గణపతి దేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకం చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన వారిలో కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు).

కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.[1] సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.[2]

పాలనా విధానం[మార్చు]

కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామంతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో వ్యవసాయము, వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులను ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.

రాజ్యవిస్తరణ[మార్చు]

తీరాంధ్రవిజయము[మార్చు]

గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1201లో జరిగిన మొదటి దండయాత్రలో బెజవాడ స్వాధీనము చేసుకున్నాడు. అటునుండి దివిసీమకు మరలాడు. అచట అయ్య వంశమునకు చెందిన పినచోడి పాలిస్తున్నాడు. తీవ్ర ప్రతిఘటన అనంతరము పినచోడి లొంగిపోయాడు. పినచోడి కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను గణపతి వివాహమాడి, కొడుకు జాయప సేనానిని కాకతీయ గజసైన్యాధికారిగా నియమిస్తాడు. దీనితో వెలనాడు కాకతీయ రాజ్యములో కలిసిపోయింది. 1209 ఇడుపులపాడు (బాపట్ల తాలూకా) శాసనము ప్రకారము కమ్మనాడు, వెలనాడు ఈ దండయాత్రలో జయించబడ్డాయి. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. . నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంలోకి తెచ్చాడు.[3] గణపతి దేవునికి కుమారులు లేనందున ఇతని అనంతరం కూతురు రుద్రమదేవి అధికారంలోకి వచ్చింది.[4]

దక్షిణదేశ దండయాత్ర[మార్చు]

నెల్లూరు, కడప, చెంగల్ పట్టు ప్రాంతములకు తమ్ముసిధ్ధి రాజు. ఇతడు మనుమసిధ్ధి మూడవ కొడుకు. తన అన్నలు తిక్క, నల్లసిద్ధి లను నిర్వీర్యులను చేసి పాలించుతుండగా తిక్కభూపాలుడు తమ్ముసిద్ధిని గద్దె దించుటకు గణపతిదేవుని ఆశ్రయించుతాడు. గణపతి నెల్లూరు రాజ్యమును జయించి తిక్కభూపాలునకు అప్పగించి వెడలుతాడు. జాయప నాయుడు 1213లో వేయించిన చేబ్రోలు శాసనములో ఈ వివరాలున్నాయి. తదుపరి జరిగిన గణపతిదేవుని యుద్ధములలో తిక్క పలుమార్లు చేయందిస్తాడు. కంచి చోళులను, కడప వద్ద సేవణులను, కళింగులను ఓడించుటలో తిక్క హస్తమున్నది.[5]

కొలను విజయము[మార్చు]

పాండ్య రాజ్య విజయము[మార్చు]

సామంతరాజులు[మార్చు]

రేచెర్ల నాయకులు[మార్చు]

మల్యాల నాయకులు[మార్చు]

అయ్య వంశస్థులు[మార్చు]

తెలుగు చోళులు[మార్చు]

పొత్తాపి నాయకులు[మార్చు]

అద్దంకి నాయకులు[మార్చు]

1208-09 ప్రాంతములో అద్దంకిని చక్రనారాయణ వంశస్థులైన మహామండలేశ్వరుడు యాదవ మహారాజు పాలిస్తున్నాడు. శాలంకాయన గోత్రీకుడు. దీనిని బట్టి వీరు సా.శ. 4-5 శతాబ్దములలో పాలించిన శాలంకాయనుల శాఖీయులు కావచ్చును. 1239 సంవత్సరపు సారంగధరదేవుని శాసనము ప్రకారము యాదవ మహారాజు గణపతిదేవునికి సామంతునిగా ఉన్నాడు. తరువాత రాజ్యాన్ని యాదవుని కుమారుడు సింహళదేవుడు 1257 వరకు పాలించాడు.

నిడదవోలు చాళుక్యులు[మార్చు]

రాజ్య పాలన[మార్చు]

గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాలపాటూ సుభిక్షంగా పరిపాలించాడు. రాజ్య వారసుడి కోసం పరితపించిన గణపతిదేవుడికి తన భార్య వల్ల రుద్రమదేవి, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఫలితం లేకపోవడంతో తన సైన్యంలో దూర్జయ వంశానికి చెందిన సైన్యాధ్యక్షుడు జయపసేనాని యొక్క చెల్లెళ్ళు నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. 1262 లో రాజ్య భారాన్ని రుద్రమదేవికి అప్పగించాడు.

సైనిక పాలన[మార్చు]

సాంఘిక పరిస్థితులు[మార్చు]

వర్తకము[మార్చు]

రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అభివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుండి వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరం వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు.[6] మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడా ఎగుమతి అయ్యేవి.

గణపతిదేవుని శాసనాలు[మార్చు]

  • మోటూపల్లి అభయ శాసనం.[7]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, 10వ ముద్రణ (1990) పేజీ 113
  2. www.gloriousindia.com/history/kakatiya dynasty
  3. <www.aponline.gov.in/history medieval Archived 2005-12-19 at the Wayback Machine
  4. "www.telangana.com/History/kakatiyas". Archived from the original on 2010-11-03. Retrieved 2010-01-07.
  5. Kakati Ganapatideva and His Times by P. Sivunnaidu, 2004, Kalpaz Publication, New Delhi
  6. The Travels of Marco Polo: The Complete Yule-Cordier Edition By Marco Polo, Sir Henry Yule, Henri Cordier, 1993, p.363, ISBN 0-486-27587-6
  7. The Motupalli Inscription of Ganapatideva, 1244-1245, Epigraphica Indica Vol. XII, Ed. by E. Hultzsch