నిర్మల్ రెవెన్యూ డివిజను
నిర్మల్ రెవెన్యూ డివిజను | |
|---|---|
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నిర్మల్ |
నిర్మల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిర్మల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 12 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నిర్మల్లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, నిర్మల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]నిర్మల్ డివిజనులోని మండలాలు:[4]
| క్ర.సం | నిర్మల్ రెవెన్యూ డివిజను | రెవెన్యూ
గ్రామాలు |
నిర్జన
గ్రామాలు |
|---|---|---|---|
| 1 | నిర్మల్ గ్రామీణ మండలం | 29 | 2 |
| 2 | నిర్మల్ మండలం | 4 | – |
| 3 | సోన్ మండలం | 14 | – |
| 4 | దిలావర్ పూర్ మండలం | 20 | 5 |
| 5 | నర్సాపూర్ (జి) మండలం | 21 | 3 |
| 6 | కడం పెద్దూర్ మండలం | 29 | – |
| 7 | దస్తూరబాద్ మండలం | 8 | – |
| 8 | ఖానాపూర్ మండలం | 21 | – |
| 9 | మామడ మండలం | 33 | 4 |
| 10 | పెంబి మండలం | 12 | – |
| 11 | లక్ష్మణ్‌చాందా మండలం | 18 | – |
| 12 | సారంగపూర్ మండలం | 27 | 2 |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-02-27.
- ↑ "REVENUE DIVISIONS | Nirmal District | India". www.nirmal.telangana.gov.in. Archived from the original on 2022-01-31. Retrieved 2022-02-27.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-02-27.