ప్రతాపగిరి కోట
ప్రతాపగిరి కోట | |
---|---|
ప్రతాపగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ | |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | సుమారు 1000 సంవత్సరాల క్రితం |
కట్టించింది | కాకతీయులు |
వాడిన వస్తువులు | రాతి |
ప్రతాపగిరి కోట, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, ప్రతాపగిరి గ్రామంలో ఉంది. కాకతీయులు ఈ కోటని నిర్మించారు.
చరిత్ర
[మార్చు]ఈ కోటని ముచ్చనాయనిం 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు కోటలో ఉన్న శాసనాలు బట్టి తెలుస్తోంది.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ కోటని కాకతీయులు తమ రాజ్య సంరక్షణ కోసం గోదావరి నది తీరం ఒడ్డున నిర్మించారు ఈ కోట చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడను ఎత్తైన బండరాళ్లతో నిర్మించారు. ఈ కోటను ప్రతాగిరి గుట్టపై నాలుగు ప్రాకారాలతో, కోటపై సైనికులు నడవడానికి డగ్గు సున్నం, కంకర్లతో నిర్మించిన దారులున్నాయి. ఈ కోటలో సొరంగ్గ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో ఉన్న గోడలపై తెలుగు భాషలో చెక్కిన తొమ్మిది వరుసల్లో శాసనాలు చెక్కి ఉన్నాయి.[1]
దారి
[మార్చు]ఈ కోటను మంథని పట్టణం నుండి మహదేవపూర్‌లు దాటి కాటారం అటవీ ప్రాంతం మీదుగా 35 కి.మీ. ప్రయాణిస్తే ఈ ప్రాంతాన్ని కోరుకోవచ్చు.[2][3]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-19. Retrieved 2019-07-19.
- ↑ http://magazine.telangana.gov.in/ప్రతాపగిరి-కోట/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-19. Retrieved 2019-07-19.