ్విజయయాత్రలో భాగంగా దీనిని కూడా జయించారట గజపతుల నుంచి 1615లో దీనిని స్వాధీనపరచుకున్నారు. ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణము లో కృతిపతి కృష్ణదేవరాయల శౌర్య ప్రతాపములు వర్ణించే సందర్భంలో ‘‘గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె’’ అని పారిజాతాపహరణం ప్రబంధంలో వర్ణించడం సాహిత్యపూర్వక ఆధారంగా ఈ విషయాన్ని దృవీకరిస్తోంది.

ఆ పూర్తి పద్యం ఇది ఉదయాద్రి వేగ యత్యుద్ధతి సాధించె, - వినుకొండ మాటమాత్రాన హరించెఁ, గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె, - బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె, దేవరకొండ యుద్వృత్తి భంగము సేసె, - జల్లి పల్లె సమగ్రశక్తి డులిచెఁ, గినుక మీఱ ననంతగిరి క్రిందుపడఁ జేసె, - గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు రాజమాత్రుండె! శ్రీకృష్ణరాయవిభుఁడు.

పర్యాటక దినోత్సవం సందర్భంగా ఖిల్లా పై రాక్‌ క్లైబింగ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు. జాతీయ పండుగల నాడు ఖిల్లాపై అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. 2010లో శ్రీకృష్ణదేవరాయలు పంచశతాబ్ది పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా అప్పటి కలెక్టర్ రాయలవారి విగ్రహాన్ని ఖిల్లాపై ప్రతిష్టించారు. ఆ విగ్రహం కూడా నేడు శిథిలావస్థకు చేరింది. రేణుకా చౌదరి కేంద్రమంవూతిగా ఉన్నప్పుడు ఖిల్లాపైకి వెళ్ళేందుకు రేయిలింగ్ ఏర్పాటు చేసి మెట్లు చెక్కించారు. ఖిల్లాపై పర్యాటకులు సేద తీరాడానికి రెండు రేకుల షేడ్లు నిర్మించారు.