Coordinates: 19°11′42″N 78°38′07″E / 19.195080°N 78.635212°E / 19.195080; 78.635212

పెంబి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెంబి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, పెంబి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, పెంబి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, పెంబి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°11′42″N 78°38′07″E / 19.195080°N 78.635212°E / 19.195080; 78.635212
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం పెంబి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 316 km² (122 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 13,903
 - పురుషులు 6,923
 - స్త్రీలు 6,980
పిన్‌కోడ్ 504102


పెంబి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు, చెందిన మండలం.[1] పెంబి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు పెంబి గ్రామం అదిలాబాదు జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని ఖానాపూర్ మండల పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెంబి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+11 (పదకొండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 316 చ.కి.మీ. కాగా, జనాభా 13,903. జనాభాలో పురుషులు 6,923 కాగా, స్త్రీల సంఖ్య 6,980. మండలంలో 3,200 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. పస్పుల
  2. ఇటిక్యాల్
  3. గుమ్మనుయెంగ్లాపూర్
  4. ధోందారి
  5. వస్పల్లి
  6. షెట్‌పల్లి
  7. కోసగుట్ట
  8. పెంబి
  9. వెంకంపోచంపాడ్
  10. బూరుగుపల్లి
  11. మండపల్లి
  12. నాగ్‌పూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.