Coordinates: 18°52′43″N 77°57′19″E / 18.878507°N 77.955181°E / 18.878507; 77.955181

బాసర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాసర మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, బాసర మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, బాసర మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, బాసర మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°52′43″N 77°57′19″E / 18.878507°N 77.955181°E / 18.878507; 77.955181
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం బాసర
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 110 km² (42.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 19,354
 - పురుషులు 9,556
 - స్త్రీలు 9,798
పిన్‌కోడ్ 504102


బాసర మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. బాసర, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ.,నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది.ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు బాసర  గ్రామం అదిలాబాదు జిల్లా నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని ముధోల్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బాసర గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, భైంసా రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+14 (పదిహేను) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 110 చ.కి.మీ. కాగా, జనాభా 19,354. జనాభాలో పురుషులు 9,556 కాగా, స్త్రీల సంఖ్య 9,798. మండలంలో 4,373 గృహాలున్నాయి.[5]

మండలంలోని దర్శించతగిన ప్రదేశాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కిర్గుల్ (ఖుర్ద్)
  2. కిర్గుల్ (బుజుర్గ్)
  3. కౌట
  4. తక్లి
  5. దొండాపూర్
  6. బాసర
  7. బిద్రల్లి
  8. మైలాపూర్
  9. రేణుకాపూర్
  10. రవిందాపూర్
  11. లబ్డి
  12. వోని
  13. శలాపూర్
  14. సావర్‌గావ్
  15. సుర్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.