రాజాపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజాపేట
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో రాజాపేట మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో రాజాపేట మండలం యొక్క స్థానము
రాజాపేట is located in Telangana
రాజాపేట
రాజాపేట
తెలంగాణ పటములో రాజాపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°44′07″N 78°54′56″E / 17.73528°N 78.915424°E / 17.73528; 78.915424
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము రాజాపేట
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 38,454
 - పురుషులు 19,613
 - స్త్రీలు 18,841
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.64%
 - పురుషులు 74.41%
 - స్త్రీలు 46.29%
పిన్ కోడ్ 508105

రాజాపేట, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. రాజాపేట సంస్థానం "తెలంగాణా దక్షిణ మహాద్వారం"గా ప్రసిద్ధి చెందినది. ప్రముఖ పుణ్య క్షేత్ర మైన యాదగిరి గుట్ట క్షేత్రం నుండి 20 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ సంస్థానం తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో ప్రముఖ మైనది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మనం చూడవచ్చును. రాజాపేట యొక్క చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ మనకు సజీవ సాక్ష్యాలుగా ఎన్నొ విశేషాలను కళ్ళకు కడుతున్నవి. మరిన్ని వివరాలకు http://www.rajapeta.com సైటు చూడండి. దస్త్రం:Samsthan Rajapeta fort entrance.jpg

గ్రామ చరిత్ర[మార్చు]

రాజాపేట సంస్థానం నిజాం పరిపాలన కాలం నాటి హైదరాబాద్ సంస్థానంలో ఉండినటువంటి 14 సంస్థానాలలో ఒకటి. క్రి. శ. 1775 సంవత్సరంలో 'రాజా రాయన్న' అనే రాజు ఈ సంస్థానాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ చారిత్రక కట్టడాలయిన ఎన్నో భవంతులు, అద్దాల మేడలు, తోటలు, విశాల మైన రహదారులు ఇప్పటికీ చూడవచ్చు.

ఈ సంస్థానం తెలంగాణాలో అత్యధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటిగా పేరు పొందినది. ఆ కాలంలో ఇక్కడ నుండి సుమారు 50 వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

'రాజా రాయన్న' తన పేరు మీద ఈ గ్రామాన్ని నిర్మించాడు కాబట్టి ఈ ఊరి పేరు 'రాజా రాయన్న పేట' గా మొదలై కాల క్రమేణా 'రాజాపేట' గా మారింది.

చారిత్రక కట్టడాలు:

 • అద్దాల మేడ
 • ఖిలా బురుజులు
 • సైనిక కవాతు బురుజు
 • ఏనుగుల మోట బావి
 • గోపాల చెరువు
 • కొత్త చెరువు

ప్రముఖ ఆలయాలు:

 • శ్రీ వెంకటేశ్వరా మఠం
 • సంగమేశ్వర ఆలయం
 • శివాలయం
 • రామాలయం (ఖిలా లో)
 • సత్యనారాయణ గుడి
 • సాయిబాబా / హనుమాన్ ఆలయం
 • పోచమ్మ గుడి
 • మైసమ్మ గుడి
 • దుర్గమ్మ గుడి
 • మార్కండేయ గుడి
 • పుట్ట హనుమాన్ గుడి

ఇతర ప్రదేశాలు:

 • వాసవి కళ్యాణ మండపం / భజన మందిరం
 • గురుకుల విద్యాలయం క్యాంపస్

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 38,454 - పురుషులు 19,613 - స్త్రీలు 18,841

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. సింగారం
 2. జాల
 3. కుర్రారం
 4. బూరుగుపల్లి
 5. బొందుగుల
 6. పారుపల్లి
 7. పాముకుంట
 8. నర్సాపూర్
 9. రేణికుంట
 10. రాజాపేట
 11. నెమిల
 12. బసంతపూర్
 13. కాల్వపల్లి
 14. బేగంపేట
 15. చల్లూరు
 16. రఘునాథపురం
 17. దూదివెంకటాపురం
 18. సోమారం
 19. లక్ష్మక్కపల్లి
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"https://te.wikipedia.org/w/index.php?title=రాజాపేట&oldid=2023318" నుండి వెలికితీశారు