Jump to content

నిర్మల్ కోట

వికీపీడియా నుండి

నిర్మల్ కోట తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంది.పూర్వం నిర్మల్ ఖిల్లాను కేంద్రంగా చేసుకుని రాజు నిమ్మానాయుడు పరిపాలించాడు. నిర్మల్ కు సుమారు 400 ఏళ్ల ఘన చ‌రిత్ర ఉంది.[1] చారిత్రక ఖిల్లాగా.. నిజాం జమానాలోనే రెవెన్యూ జిల్లాగా.. రాజకీయ కేంద్రంగా.. పేరొందిన నిర్మల్‌ ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.

నిర్మల్ కోట (నిర్మల్ ఖిల్లా)
నిర్మల్ మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ
నిర్మల్ ఖిల్లా
నిర్మల్ కోటలు (నిర్మల్ గఢ్ లు )
నిర్మల్ కోట (నిర్మల్ ఖిల్లా) is located in Telangana
నిర్మల్ కోట (నిర్మల్ ఖిల్లా)
నిర్మల్ కోట (నిర్మల్ ఖిల్లా)
భౌగోళిక స్థితి18°57′00″N 79°24′53″E / 18.9501°N 79.4146°E / 18.9501; 79.4146
రకముకోట
ఎత్తు48 అడుగుల ఎత్తు
స్థల సమాచారం
హక్కుదారుకాకతీయులు వారి సామంత రాజైనా నిమ్మానాయుడు, కుంటి వేంకట్రాయుడు
నియంత్రణనిమ్మానాయుడు కుంటి వేంకట్రాయుడు, శ్రీనివాస్ రావు
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
పరిస్థితిశిథిలావస్థకు చేరుకుంది
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంక్రీ.శ. 1600 నుండి 1700 వరకు
కట్టించిందికాకతీయులు
వాడుకలో ఉందాలేదు
వాడిన వస్తువులురాతి, మట్టి, సున్నం

రాజుల పాలన

[మార్చు]

క్రీ.శ 1600 నుండి 1650 సంవత్సరాల వరకు పులి మడుగు ఖీల్లాదారు నిమ్మా నాయుడు రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ .1670 నుండి 1700 సంవత్సరాల వరకు నిజాం సింహాసనం కోసం రాజుల మధ్య అంతః కలహాలు జరిగాయి. డచ్ వారు, ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు దేశంలోని రాజుల మధ్య గొడవలు పెట్టి లాభ పాడేందుకు పావులు కదిపారు. వృద్ధాప్యం వల్ల రాజు వేంకట్రాయుడు పరిపాలనను త్యజించి అతని అన్న కొడుకు జలపత్రావు ను నిర్మల్ రాజుగా నియమించాడు. ఆ తర్వాత నిమ్మలను పాలించిన కణింగరాయుని కొడుకు శ్రీనివాసరావు ను రాజు గా నియమించి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాడు.

యువ రాజైనా శ్రీనివాస్ రావు ఎంతో చతురతతో రాజకీయ యుక్తులు, తంత్రాలు తెలిసికొని తగిన విధంగా సైనిక బలగాలను సమకూర్చి తన పాలనను పటిష్టంగా మచ్చుకొన్నాడు.

ఖిల్లాను తాకట్టు పెట్టిన నిమ్మారాజు

[మార్చు]

నాందేడ్ సుబేదార్ కప్పం పన్ను కోసం నిర్మల్ రాజు నిమ్మానాయుడును కుప్పం పన్ను కట్టుటకు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో నిమ్మానాయుడు తన వద్ద పన్ను కట్టుటకు తగినంతగా ధనం లేకపోవడంతో చేసేది ఏమీ లేక తన సమీప మిత్ర వాంకిడి రాజైనా కుంటి వేంకట్రాయుడు వద్దకు వెళ్ళి నిర్మల్ కోట ను తాకట్టు పెట్టి ముఫ్పై వేల రూపాయలు‌ అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును ఒక సంవత్సరం లోపల వడ్డీతో సహా చెల్లిస్తానని మాట కుదుర్చుకున్నాడు. ఒక వేళ కట్టుక పోతే తన కోటను శాశ్వతంగా స్వాధీనం చేసుకోవచ్చునని అప్పు పాబందు పత్రం వ్రాసి ఇచ్చిడు. ఒక రోజు రాజు పన్ను చెల్లించేందుకు నాందేడ్ వెళ్తుండగా భైంసా సమీపంలో దోపిడీ దొంగలు లూఠీ చేశారు. కుంటి వేంకట్రాయుడు వద్ద నుండి ముప్పై వేల రూపాయలు‌ అప్పు తీసుకుని అప్పటికే ఏడు సంవత్సరాలు కావడంతో ఆ డబ్బు వడ్డీతో సహా రెండు లక్షలు అయినాయి. అప్పు డబ్బులు కట్టుక పోవడంతో కుంటి వేంకట్రాయుడు తన సైన్యంతో నిర్మల్ కోటను ఆక్రమించుకోన్నాడు. నిమ్మానాయుడు ఆ బాధను తట్టుకోలేక చనిపోయాడు. [2] ఎంతో మహత్తర చరిత్ర కలిగిన ఉత్తర తెలంగాణలో నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది నిర్మల్‌ కోట.

కోట నిర్మాణం

[మార్చు]
నిర్మల్ కోట లోని అప్పటి ఫిరంగి.

1747లో ఫ్రెంచి ఇంజనీర్ల సహాయంతో నిర్మల్‌ గిరిదుర్గాను నిర్మించడం జరిగింది. నిర్మల్‌ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. శత్రువులు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశారు. పట్టణం చుట్టూ నిర్మించిన ప్రధానమైన రక్షణ గోడతో పాటు, రాజ సౌధం (ఖిల్లా గుట్ట) చుట్టు మరొక పటిష్ఠమైన రాతి గోడను నిర్మించారు. దీనినే ‘ఆంజనేయదుర్గం’ అంటారు.

కోటలోకి వెళ్ళడానికి తూర్పువైపు సింహద్వారం, దక్షిణ, ఉత్తర దిశల్లో మరో రెండు ప్రధాన ద్వారము, సింహ ద్వారానికి దగ్గరలో తూర్పుకు ఒక చిన్న ద్వారం, సభాభవనం, హవామహల్‌, అంతఃపురసౌధం, మంచినీటి కోనేరుబావి, ఇలా ఆనాటి రాతినిర్మాణాలు ఉన్నాయి.

రాజభవనం (ఖిల్లా గుట్ట) శ్రీనివాసరావు కాలంలో నిర్మించబడింది. బుడతకీచు అనే సన్నిహితుడి సలహాతో, శ్రీనివాసరావు ఫ్రెంచ్‌వారి సహాయంతో దీనిని కట్టించారు. కోట చుట్టూ సున్నంతో ఎత్తయిన బలిష్టమైన రాతి, ఇటుక గోడ, గోడపొడవునా లోతైన కందకం త్రవ్వించి కందకంలో ఎల్లప్పుడూ నీరు వుండే విధంగా అమర్చి బయటనుండి శత్రువు కోటలోకి రాకుండా మొసళ్ళను దింపేవారు.

వీటిన్నింటిలో ప్రత్యేకమైనది గొలుసు దర్వాజ. ఈ దర్వాజకి పెద్ద ఇనుప పలక వుండేది. వీటని బలిష్టమైన గొలుసుతో పెద్ద చక్రాలకు చుట్టి వుంచేవారు. ద్వారం మూసివేయడానికి తెరవడానికి గొలుసును, వీటిని లాగడానికి ఏనుగును ఉపయోగించేవారు. ఈ దర్వాజా నిర్మాణ తీరును చూస్తే శత్రువు రాకను అడ్డుకోవడానికి ఎంత నైపుణ్యంతో నాటి నిర్మాణాలు చేసారో అర్థమవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి వెడల్పు పనుల కారణంగా దర్వాజకు సంబంధించిన ఒక దిమ్మె ధ్వంసం అవటంతో మరొక దిమ్మె మాత్రమే ఇప్పుడు ఉంది.

మొత్తంగా నిర్మల్‌ పట్టణంలో ఏడు సింహ ద్వారాలు ఉండేవి. రాజా శ్రీనివాసరావు కాలంలో మొదటి ప్రహరీలో సైనిక శిబిరం ఏర్పాటు చేసేవారు. అప్పటికాలంలో పెట్టిన పేర్ల ఆధారంగా నేటికీ కొనసాగుతున్న నివాస వాడు ఇప్పటికీ మనకు పట్టణంలో కనిపిస్తాయి. నాటి సింహద్వారాలు మాత్రం మనకు శిథిలావస్థలో కనిపిస్తాయి. కొన్ని ద్వారాలు అసు ఆనవాళ్ళే లేకుండా పోయాయి. నిర్మల్‌ కోటల్లో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న కోటల్లో ‘బత్తీస్‌ ఘడ్‌’ కోట కూడా ఒకటి.

నిర్మల్ కోటల పేర్లు

[మార్చు]

బత్తీస్ గఢ్ నిర్మల్ కోటలు, కట్టడాలు గత వైభవాన్ని చాటి చెప్పుతుంది. నేడు ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి.బత్తీస్ గఢ్ మీదికి ఏనుగు అంబారి పై వెళ్ళేందుకు సింహద్వారం నిర్మించి ఇతర గాఢ్ లోనికి వెళ్ళిందుకు సొరంగాలు నిర్మించాడు. నిర్మల్ పట్టణానికి తూర్పు దిశన ఉన్న బత్తీస్ గఢ్ కోట శిథిలమైపోతూ అవశేషాలుగా మిగిలినవి.రాజు నిర్మల్ చుట్టూరా ఉన్న గ్రామాలలో 32 గఢ్ లను కట్టి వాటిలో సైన్యాన్ని, ఎత్తైన ప్రదేశంలో గూఢచారులను ఉంచేందుకు రాతి, మట్టి సున్నం మిశ్రమంతో ఈ కోటను నిర్మించాడు.32 గఢ్ లో 32 గదుల భవనం ఉన్నందున దీనిని బత్తీస్ గఢ్ అని అంటారు.

శ్యాంఘడ్ రాజు శ్రీనివాస్ రావు తన ఆశ్విక సైన్యంలో ఆరితేరిన అశ్వ సైన్యాధిపతి ఎహత్ శ్యాం జంగ్ ను నియమించాడు. ఆ సైన్యాధిపతి పేరుతో ఈ గఢ్ కు శ్యాంగఢ్ అని పేరు పెట్టాడు.

సోన్ గఢ్ ఇప్పుడు ఉన్న సోఫినగర్ ప్రాంతంలో ఉన్న సోన్ గ్రామమునే సోన్ గఢ్ అని పిలుస్తారు.

చిట్టీ గాఢ్ ప్రస్తుతం ఉన్న చిట్యాల గ్రామం

ఏక్ శిలాగఢ్ , వేంకటేశ్వర గఢ్, ధంగఢ్, ఇలా నిర్మల్ చూట్టు మొత్తం 64 పురాతన గాఢ్ లు ఉన్నాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మన నిర్మల్.కాం. "నిర్మ‌ల్ చ‌రిత్ర‌". mananirmal.com. Archived from the original on 7 అక్టోబరు 2016. Retrieved 14 October 2016.
  2. ఈ తెలంగాణ మాగజైన్. "నిర్మల్‌ కోట". magazine.telangana.gov.in. Retrieved 14 October 2016.

ఇతర లంకెలు

[మార్చు]