నిర్మల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ను చూపిస్తున్న పటం
Location of
  
విస్తీర్ణం 32.06 కి.మీ² (12 చ.మై)[1]
జిల్లా (లు) నిర్మల్ జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
88,433[2][3] (2011 నాటికి)
• 2,758/కి.మీ² (7,143/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం నిర్మల్ పురపాలక సంఘము


నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[4] ఈ జిల్లా 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.ఈ పట్టణం హైదరాబాద్ నుంచి ఉత్తరంగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గోదావరి నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.

పటం
నిర్మల్ జిల్లా

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు[మార్చు]

ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (నిర్మల్, భైంసా), 18 రెవెన్యూ మండలాలు, 424 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 28 నిర్జన గ్రామాల ఉన్నాయి.కొత్తగా ఏర్పడిన మండలాలు 6 (ఆరు)

స్థానిక స్వపరిపాలన[మార్చు]

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 396 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[5]

గణాంక వివరాలు[మార్చు]

నిర్మల్ వర్ణచిత్రము

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,39,570 - పురుషులు 68,274 - స్త్రీలు 71,296

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • నిర్మల్

వ్యవసాయం, పంటలు[మార్చు]

నిర్మల్ కొయ్య బొమ్మలు

నిర్మల్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 6068 హెక్టార్లు, రబీలో 1397 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[6]

నిర్మల్ కొయ్యబొమ్మలు[మార్చు]

నిర్మల్ కొయ్య బొమ్మలు

నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. దీనికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది. 1830ల్లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా వ్రాశారు. నిర్మల్ బొమ్మలు, పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు. ఐతే అతిపరిచయం వల్ల కలిగే ఉదాసీనతతో తమ బొమ్మల విశిష్టత తాము తెలియకున్నారని, అందుకే ఒక ఇంట్లో చూసినా నిర్మల్ పంచపాత్రలు వాడుకలో కనిపించట్లేదని వ్రాశారు.[7] 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పర్చారు.[8] రాష్ట్రపతిచే అవార్డు కూడా పొందినారు.

చరిత్ర[మార్చు]

కొయ్య బొమ్మలు

నిర్మల్‌ని 1830లో సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని వర్ణించారు. ఆయన వ్రాసినదాని ప్రకారం నిర్మల (నాటి పేరు) అనే ఊరు పట్టణం వంటిది, అన్ని రకాల పదార్థాలూ దొరికేవి, అన్ని పనులవాళ్ళూ ఉండేవాళ్ళు. ఊరు మధ్యలో కూడా చిన్న చిన్న కొండలు ఉన్నాయని, గొప్ప ఇళ్ళు ఉన్నాయని, ఊరు చుట్టూ తోటలు, చెరువులు కనిపిస్తున్నాయని వ్రాశారు. గ్రామంలో బ్రాహ్మణమండలి ఉండేదని, దానికి సభాపతిగా ఒక బ్రాహ్మణుడున్నాడని, ఆయన ఉచితమని యెంచి చెప్పిన మాటను బ్రాహ్మణులు యోచించి గౌరవిస్తున్నారని వ్రాశారు.

ఏనుగుల వీరాస్వామయ్య మాటల్లో ఆనాటి నిర్మల పట్టణం[మార్చు]

31 తేది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరు 4 ఘంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు ప్రక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది. నదిదాటగానే ఒక బంగాళా జాతులవాండ్లు దిగడానికి యోగ్యమయినదిగా నున్నది. యివతల చిన్న యూళ్ళు మూడున్నవి. కొన్ని మజబూతి అయిన పాడుకోట లున్నవి. నిర్మల అనేయూరు పట్టణం వంటిది. సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పని వాండ్లున్నారు. ఊరుచుట్టున్నూ, ఊరు నడుమనున్ను చిన కొండలు నిండా ఉన్నాయి. గొప్ప యిండ్లు ఉన్నాయి. ఊరికి చుట్టున్ను, తొటలు, చెరువులు కలిగి యున్నవి. ఇక్కడ అరికాటి నబాబు కింద లోగడ రాయిజీ* సర్వాధికారిగా ఉన్నట్టు ఒక పరగణాదారుడు ఉన్నాడు. దేశముఖి, దేశపాండ్యాలు ఉన్నారు. కొత్తవాలు మొదలయిన యధికారస్థులున్నారు. 100 బ్రాంహ్మణ యిండ్లును, ఒక దేవాలయమున్నూ ఉన్నాయి. అక్కడ నేను దిగినాను. యిట్లా గొప్ప యూళ్ళలో నుండే బ్ర్రాంహ్మణ మండలికి సభాపతి అనే ఒక బ్రాహ్మణుదు ఉన్నాడు. అతని యూజ్ఞకు తక్కిన వారు యధోచితముగా లోబడి యున్నారు. నిర్మల పంచపాత్రలు ఈప్రాంతములలో బహు ప్రసిద్ధిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. అయితే కూతురి ప్రౌఢమ తండ్రికి ఏప్రకారము అనుభవానికి రాదో అలాగే ఆయాపదార్ధాలు పుట్టే స్థలముల యందు అచ్చటివారికి అనుభవానికి రావు. అందుకు దృష్టాంత మేమంటే యిక్కడచేసే పంచపాత్ర యొకటి చూతామన్నా యీ యూరున దొరికినదికాదు.[7]

