గాంధారి ఖిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధారి ఖిల్లా

గాంధారి ఖిల్లా మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలో ఉంది. ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం చివరి వరకు పోరాటం రాజ్‌ గోండ్‌’ లు ఈ కోటను నిర్మించారు.[1]

ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. గోండు, గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను ఒక గుట్టలోనే చెక్కారని చెబుతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఖిల్లా ప్రసిద్ధిగాంచింది.

నిదర్శనం జిల్లాలోని మందమర్రి, మంచిర్యాల మధ్యన నాగ్‌పూర్ - హైదరాబాద్ రహదారి పక్క నుంచి సుమారు 12 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతం నుంచి తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కేంద్రం నుంచి పాలవాగు దాటి వెళితే కనిపించే ఒక పెద్ద గుట్ట... ఆ గుట్టనే గాంధారి ఖిల్లాగా పిలుస్తారు. అందులోకి ప్రవేశిస్తే అంతా అశ్చర్యమే! గిరిజన శిల్పులు, కళాకారులు చెక్కినవిగా చెప్పే అద్భుతమైన శిలారూపాలు అక్కడ మనకు కనిపిస్తాయి.

లోపల రెండు దేవాలయాలు, సొరంగ మార్గం, పెద్ద నాట్య స్థలం, లైట్లతో చూస్తే కనిపించే ఒక దేవి విగ్రహం, పడగతో ఉన్న నాగుపాము, ఏనుగు బొమ్మలు, మైసమ్మ, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు బండకే చెక్కి కనిపిస్తాయి... లోపల ప్రథమ ద్వారం కాపలా దేవుళ్ల గుడి, ద్వితీయ ద్వారం వద్ద మైసమ్మ గుడి, నంది గుడి, ఖిల్లాపై మూడు మంచినీటి బావులు (ఎప్పటికి కొలనులో నీరు ఎండిపోకుండా ఉంటాయి) కనిపిస్తాయి... ఈ బావుల లోతు ఎనిమిది నులమ మంచాలంత ఉంటుందంటారు. ఈ బావులను ‘సవతుల బావులని’ పిలుస్తారు. బయట ఒక నీటి మడుగు ఉంటుంది. గుట్ట బండపై చాలా చోట్ల పాము పుట్టలు ఉన్నాయి. బావులలో ఏనుగులు వచ్చి నీళ్లు తాగేటివని చెబుతుంటారు. ఖిల్లా చివరివరకు మెట్లు గుట్టకే చెక్కబడి ఉంటాయి... ఈ నీటి మడుగు చాలా లోతుంటుందని చెబుతారు. దీని ముందు ఒక పెద్ద ఊర చెరువు ఉంది. దీని కింద వందల ఎకరాలు వ్యవసాయం చేస్తుండేవారని తిమ్మాపూర్ గ్రామస్తులు చెబుతుంటారు. కాసిపేట మండలంలోని కొత్తగఢ్‌పూర్ గ్రామానికి చెందిన రెడ్డ గోండులు ఇక్కడ పూజారులుగా వ్యవహరించారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ ఎలాగయితే అభివృద్ధికి దూరమయి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురయిందో అదే నిర్లక్ష్యానికి గురయింది గాంధారి ఖిల్లా. రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ నాయక్‌పోడ్ గిరిజనులు జాతర జరుపుకుంటారు. గత పదేండ్ల క్రితం ఒకసారి ఈ గుట్టల్లో ఎన్‌కౌంటర్ కూడా జరిగి ముగ్గురు పనిబాగ్చీ గ్రూపుకు చెందిన వారు మరణించిన దాఖలాలు ఉన్నాయి. గిరిజన కళాసంపదలతో ఒక్కటైన ఈ గాంధారి ఖిల్లాను ఇంకా తెలంగాణ వచ్చినా ఈ విలువైన కళాసంపదని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికి కొంత మంది పర్యాటకులు అప్పుడప్పుడు గాంధారి ఖిల్లా వరకు పిక్‌నిక్‌లకు, పూజలకు వెళుతుంటారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ మాగజైన్. "గందారి కొట". magazine.telangana.gov.in. Retrieved 8 February 2017. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]

యూట్యూబ్ లో గాంధారి ఖిల్లా గురించిన వీడియో