Jump to content

మొలంగూర్ కోట

వికీపీడియా నుండి
మొలంగూర్ కోట
మొలంగూర్
శంకరపట్నం మండలం
కరీంనగర్ జిల్లా
తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
వాడిన వస్తువులురాతి

మొలంగూర్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఉన్న కోట.[1] కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ కోట గుట్ట కింద మొహర్రం రోజున జాతర జరుగుతుంది.

చరిత్ర - నిర్మాణం

[మార్చు]

13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యొక్క సైన్యధికారి అలిగిరి మహరాజ్‌ అనే సంస్థానదీశుడు ఈ గుట్టను తన ఖిల్లాగా చేసుకొని ఇక్కడినుండే ఓరుగల్లును పరిపాలించేవాడని గ్రామస్తులు చెబుతారు.[2] సుబేదార్‌ అనే వ్యక్తి గుట్టపై కోట నిర్మించాడని, గుట్ట కింద ఉన్న దూదుబావి నుంచి హైదరాబాదులో ఉన్న నిజాంకు గుర్రాలపై నీటిని తీసుకెళ్లేవారని చరిత్రకారుల అభిప్రాయం. కింద ఉన్న కోట నుండి గుర్రాలపై గుట్టపైకి వెళ్లడానికి వీలుగా రాతిబాటను కూడా నిర్మించారు.[3]

ఇతర విశేషాలు

[మార్చు]

ప్రాచీనకాలంనాటి నిర్మాణ నైపణ్యంతో ఈ కోటను అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ దూద్ బావి, పురాతన శివాలయం, సెయింట్ మలాంగ్ షా వాలి సమాధి ఉంది. దూద్ బావిలో ఉన్న పాలవంటి నీటికి గొప్ప ఔషధ విలువలు ఉండి అనేక వ్యాధులను నయం చేసేవని, మదుంగ్ షా వాలి యొక్క సమాధి కారణంగా దీనికి మోలాంగూర్ పేరు వచ్చిందని చెబుతారు.[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "మొలంగూర్‌ ఖిల్లా". Archived from the original on 16 July 2018. Retrieved 15 July 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూలై 2018 suggested (help)
  2. సాక్షి (25 January 2017). "చారిత్రక కట్టడం మొలంగూర్‌ ఖిల్లా". Archived from the original on 2018-07-15. Retrieved 16 July 2018.
  3. సాక్షి (20 August 2018). "ముచ్చటైన కోట.. 'మొలంగూర్‌'". Archived from the original on 20 August 2018. Retrieved 20 August 2018.
  4. The Hans India (10 September 2017). "Molangur Fort in a state of neglect". Archived from the original on 2018-07-15. Retrieved 16 July 2018.