తెలంగాణ విమోచనోద్యమం[మార్చు]

ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది.[9] ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది,

వెయ్యి ఉరులమర్రి సంఘటన[మార్చు]

తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన వెయ్యి ఉరులమర్రి సంఘటన నిర్మల్ పట్టణ శివారులోని ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టు వద్ద జరిగింది. పట్టణ, పరిసర గ్రామప్రజలు గిరిజన నాయకుడు రాంజీగోండు ఆధ్వర్యంలో నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నిజాం సైనికులపై దాడులు చేసి వారిని గజగజలాడించారు. రాంజీగోండు ఆధ్వర్యంలోని కొందరు లంచాలకు ఆశపడి గోండు ఆచూకిని నిజాంకు తెలియజేశారు. దీనితో నిజాం సైనికులు రాంజీగోండును సోన్ సమీపంలో గోదావరి నది ఒడ్డున పట్టుకున్నారు. ఆయనతోపాటు వెయ్యిమంది అనుచరులను నిర్మల్ నుండి బత్తీస్‌గడ్ వైపు వెళ్ళు రహదారిలో ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకు నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు.[10] చాలాకాలం పాటు ఈ చెట్టు విమోచనోద్యమ అమరవీరులకు గుర్తుగా మిగిలింది. భారీవర్షాలకు ఈ చెట్టు కూకటివేళ్ళతో సహా కూలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది. ఏటా సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు.

ప్రముఖులు[మార్చు]

జిల్లాలోని మండలాలు[మార్చు]

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలతో కాగా, 6 కొత్తగా ఏర్పడిన మండలాలు.[4]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

జిల్లా సరిహద్దులు[మార్చు]

● ఉత్తరం- ఆదిలాబాద్

● ఈశాన్యం-కుంరం భీం ఆసిఫాబాద్

● తూర్పు-మంచిర్యాల

● దక్షిణ-జగిత్యాల

● పశ్చిమ-నాందేడ్ మహారాష్ట్ర

ప్రాజెక్టులు[మార్చు]

● కడెం ప్రాజెక్టు

● స్వర్ణ ప్రాజెక్టు

● గడ్డన్న- సుద్దవాగు ప్రాజెక్టు

● సదర్మాట్ ప్రాజెక్టు

● మాడకుపల్లి ప్రాజెక్టు

దేవాలయాలు[మార్చు]

● జ్ఞాన సరస్వతి దేవాలయం- బాసర

● ఆడెల్లి పొచ్చమ్మ ఆలయం-సారంగ పూర్

● పాపేశ్వరాలయం-కదిలి

● నరసింహ స్వామి దేవాలయం-కల్వ

కోటలు[మార్చు]

● నిర్మల్ కోట

● శ్యామ్ ఘర్ కోట

● బత్తిస్ గడ్ కోట

జాతరాలు[మార్చు]

1.కోతి దేవుని జాతర

2.అడెల్లి పొచ్చమ్మ జాతర

నదులు[మార్చు]

1.కడెం నది

2.గోదావరి

3.స్వర్ణ నది

4.సుద్ద వాగు

పరిశ్రమలు[మార్చు]

1. బీడీ పరిశ్రమ

2. పత్తి జిన్నింగ్ మిల్లులు

విశేషాలు[మార్చు]

● నిర్మల్ కొయ్య బొమ్మలు

●రాంజీ గోండ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమారుడైన ప్రాంతం

●పత్తి కొనుగోలు కేంద్రం-బైంసా

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "District Census Handbook – Adilabad" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 13, 44. Retrieved 13 May 2016.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  4. 4.0 4.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2018-09-15.
  6. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 288
  7. 7.0 7.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  8. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, 2008, పేజీ 278
  9. సాక్షి -దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2010
  10. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, 2008, పేజీ 273

వెలుపలి లంకెలు[మార్చు]