Jump to content

కనకగిరి కోట

వికీపీడియా నుండి

ఖమ్మంజిల్లాలోని ఒక ప్రాచీన కోట ప్రాంతం ఖమ్మంజిల్లాలోని కల్లూరు ప్రాంతానికి దగ్గరలో వున్న సిరిపురంలో ప్రస్తుతం అడవులుగా వున్న ప్రాంతంలో ఈ కోట ఉంది. దీనిపేరు మీదుకాగే సిరిపురాన్ని కనకగిరి సిరిపురం లేదా కెజి సిరిపురం అని పిలుస్తారు.

కనకగిరి పేరుతో ఒక పద్యకావ్యాన్ని శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1898లో రచించారు. అప్పటి మద్రాసు యాజ్ఞవల్క్య ముద్రాక్షర శాల ( వై.వి. ప్రెస్సు) నుంచి విడుదల అయిన ఈ పద్యకావ్యంలో కనకగిరి యొక్క వివరాలను పేర్కొన్నారు.

కనక గిరి కావ్యంలో కనకగిరి ఎక్కడ వుందో ఇలా పేర్కొన్నారు. ‘‘ విజయవాటికడం గృష్ణానది దాటి, యటకుగించిత్పశ్చిమోత్తరంబుగా నొక్కింత దూరంబుగానున్న కల్లూరను నపర నామంబునబొదలు కనకగిరి మీదుగా జనుటకు ’’

ప్రాంతం

[మార్చు]

పేరు వెనక చరిత్ర

[మార్చు]

కనకము అంటే బంగారము అని అర్ధం బంగారపు దుర్గం లేదా బంగారు కొండ అనే అర్ధంలో ఈ పేరుని వాడి వుంటారు. ఇది సంపద్వంతమైనదనటానికి మరికొన్ని ఆధారాలు ధంసా దాడిలో భద్రాచలం కంటే ముందుగా దాడి చేసిన ప్రాంతం కనకగిరి అని చెపుతారు. ఆ తర్వాతి కాలంలోనూ కొన్ని జమిందారీ వంశాలకు ఈ కోటలో నిధి నిక్షేపాలు దొరకడం వల్ల బాగా స్థిరపడ్డారని స్థానిక ప్రతీతి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 80 కిలోమీటర్ల దూరంలోనున్న... ఒకప్పుడు ‘కనకగిరి’గా ఖ్యాతిగాంచిన నేటి కనిగిరి దుర్గం చరిత్ర ఇది. చరిత్ర కలిగిన కనిగిరిలోనే 13-14 వ శతాబ్దంలో యాదవ రాజైన కాటమరాజు, మనుమసిద్దులకు పోరాటం జరిగింది.[1]

సా.శ. 1510 సంవత్సరము నాటి ప్రతాపరుద్ర గజపతి వెలిచెర్ల శాసనములో అతడు తెలంగాణా దుర్గములను గెల్చినట్లు తెలియజేసారు. ‘‘ సభాపతి దక్షిణ భూమినాలాన్ విజిత్యది శ్రాణన పారిజాతః అనన్య సాధారణ సాహస శ్రీర్జగ్రాహ పశ్చాత్యెలుంగాణ దుర్గాన్ః శ్రీకృష్ణ దేవరాయల తిరుపతి శాసనములో నతని దిగ్విజయములలో ‘‘ మరింన్ని కళింగ దేశ దిగ్విజర్థమై బెజవాడకు విచ్చేసి కొండపల్లి దుర్గంబు సాధించి ఆ దుర్గం మీదనున్న ప్రహారరాజు శిరశ్చంద్రమహా పాత్రుండు బోడజినమప పాత్రుండు .... మొదలయిన వారినించి జీవగ్రాహంగాను పట్టుకుని వారికి అభయదానం ఇచ్చి ‘అనంతగిరి, ఉండ్రగొండ, ఉర్లకొండ, అరువపల్లి, జల్లిపల్లి, కందికొండ, కప్పలువాయి, నల్లగొండ, కంభంమెట్టు, కనకగిరి, శంకరగిరి మొదలయిన తెలుంగాణ్య దుర్గాలు ఏకథాటిని కైకొని సింహాద్రి పొట్నూరికి విచ్చేసి... అని వుంటుంది అందులో వివరించిన తెలుంగాణ భూమినే తిలింగా, తెలింగ, తెలింగాణాయని వారి చరిత్రలలో రాసారు.

