సామల సదాశివ
సామల సదాశివ | |
---|---|
![]() సామల సదాశివ | |
జననం | సామల సదాశివ మే 11 , 1928 ఆదిలాబాదు జిల్లా, దహేగావ్ మండలం తెలుగు పల్లె |
మరణం | ఆగష్టు 7, 2012 ఆదిలాబాదు |
ఇతర పేర్లు | సామల సదాశివ |
ప్రసిద్ధి | ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు. |
Notes కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత |
సామల సదాశివ (మే 11, 1928 - ఆగష్టు 7, 2012) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. తెలంగాణకు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు.[1] హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత.
జననం[మార్చు]
సదాశివ కొమరంభీం జిల్లా, దహేగావ్ మండలం తెలుగుపల్లెలో 1928, మే 11 న జన్మించాడు.
రచనా ప్రస్థానం[మార్చు]
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు గుర్తుకొస్తాయి. ఇంక అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడా గుర్తుకొస్తాయి. మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదము) వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. ఆమూలాగ్రం చదివిస్తాయి.
సదాశివకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో సదాశివ వ్యాసాలు అనేక ఏళ్ళుగా ప్రచురించబడ్డాయి.
మలయ మారుతాల్లో అతడు మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్నీ, వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తాడు. తరువాత ఇక మనము హిందుస్తానీ రాగాల్ని రేడియో లోనో, క్యాసెట్ల రూపంలోనో, ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలేనంతగా మనలో హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగిస్తాడు.
రచనలు[మార్చు]
- శ్రీ సాంబశివ శతకము 1950
- నిరీక్షణము (ఖండకావ్యము)1952[2]
- మంచిమాటలు
- ఉరుదు భాషాకవిత్వ సౌందర్యం
- ఫారసీ కవుల ప్రసక్తి
- ఉర నీ ఈ nice idiot
పురస్కారాలు[మార్చు]
- 1964 : "అమ్జద్ రుబాయిలు" అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తింపు.
- 1994 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి ప్రతిభ పురస్కారం.
- 1998 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి గౌరవ డాక్టరేట్.
- 2002 : కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
- 2004 : పాలురికి సోమనాథ కళాపీఠం స్వచ్ఛంద భాష సేవా పురస్కారం.
- 2008 : వై.యస్.ఆర్ చేతుల మీదుగా ప్రతిభా రాజీవ్ పురస్కారం.
- 2007 : తెలుగు భాష బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు సంస్కృతి వికాస వేదిక, తిరుపతి వారిచే ఆత్మీయ పురస్కారం.
- 2008 : ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు వారిచే డా.అంజిరెడ్డి ధర్మనిథి సాహిత్య పురస్కారం.
- 2008 : మైసూరు తెలుగు సంఘం వారిచే ఆత్మీయ పురస్కారం.
- 2009 : సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు వారిచే ప్రతిభా పురస్కారం.
- 2010-11 : ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖవారి కళారత్న పురస్కారం.
- 2011 : కాళోజీ స్మారక పురస్కారం.
- 2011 : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
మరణం[మార్చు]
సదాశివ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో ప్రవేశించి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యి ఆదిలాబాదు పట్టణంలో స్థిరపడి 2012, ఆగష్టు 7 న మరణించాడు.
మూలాలు[మార్చు]
- ↑ http://www.hindu.com/lf/2005/02/02/stories/2005020214040200.htm[permanent dead link]
- ↑ సామల సదాశివ (1952). నిరీక్షణము. Retrieved 19 April 2015.
- All articles with dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2021
- Articles with permanently dead external links
- 1928 జననాలు
- హిందుస్థానీ సంగీత గాయకులు
- ఉర్దూ రచయితలు
- తెలుగు రచయితలు
- సంస్కృత రచయితలు
- తెలుగువారిలో సంగీతకారులు
- 2012 మరణాలు
- ఆత్మకథ రాసుకున్న తెలంగాణ వ్యక్తులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు