నిజామాబాదు కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామాబాదు కోట
కోట ప్రవేశద్వారం
ప్రదేశంనిజామాబాదు, తెలంగాణ
భౌగోళికాంశాలు18°39′52″N 78°04′46″E / 18.6645716°N 78.079343°E / 18.6645716; 78.079343
నిర్మాణము10వ శతాబ్ధం
నిర్మాణ శైలిరాష్ట్రకూట శైలీ

నిజామాబాదు కోట తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదులో ఉన్న కోట.[1] దీనిని 10 వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు. ఇది నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిశలో, మహాత్మా గాంధీ చౌక్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2]

కోట పైన ఉన్న ఆలయాన్ని రఘునాథ ఆలయం (జగన్నాథ్ ఆలయం, రామాలయం ఖిల్లా) అని పిలుస్తారు. ఇక్కడికి హిందూ మతం భక్తులు వస్తారు. పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. ఛత్రపతి శివాజీ తన గురువైన రాందాస్ ఆజ్ఞపై ఈ శ్రీరామ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. విశాలమైన మందిరాలతో ఉన్న ఈ ఆలయ 3,900 చదరపు. అడుగుల విస్తీర్ణంలో, ఎల్లప్పుడూ చల్లగా ఉండేందుకు తగు విధంగా నిర్మించబడింది. ఆలయంలో 53 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్తంభం ఉంది. ప్రతిరోజు దీపం వెలిగించడానికి ఈ స్తంభాన్ని ఉపయోగిస్తారు. ఈ దీపం చూసిన తర్వాతే చుట్టప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజులు వారివారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారట.[3]

నిజామాబాదు కోటలోని సమాధులు

చరిత్ర[మార్చు]

నిజామాబాదు కోటను 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఖిల్జీ వంశానికి చెందిన రెండవ పాలకుడు అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ ( 1296 నుండి 1316) 1311 లో ఈ కోటను ఆక్రమించాడు. ఆ తరువాత దీనిని కుతుబ్ షా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్ నిజాం ప్రభువైన అసఫ్ జాహిస్ కోటను పునర్నిర్మించి, జైలుగా మార్చాడు.[4]

కారాగారం[మార్చు]

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహాకవి దాశరథి, వట్టికోట, సర్దార్‌ జమలాపురం కేశవరావులు 1948లో ఈ ప్రాంతంలోనే బంధించబడ్డారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి శిక్ష అనుభవించిన దాశరథి, వట్టికోట జైలు లోపల రచనలు చేశారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ పద్యాలు దాశరథి జైలు గోడలపై రాశారు. 1948 జనవరి 30న గాంధీ మరణించినప్పుడు ‘క్షమామూర్తి’ అనే సంస్మరణ పద్యాన్ని దాశరథి జైలులోనే రాశాడు. 1949లో దాశరథి రచించిన ‘అగ్నిధార’ కావ్యాన్ని ప్రచురించగా ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలులో రాసినవేనని, ఆళ్వారుస్వామి 1955లో ప్రచురించిన ‘ప్రజల మనిషి’ నవలలో హీరో కంఠీరవం జైలు జీవితం గురించి తెలియజెప్పిన ఒక అధ్యాయం అంతా ఇక్కడి అనుభవాలేనని చరిత్రకారులు చెప్తున్నారు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా దాదాపు 2012 వరకు ఇది జైలుగానే కొనసాగింది. ఇక్కడి జైలును సారంగాపూర్‌ సమీపంలోని నూతన భవనానికి తరలించారు.[5]

కోట[మార్చు]

ఈ కోట పెద్ద ప్రాంతంలో ముస్లిం మతం ఆకృతిని పోలి, చుట్టూ రాతి గోడలతో ఉంటుంది.[4] కోట గోడల లోపలి పెద్దగా ఉంటుంది. ఇందులో ఒక మసీదు, ఒక పాఠశాల, అసఫ్ జహి రాజవంశం వాడబడిన జైలు ఉంది.[3] పైన ఒక ఆలయం ఉంది. 2001వ సంవత్సరంలో టూరిజం శాఖ వారు రూ 9.30 లక్షలతో గార్డు గదులు,. ఫైబర్ పైకప్పు మార్గం, మరుగుదొడ్లు మొదలైనవి నిర్మించారు.

ఆవరణ[మార్చు]

కోటను ఆవరణ ఇల్లు, పురాతన మసీదు నిజాం చే నిర్మించబడింది. జైలు శాఖ borstal పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాయి. కోటకు ఎడమ వైపున ఒక చిన్న సరస్సు ఉంది. నిజాం ఆదేశంతో సరస్సు సమీపంలో ఒక రహస్య సొరంగం నిర్మించారని చెబుతారు. కోట గోడలు మరియ ఆవరణ అసఫ్ జహి శైలి నిర్మాణకళను పోలి ఉన్నాయి. వాటిలో కొన్ని నిజాముల హయాంలో పునఃనిర్మించబడ్డాయి.[4]

దర్గా[మార్చు]

కోట పైన ఆలయం వెనుక వైపు ఒక చిన్న దర్గా ఉంది. ఉర్స్ ఉత్సవం సందర్భంగా ముస్లిం మతం భక్తులు ఈ దర్గాను సందర్శించేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరూ వెళ్లకపోవడంతో సమాధులు శిధిలావస్థలోకి వెళ్లాయి.

పర్యాటక కేంద్రంగా[మార్చు]

చారిత్రక ఖిల్లా జైలు గొప్పతనాన్ని, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి ప్రముఖుల జీవిత విశేషాలను తెలిపేందుకు ఈ ప్రాంతాన్ని ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 40 లక్షల రూపాయలు కేటాయించింది. కోట ఆధునీకరణతో భాగంగా దాశరథి, వట్టికోట విగ్రహాలతోపాటు నలుగురు పోలీసుల విగ్రహాలను బ్యారక్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ టూరిజం. "Nizamabad Fort". www.telanganatourism.gov.in. Archived from the original on 25 July 2016. Retrieved 15 October 2016.
  2. నిజామాబాద్.కాం. "Nizamabad Quilla Ramalayam – Raghunath Temple Photos". gonizamabad.com. Archived from the original on 11 July 2015. Retrieved 15 October 2016.
  3. 3.0 3.1 ది హిందూ (March 25, 2014). "Quilla Indur a potential tourist spot". Retrieved 15 October 2016.
  4. 4.0 4.1 4.2 ఇండియా9.కాం. "Quilla Ramalayam". www.india9.com. Retrieved 15 October 2016.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. telugu, NT News (2023-07-19). "పర్యాటక ప్రాంతంగా 'దాశరథి' జైలు". www.ntnews.com. Archived from the original on 2023-07-19. Retrieved 2023-07-19.

ఇతర లంకెలు[మార్చు]