శిధిల ఆదారాలు

[మార్చు]

కొండ పైకి చేరుకుని చూస్తే అక్కడ కోట గోడలు, ద్వారాలు, నాలుగు వైపులా వీరగల్లులు, పళ్లెరాల బావి, ఏనుగుల బావి అని స్థానికంగా పిలిచే మానవ నిర్మిత బావులు కనిపిస్తాయి. బహుశా గతంలో కొండపైకి సులభంగా చేరుకునే మార్ఘాన్ని ధ్వంసం చేయడం ద్వారా శత్రువులు చేరుకోకుండా చేసారని అంటారు. ప్రస్తుతం కొండపైకి చేరుకోవలసిన నడక దారి కూడా నిట్టనిలువుగా నాలుగు కిలోమీటర్లు నడవ వలసి వుంటుంది. పాములు అడవి జంతువులు ప్రమాదం ఉంది. స్థానికుల సహాయం లేకుండా కోటను చేరుకోవాలని ప్రయత్నిస్తే స్పష్టమైన ఏర్పడిన దారి లేక పోవడంతో దారి తప్పే అవకాశం ఉంది.

సంకీర్తనా చార్యుడి జన్మస్థలం

[మార్చు]

ఖమ్మంజిల్లాలోని కనిగిరి (కనకగిరి) ప్రాంతానికి చెందిన సంకీర్తనాచార్యుడు కృష్ణమాచార్యుడు. ఆయన చూర్ణిక ప్రక్రియలో... కొన్ని లక్షల వచనాల్ని రచించాడు. అందులో కొన్ని మాత్రమే వెలుగు చూశాయి. కృష్ణమాచార్యుని సింహగిరి నరహరి వచనాలతోనే... తెలుగుపాట ఆలయాల్లో చిందులు వేయడం మొదలుపెట్టిందని సంగీతజ్ఞులు బాలాంత్రపు రజనీకాంతరావు చెపుతారు.

దుర్భేధ్యమైన మార్గం

[మార్చు]

ఒకప్పుడు కోట మీదకు రథాలు ఏనుగులు వెళ్ళే దారిని శత్రుదాడుల క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ధ్వంసం చేసారని స్థానిక కథనాలలో చెపుతారు. ఇప్పుడు కొండమీదకు పూర్తిగా కష్టసాధ్యమైన దారిని ఏర్పాటు చేసుకుంటూ ఎక్కవలసి వుంటుంది. అదికూడా నిట్ట నిలువు మార్గంలో అడవి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎక్కాల్సి వుంటుంది.

