రాజాపేట కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజాపేట కోట
రాజాపేట, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజాపేట కోట ముఖద్వారం
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
వాడిన వస్తువులురాతి

రాజాపేట కోట తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రాజాపేట గ్రామంలో ఉన్న కోట. 1775లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజరాయన్న రాజు ఈ కోటను నిర్మించడమేకాకుండా రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటుచేశాడు.[1][2]

చరిత్ర

[మార్చు]

యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలంగాణలో అత్యధిక ఆదాయము వచ్చే ఈ సంస్థానాల్లో ఒకటిగా పేరు పొందిన ఈ కోటను 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించాడు. ఆ కాలంలో ఇక్కడ నుండి సుమారు 50వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేది.

నిర్మాణం

[మార్చు]

కోట చుట్టూ 18 అడుగుల ఎత్తుతో రాతి గోడను కట్టించి, కోట లోపలి నుంచి బయటకు సొరంగ మార్గాలు తవ్వించాడు. కోట లోపల రాణుల అంతఃపురాలు, అతి సుందర భవనాలు, స్నానవాటికలు నిర్మించడమేకాకుండా కోట గోడల ముందు పెద్ద అఘాతంలో నీటిని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను పెంచేవారు. కోట ముఖద్వారానికి 32 అడుగుల ఎత్తయిన తలుపులు అమర్చడంతోపాటూ మొదటి ముఖద్వారం నుంచి మూడో ముఖద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గంను ఏర్పాటుచేశారు. రెండున్నర శతాబ్ధాల క్రితం నిర్మించిన రాజు నివాసం, అంతఃపురం, అతిథి స్నానవాటిక, అద్దాలమేడ, మంత్రులు, సేనాపతుల ఆవాసాలు, ఎత్తైన బురుజులు, గిరిగిరిమాల్, సరస్సు, కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటి నిర్మాణాలు కనిసిస్తాయి.[3]

కోటలోని శిల్పకళ పాలకుల కళాతృష్ణను తెలియజేస్తుంది. దర్వాజలు, బాల్కానీలు, బురుజులను అందంగా నిర్మించడంతోపాటూ అద్దాల మేడపైకి చేరుకునేందుకు చార్మినార్ లాగా మెట్లు కూడా ఏర్పాటుచేశారు. భవనంలోని గదుల్లో చెక్కిన శిల్పాలు, సింహాసనాలను పోలిన కుర్చీలు కన్పిస్తాయి.

వేడుకలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తొలిసారిగా రాజాకోటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న చారిత్రాత్మక పురాతన కట్టడాలను వెలుగులోకి తేవాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ఫూర్తిమేరకు రాజాకోటపై జెండా ఎగురవేయబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (2 January 2015). "చరిత్రకు సజీవ సాక్ష్యం రాజాపేట కోట." Archived from the original on 17 July 2018. Retrieved 17 July 2018.
  2. తెలంగాణ మ్యాగజైన్. "రాజపేటకోటలో రహస్య మార్గం". magazine.telangana.gov.in. Archived from the original on 7 ఆగస్టు 2018. Retrieved 17 July 2018.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ కథనాలు (3 October 2015). "దెబ్బ తింటున్న కోట సాక్షిగా చరిత్ర శిథిలమవుతోంది..." Archived from the original on 25 April 2019. Retrieved 25 April 2019.