జగిత్యాల కోట
జగిత్యాల కోట | |
---|---|
జగిత్యాల, తెలంగాణ | |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
స్థల చరిత్ర | |
వాడిన వస్తువులు | రాతి |
జగిత్యాల కోట తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల గ్రామంలో ఉన్న కోట. సా.శ. 1747లో 20 ఎకరాల స్థలంలో నిజాం కాలంఓ ఫ్రెంచి ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ కోట నిర్మించబడింది.[1][2]
చరిత్ర - నిర్మాణం
[మార్చు]జగ్గదేవుడి పేరిట ఏర్పాటైన జగిత్యాల గ్రామం వందల ఏళ్లనుంచీ పరిపాలనా కేంద్రంగా ఉంది. ఎలగందల్ కోట పాలకులైన ముబారి జుల్‌ముల్క్ జాఫరుద్దౌలా, మీర్జా ఇబ్రహీంఖాన్‌లు ఈ జగిత్యాల కోటను నిర్మించారు.[3] నక్షత్రాకారంలో కట్టబడిన కోటకు అన్నివైపులా పెద్ద అఘాతాలను ఏర్పాటుచేసి, శత్రువులు కోటపై దాడి చేస్తే అడ్డుకునేందుకు దాదాపు 90ఫిరంగులను అమర్చారు. శత్రువులు రాకుండా నిర్మించిన ఈ కోటలో లోతైన అఘాతాలు, సైనికులకోసం ప్రత్యేక గదులు, ఫిరంగులు, ఆయుధాల నిల్వకు చీకటి గది, తాగునీటి కోసం నిర్మించిన బావి, సొరంగం ఉన్నాయి. కోట చుట్టూ ఉన్న అఘాతాల్లో, కోటలోని కోనేరులో ఎప్పటికి నీరు ఉంటుంది.
ఇతర వివరాలు
[మార్చు]కోటలోని ఫిరంగులపై ఉర్దూ భాష మహ్మద్ ఖాసిం పేరు రాసి ఉంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (14 October 2016). "చారిత్రక ఖిల్లా." Archived from the original on 16 July 2018. Retrieved 16 July 2018.
- ↑ ఈనాడు. "జగిత్యాల ఖిల్లా". Archived from the original on 17 July 2018. Retrieved 17 July 2018.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 16 జూలై 2018 suggested (help) - ↑ నవతెలంగాణ (25 January 2017). "పర్యాటక శోభితం." Archived from the original on 2018-07-16. Retrieved 17 July 2018.