ఖమ్మం జిల్లా పె నుబల్లి మండలం తల్లాడ రేంజ్‌ తాళ్లపెంట సెక్షన్‌లోని కనకగిరి అటవీప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది. సమాచారం కోసం తాళ్లపెంట సెక్షన్‌ గుర్రంగూడెం బీట్‌లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులితోపాటు ముళ్లపంది, అడవిపిల్లి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీఆర్వో వెంకటరామారావు, బీట్‌ అధికారి ఫకీరయ్య తెలిపారు.[2]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • ఈనాడు ఖమ్మం/మధిర; 2014, జనవరి-27; 3వ పేజీ.
  • కనకగిరి పద్యకావ్యం రచన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచనా సంవత్సరం 1898లో ప్రచురణ మద్రాసు యాజ్ఞవల్క్య ముద్రాక్షర శాల ( వై.వి. ప్రెస్సు)
  • [ https://www.facebook.com/rulersadiq/videos/2566863100264286/?fref=mentions&__xts__[0]=68.ARDGi8ncifkPK9a-y0f0on5uS-T_4z9Gos40W8PSB4e4mOeF_XIInBwyh29phVeEDBM8sEC6gtUWFLzHvX0_Qv-iEwJXV75umXBVmutu2GyVPnK4T_YRa-usWri_Fqy-RwtcIGwBHTYkeWTxRjxFeld6rT9x9FTqCc4c3SBRa45gGO_ipu0M1PdLQvHmMOrV6iU7EjTrBdccKAapaAyvz7msdSJ0KwCIaZxbI6Ur9IA3_1IXdTGwjYte3tBIePhcI2HOb0aBxmrgtAxvJmRR6FwMn9ZCxMFHWEIXn6qDo6Q89gJEhMU75clWwThPfeDSxEz4VetCZMv0w6iQeHbMMJeQBnZHH7jtpjeCpKPd&__tn__=K-R కనకగిరి కోట ట్రెక్కింగ్ అనుభవాలు2 అడవి దారిలో బోజన విరామంలో చూసిన నీళ్ళులేని కాలవ మార్గం]
  • [ https://www.facebook.com/rulersadiq/videos/2566864983597431/?fref=mentions&__xts__[0]=68.ARDGi8ncifkPK9a-y0f0on5uS-T_4z9Gos40W8PSB4e4mOeF_XIInBwyh29phVeEDBM8sEC6gtUWFLzHvX0_Qv-iEwJXV75umXBVmutu2GyVPnK4T_YRa-usWri_Fqy-RwtcIGwBHTYkeWTxRjxFeld6rT9x9FTqCc4c3SBRa45gGO_ipu0M1PdLQvHmMOrV6iU7EjTrBdccKAapaAyvz7msdSJ0KwCIaZxbI6Ur9IA3_1IXdTGwjYte3tBIePhcI2HOb0aBxmrgtAxvJmRR6FwMn9ZCxMFHWEIXn6qDo6Q89gJEhMU75clWwThPfeDSxEz4VetCZMv0w6iQeHbMMJeQBnZHH7jtpjeCpKPd&__tn__=K-R కనకగిరి కోట ట్రెక్కింగ్ అనుభవాలు3 కోట ముఖ ద్వారం దగ్గర సాదిక్ బృందం ]
  • [ https://www.facebook.com/rulersadiq/videos/2566867486930514/?fref=mentions&__xts__[0]=68.ARDGi8ncifkPK9a-y0f0on5uS-T_4z9Gos40W8PSB4e4mOeF_XIInBwyh29phVeEDBM8sEC6gtUWFLzHvX0_Qv-iEwJXV75umXBVmutu2GyVPnK4T_YRa-usWri_Fqy-RwtcIGwBHTYkeWTxRjxFeld6rT9x9FTqCc4c3SBRa45gGO_ipu0M1PdLQvHmMOrV6iU7EjTrBdccKAapaAyvz7msdSJ0KwCIaZxbI6Ur9IA3_1IXdTGwjYte3tBIePhcI2HOb0aBxmrgtAxvJmRR6FwMn9ZCxMFHWEIXn6qDo6Q89gJEhMU75clWwThPfeDSxEz4VetCZMv0w6iQeHbMMJeQBnZHH7jtpjeCpKPd&__tn__=K-R కనకగిరి కోట ట్రెక్కింగ్ అనుభవాలు4 కోటలో పళ్ళెరాల బావి]
  • [ https://www.facebook.com/rulersadiq/videos/2566869023597027/?fref=mentions&__xts__[0]=68.ARDGi8ncifkPK9a-y0f0on5uS-T_4z9Gos40W8PSB4e4mOeF_XIInBwyh29phVeEDBM8sEC6gtUWFLzHvX0_Qv-iEwJXV75umXBVmutu2GyVPnK4T_YRa-usWri_Fqy-RwtcIGwBHTYkeWTxRjxFeld6rT9x9FTqCc4c3SBRa45gGO_ipu0M1PdLQvHmMOrV6iU7EjTrBdccKAapaAyvz7msdSJ0KwCIaZxbI6Ur9IA3_1IXdTGwjYte3tBIePhcI2HOb0aBxmrgtAxvJmRR6FwMn9ZCxMFHWEIXn6qDo6Q89gJEhMU75clWwThPfeDSxEz4VetCZMv0w6iQeHbMMJeQBnZHH7jtpjeCpKPd&__tn__=K-R కనకగిరి కోట ట్రెక్కింగ్ అనుభవాలు5 ఏనుగుల బావి]
  • కనకగిరి కోట ట్రెక్కింగ్ అనుభవాలు