అక్షాంశ రేఖాంశాలు: 17°46′08″N 78°58′11″E / 17.768881°N 78.969711°E / 17.768881; 78.969711

బొందుగుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొందుగుల, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలంలోని గ్రామం.[1]

బొందుగుల
—  రెవిన్యూ గ్రామం  —
బొందుగుల is located in తెలంగాణ
బొందుగుల
బొందుగుల
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°46′08″N 78°58′11″E / 17.768881°N 78.969711°E / 17.768881; 78.969711
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం రాజాపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,467
 - పురుషుల సంఖ్య 1,728
 - స్త్రీల సంఖ్య 1,739
 - గృహాల సంఖ్య 819
పిన్ కోడ్ 508105.
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన రాజాపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భువనగిరి నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 819 ఇళ్లతో, 3467 జనాభాతో 2413 హెక్టార్లలో విస్తరించి ఉంది.[4] గ్రామంలో మగవారి సంఖ్య 1728, ఆడవారి సంఖ్య 1739. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 653 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576501.[5] పిన్ కోడ్: 508105.

బొందుగుల చరిత్ర

[మార్చు]
అరుదైన కుబేరశిల్పం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో బొందుగుల పెద్దగ్రామం.ఎవరి పేరు మీద ఈ వూరి కా పేరు వచ్చిందో ఆధారాలు దొరకలేదు. కాని, గ్రామంలోని ఆలయాలను చూస్తే బొందుగుల చాలా పురాతన గ్రామం అనిపిస్తుంది. గుళ్ళపంపు అనే పాటిగడ్డ (పాతవూరు) వున్నచోట చాలాపెద్ద త్రికూటాలయం ఉంది.అది శివాలయం అని తెలియడానికి మిగిలినవి ప్రధానగర్భాలయంలో చాళుక్యుల కాలంనాటి గుండ్రనిపానవట్టం, చిన్న, శిథిలనంది విగ్రహాలు. విశాలమైన దేవాలయ ప్రాంగణం, త్రికూట దేవాలయంలోని గుడుల ద్వారబంధాలపై కలశాలు, గజలక్ష్మి లలాటబింబాలున్నాయి.త్రికూటంలోపల రంగమంటపం, అర్ధమంటపాలతో విశాలంగా ఉంది. ఆనుకునివున్న ముఖమంటపం డంగుసున్నం, పలుగురాళ్ళు కలిపివేసిన కప్పు (డాబా) తో చెక్కుచెదరకుండా ఉంది.లోపలి గుళ్ళకు పైన ఇటుకల విమానాలున్నాయి.ఆ ఇటుకలు 14’8’3’ అంగుళాల కొలతలతో ఉన్నాయి.గుడి ఉత్తరాన వున్న బావి ఒకప్పుడు కోనేరేమో.గుడి బయట ఒక వీరశిల ఉంది.మరొక విరిగిన స్తంభశిలకు కలశం చెక్కివుంది.పునరుద్ధరణ చేసిన శివాలయం వూరికి వాయవ్యాన ఉంది.ఈ శివాలయం ఒకప్పుడు శైవులమఠమై వుండాలి.గుళ్ళపంపు దగ్గరి విగ్రహాలను ఇక్కడికి చేర్చారేమో తెలువదు.గుడి ముందర వీరభద్రుడు, దుర్గ, వింజామరతో ఒక పరిచారిక శిల, వినాయకుడి శిల్పాలున్నాయి.లింగం, పానవట్టం కాకతీయశైలిలో ఉన్నాయి.గుడికి ఈశాన్యాన కోనేరు, కోనేట్లోకి మెట్లు, దుస్తులు మార్చుకునే గదులున్నాయి.ఈ కోనేటినుండే వ్యవసాయానికి నీరుతోడిన గుర్తుగా రాతితెట్టె, మోటదారులు మిగిలివున్నాయి.గ్రామం నడుమ పాతకచేరీ ముందర వేణుగోపాలస్వామి గుడి ఉంది. గుడిముందరి స్థలంలో రెండు దీపస్తంభాలుండడం విశేషం. గుడికి ధ్వజస్తంభం కర్రతో చేసివుంది. గుడిప్రాంగణంలో రాళ్ళతోకట్టిన చేదబావి ఉంది.ఇప్పటికీ నీరుపైకే వుండడం మరోవిశేషం.గర్భగుడికి తాళం వుండడం వల్ల వేణుగోపాలస్వామి విగ్రహం చూడలేకపోయాం.బయట బృహచ్ఛిలపై ఆంజనేయునిశిల్పం ఎక్కడాలేనంత పెద్దదిగా ఉంది.దానికి చేసిన తొడుగు గుడిమంటపంలో ఉంది.గుడిపైని విమాననిర్మాణం 16 వ శతాబ్దం నాటిదనిపిస్తున్నది.దానికి పక్కన వుండే సత్రం కూలిపోయివుంది.గుడిముందర పూలపొదల్లో అనూరుడు మాత్రమే కనిపిస్తున్న సూర్యుని అధిష్టానపీఠం మట్టిలో కూరుకునిపోయివుంది.మరొకచోట గరుడాళ్వారు విగ్రహం ఉంది.ధ్వజస్తంభం గద్దెగూటిలో మరోగరుడాళ్వారు శిల్పముంది.వూరికి దక్షిణాన వున్న తొగుడ వేంకటేశ్వరాలయం ప్రత్యేకం.వెంకన్న మట్టిపుట్టరూపంలో వెలిసాడు.అర్చామూర్తులను వేరే తయారు చేయించిపెట్టారు.గర్భగుడి ద్వారపాలక విగ్రహం 16వ శతాబ్దకాలపు శైలిలో ఉంది.గుడికి ఆనుకుని ధర్మశాల ఉంది. ప్రస్తుతం 14గో తరం పూజారి శ్రీధరస్వామి గుడిని నిర్వహిస్తున్నాడు.వూరిలో 86 ఏళ్ళ కిందట కట్టిన జామామసీదు కచేరీప్రాంతంలోనే ఉంది.వూరికి ఆగ్నేయాన వున్న చిన్నబోడు మీద పులిదొనెవుంది.ఒకప్పుడు అందులో పులిజాడ వుండేదని, ఆ చుట్టుపక్కల కొత్తరాతియుగపు నాటి రాతిపనిముట్లు లభించేవని అక్కడ టీచరుగా పనిచేసిన విరువంటి గోపాలకృష్ణగారు చెప్పారు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి రాజాపేటలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రాజాపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల రాయిగిరిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ యాదగిరిగుట్టలోను, మేనేజిమెంటు కళాశాల రాయిగిరిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం భువనగిరిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

బొందుగులలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

బొందుగులలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

బొందుగులలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 224 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 134 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 206 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 151 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 81 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 430 హెక్టార్లు
  • బంజరు భూమి: 620 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 567 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1410 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 207 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

బొందుగులలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 135 హెక్టార్లు* చెరువులు: 72 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

బొందుగులలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, ప్రత్తి[6]

‘సిపాయిల పల్లె’గా

[మార్చు]

తెలంగాణా సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న ఈ గ్రామం, ప్రస్తుతం సైనికుల పల్లెగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని దాదాపు 30 మందికి పైగా యువకులు సైనిక ఉద్యోగులుగా దేశ రక్షణలో పనిచేస్తున్నారు. దాదాపు ముప్పై ఏండ్ల క్రితం ఈ గ్రామానికి చెందిన గడ్డమీది మల్లేశ్‌ తొలిసారిగా ఆర్మీలో చేరాడు. మల్లేశ్ స్వగ్రామానికి వచ్చినపుడు సరిహద్దు అనుభవాలను స్థానికులతో పంచుకుంటూ, ఆర్మీ ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగించేవాడు. దాంతోపాటు పది, ఇంటర్‌ పాసైనవారు కూడా ఆర్మీ ఉద్యోగాలను సాధించడంతో ప్రస్తుతం 30 మందికి పైగా ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.[7]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Bondugula Village". www.onefivenine.com. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  3. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "Bondugula Village in Rajapet Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  5. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  6. "Bondugula Population (2020/2021), Village in Rajapet Mandal, Pincode". www.indiagrowing.com. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  7. నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (6 November 2021). "జై జవాన్‌ పల్లె!". Namasthe Telangana. గంజి ప్రదీప్‌ కుమార్‌. Archived from the original on 7 నవంబరు 2021. Retrieved 8 November 2021.

గణాంక వివరాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బొందుగుల&oldid=3798756" నుండి వెలికితీశారు